మలయాళ సినిమా సంభవం అధ్యాయం ఒన్ను (ఓటీటీ) రివ్యూ…రక్తబలి అంటే..?

Viswa
4 Min Read

Web Stories

Sambhavam Adhyayam Onnu Review: మలయాళ సినిమాలంటే తెలుగు ప్రేక్షకులు కాస్త ఎక్కువ ఇంట్రెస్ట్‌ చూపిస్తుంటారు. పోన్‌మాన్‌, సూక్ష్మదర్శిని, కిష్కింధకాండ, మంజుమ్మెల్‌ బాయ్స్‌…ఇలా వచ్చిన మలయాళ చిత్రాలను తెలుగు ఆడియన్స్‌ తెగ చూసేశారు. రీసెంట్‌గా ‘సంభవం అధ్యాయం ఒన్ను’ అనే మలయాళ సినిమా హాట్‌స్టార్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ సినిమా గురించి తెలుగు ఆడి యన్స్‌, ఓటీటీ లవర్స్‌ చర్చించుకుంటున్నారు. మరి…ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి రివ్యూలో చదివేయండి.

సినిమా సంభవం అధ్యాయం ఒన్ను (Sambhavam Adhyayam Onnu Review)
నటీనటులు: అస్గర్‌ అలీ, అస్సిమ్‌ జమీల్, వినీత్‌కుమార్, సిద్ధార్థ భరతన్, సెంథిల్‌ కృష్ణ, గౌరి వినీత్‌
దర్శకత్వం జీతూ సతీషన్‌
స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ జియో హాట్‌స్టార్‌
రేటింగ్ 3/5 (Sambhavam Adhyayam Onnu Review and Rating)

 

Sambhavam Adhyayam Onnu Review:కథ

కర్ణాటక–తమిళనాడు సరిహద్దులోని ఫారెస్ట్‌ లొకేషన్‌లోని ఓ పోలీస్‌స్టేషన్‌కు సీపీఓగా ఆనంద్‌ (అస్గర్‌ అలీ) బదిలీ అవుతాడు. కొత్త పోలీస్‌ స్టేషన్‌లో చార్జ్‌ తీసుకునేందు కు వెళ్తుండగా, దారిలో అతను ప్రయాణిస్తున్న కారు డ్రైవర్‌…. పీటర్‌ అనే పోలీస్‌ ఆఫీసర్‌ను జీపుతో గుద్దేస్తాడు. గాయపడ్డ పోలీస్‌ ఆఫీసర్‌ను ఆనంద్‌ హాస్పిటల్‌లో జాయిన్‌ చేస్తాడు. అయితే పీటర్‌ వాకీ టాకీ ఆనంద్‌ దగ్గర ఉండిపోతుంది. ఆనంద్‌ జాయిన్‌ అవ్వాల్సిన పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ అశోకన్‌ (అస్సిమ్‌ జమాల్‌), మరో పోలీస్‌ ఆఫీసర్‌ రెజీ (వినీత్‌కుమార్‌) హాస్పిటల్‌కి వస్తారు. ఆనంద్‌తో మాట్లాడి, జరిగిన విషయాన్ని తెలుసుకుంటారు. ఆనంద్, అశోకన్, రెజీ హాస్సిటల్‌కి బయలు దేరతారు. ఈ క్రమంలో ఆనంద్‌ దగ్గర వాకీ టాకీలో ‘నన్ను కాపాడండి’ అంటూ స్టీఫెన్‌ జార్జ్‌ అనే పోలీస్‌ ఆఫీసర్‌ మాట్లాడతాడు. దీంతో ఆనంద్, అశోకన్, రెజీలు అడవిలోకి వెళ్తారు. అక్కడ మనిషి మొండానికి కాకి తల ఉండే ఓ దేవాలయం కనిపిస్తుంది. అక్కడికి చేరుకోగానే, స్టీఫెన్‌ తాను ఉన్నది 1994 సంవత్సరం మే నెలలో అని చెప్తాడు. దీంతో ఆనంద్‌ షాక్‌ అవుతాడు. ఎందుకంటే..ఆనంద్‌ ఉన్నది 2024 టైమ్‌లో… అన్నమాట. అసలు…మూప్పై సంత్సరాల క్రితం అడవిలో తప్పిపోయిన వ్యక్తితో ఇప్పుడు ఆనంద్‌ ఎలా మాట్లాడగ లుగుతున్నాడు? అసలు ఆ దేవాలయం నేపథ్యం ఏమిటి? అక్కడ రక్తం చిందినా, పెద్ద శబ్ధం వినిపించినా ఎందుకు కాలమాన పరిస్థితులు మారిపోతుంటాయి? అనేది సినిమాలో చూడాలి (Sambhavam Adhyayam Onnu Review and Story).

 

విశ్లేషణ

సూర్య 24, తేజా సజ్జా అద్భుతం, శింబు మానాడు…ఇలా టైమ్‌ ట్రావెల్, టైవ్‌ లూప్‌ కాన్సెప్ట్‌తో కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ ఇవన్నీ ఒక ఇన్సిడెంట్‌ ఆధారంగానే ఉంటాయి. కానీ ‘సంభవం అధ్యాయం ఒన్ను’ సినిమా కాన్సెప్ట్‌ మాత్రం డిఫరెంట్‌. ఈ సినిమాలో మల్టీఫుల్‌ కాన్సెప్ట్స్, మల్టీఫుల్‌ టైమ్‌లైన్స్‌లో, మల్టీఫుల్‌ టైమ్‌లూప్‌లో కథనం సాగుతుంటుంది.

