Anushka Shetty Malayalam film Kathanar : ప్రముఖ హీరోయిన్ అనుష్కాశెట్టి నటించిన 50వ సినిమా‘కథనార్’ (Malayalam film Kathanar ). మలయాళంలో ఆమె నటించిన తొలి సినిమా ఇది. జయసూర్య, ప్రభుదేవా, సనూప్ సాన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో నీల అనే పాత్రలో అనుష్కాశెట్టి నటించారు. ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధం అవుతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ (Malayalam film Kathanar Telugu Trailer)ను తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడం భాషల్లో రిలీజ్ చేశారు. త్వరలోనే ఈ సినిమా థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.
‘‘విజ్ఞానం యొక్క రూపం మూలం ఎలా ఉన్నా కూడా.. కాంతూర్ శాలయలో దాన్ని ఆహ్వానిస్తారు.’,
‘ఇంద్రజాలాన్ని నేను నమ్మను.. అవగాహనతో రహస్య మార్గాలలో వాళ్లు దాన్ని పరిశోధిస్తున్నారు..’
‘ ఎవరి ఊహకి అందని.. అందరూ ఆశ్చర్యంతో చూసే ఒక మాయా జాలం..’
‘మన ఆత్మతో కలిసి మన జ్ఞాపకాలతో ఐక్యం కాబోయే ఒక సంఘటన..
‘చేర మహారాజుకి కుంచమున్ తరుపున శుభాకాంక్షలు’..
‘చూసినది విన్నది ఏదీ రాదు.. వచ్చేది ఒక్కటే..’

‘ఆపత్కాలంలో వచ్చే మహా మనిషి అగ్ని ఒక్కటే’..
‘కరం కలిస్తే ఆప్యాయిత.. కరం వెడిస్తే నాశనమే బలం’..
‘ఒక శరీరాన్ని అదుపు చేసే ఎక్కువ శక్తిని మీరు నియంత్రించగలిగారు.. ఎలాగా?’..
‘మేం చెప్పేది నమ్మండి. వేనాడు ఆపదలో ఉంది’..
‘మాయ.. ప్రపంచమే మాయ’ అనే సంభాషణలు ‘కథనార్’ సినిమా తెలుగు ట్రైలర్‌లో ఉన్నాయి.
శాండీ, దేవిక, నితీష్ భరద్వాజ్, వినీత్, హరీష్ ఉత్తమన్, శ్రీకాంత్ మురళి, కులప్రీత్ యాదవ్‌లు ఈ సినిమా లోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. రోజిన్ థామస్ దర్శకత్వంలో, గోకులం గోపాలన్ ఈ సినిమాను నిర్మించారు. గతంలో ఈ సినిమాను ప్రకటించినప్పుడు, పది హేను భాషల్లో రిలీజ్ చేయాలనుకుంటు న్నారు. అలాగే ఈ ‘కథనార్’ చిత్రాన్ని రెండు భాగాలుగా, రిలీజ్ చేయన్నట్లుగా గతంలో మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.