ఇదొక టైమ్‌లూప్‌ ఇన్వెస్టిగేషన్‌ అండ్‌ సైకలాజికల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ డ్రామా. ఓ పోర్చుగీసు లేడీ, ఓ ఇండియన్‌ అమ్మాయిని చంపేసిన సీన్‌తో సినిమా మొదలవుతుంది. ఇది 1960 టైమ్‌.

ఆ తర్వాత 2024లోకి కథ వస్తుంది. మొదల్లో కథ కొంచెం స్లోగా ప్రారంభమైనా, ఆనంద్‌–రెజీ–అశోకన్‌ అడవిలోకి వెళ్లిన తర్వాత ఆసక్తికరంగా మారుతుంది. పీటర్‌ గురించి, 30 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన, రక్తబలి కాన్సెప్ట్, పోర్సుగీసు అధికారి గాబ్రి యోల్‌ ఆంటోనీ ప్రస్తావన..ఇలా వరుస ట్విస్ట్‌లతో కథనం ఎప్పటికప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఆడియన్స్‌ ఊహించని ట్విస్ట్‌లు ఉంటాయి.

స్క్రీన్‌ ప్లే కూడా కాస్త కన్‌ఫ్యూజ్‌గానే ఉంటుంది. ఈ సినిమాను స్టార్ట్‌ టు ఎండ్‌ చూస్తేనే, కథ పట్ల ఓ క్లారిటీ ఉంటుంది. దర్శకుడు కొన్ని చిక్కుముడులు వదిలేసినా…ఇది తొలి అధ్యాయం అని టైటిల్‌లోనే ఉంది కను క, సెకండ్‌ పార్టులో ఈ చిక్కు ముడులను విప్పే ప్రయత్నం చేస్తారెమో చూడాలి.

నటీనటుల పెర్ఫార్మెన్స్‌

ఆనంద్‌ పాత్రలో అస్గర్‌ అలీ (Askar Ali)  అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా ఇంట్రవెల్‌ సంభాషణ, ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్‌ సీన్స్‌లో అస్గర్‌ యాక్టింగ్‌ భలే బాగుంటుంది. స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో అశోకన్‌గా అస్సిమ్‌ అలీ, కీలకమైన రెజీ పాత్రలో వినీత్‌కుమార్‌లు కూడా బాగా యాక్ట్‌ చేశారు. స్టీఫెన్‌ జార్జ్‌గా ఫహద్‌ సిద్ధిఖ్‌ యాక్టింగ్‌ను మెచ్చుకోవాల్సిందే. ఈ రోల్‌తోనే, స్టోరీ టర్న్‌ అవుతుంది. సిద్ధార్థ్‌ భరతన్, కుడస్సనాథ్‌ కనకం, సెంథిల్‌ కృష్ణ వారి వారి పాత్రల పరిధిమేరకు యాక్టింగ్‌ చేశారు (Sambhavam Adhyayam Onnu Movie cast and crew).

జీతూ సతీష్‌న్‌ మంగళతు డైరెక్షన్‌  (Sambhavam Adhyayam Onnu Director) ప్రశంసనీయం. మల్టీ ఫుల్‌ టైమ్‌లైన్, టైమ్‌లూప్, సైకాలజీ …ఈ మూడు కాన్సెప్ట్‌లను భలేగా బ్లెండ్‌ చేశారు. కన్‌ఫ్యూజ్డ్‌ స్క్రీన్‌ ప్లే అయినా..వీలైనంతగా ఆడియన్స్‌కు కథ అర్థమ య్యేలా, చేసిన ప్రయత్నం అభినందనీయం. గాడ్‌విన్‌ థామస్‌ మ్యూజిక్, నవీన్‌ సినిమాటోగ్రఫీ, విష్ణు ఆడియోగ్రఫీ బాగున్నాయి. ఫహద్,ఫయాజ్, ఫరాస్‌ మహమ్మద్‌ల నిర్మాణ విలువలు బాగున్నాయి.

బాటమ్‌లైన్‌: సంభవం అధ్యాయం ఒన్ను సినిమా థ్రిల్లర్‌ జానర్‌ లవర్స్‌కు పర్‌ఫెక్ట్‌ ఎంపిక. అస్సలు నిరుత్సాహపడరు. జనరల్‌ ఆడియన్స్‌ అయితే గ్యాప్‌ ఇవ్వకుండ సినిమా చూడాలి. లేకపోతే స్క్రీన్‌ ప్లే విషయంలో కాస్త కన్‌ఫ్యూజన్‌కు లోనవ్వాల్సి ఉంటుంది. టోటల్‌గా…అన్నీ వర్గాల ఆడియన్స్‌ను అలరించే సైకలాజికల్‌ టైమ్‌లూప్‌ థ్రిల్లర్‌ మూవీ ఇది.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi