Rekhachithram movie Review: మలయాళ ‘రేఖాచిత్రమ్‌’ రివ్యూ

Viswa
3 Min Read
Rekhachithram movie Review

కథ

Rekhachithram movie Review: ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడాడని ఆఫీసర్‌ వివేక్‌ గోపినాథ్‌ను సస్పెండ్‌ చేస్తారు. ఆ తర్వాత మలక్కాపరలోని పోలీస్‌ స్టేషన్‌కు ఎస్‌హెచ్‌ఓ (స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌)గా నియమిస్తారు. వివేక్‌ జాయిన్‌ అయిన రోజే అతనికి ఓ కేసు వస్తుంది. తాను, మరో ముగ్గురు కలిసి ఓ యువతిని పాతిపెట్టామని, ఆ చోటు ఇదేనిని ఫేస్‌బుక్‌ లైవ్‌లో చెప్పి, అక్కడికక్కడే సూసైడ్‌ చేసుకుంటాడు రాజేంద్రన్‌ (సిద్ధిఖీ). దీంతో పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్‌ స్టార్ట్‌ చేస్తారు. ఈ ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా ఓ అస్థిపంజరాన్ని కనిపెడతారు. ఈ అస్థిపంజరం రేఖ అనే అమ్మాయిదని వివేక్‌ కనిపెడతాడు? కానీ సరైన ఆధారాలను మాత్రం సేకరించ లేకపోతాడు. మరోవైపు వివేక్‌కు అడ్డుకట్ట వేయాలని అత్యంత సంపన్నుడైన విన్సెంట్‌ ప్రయత్నాలు చేస్తుంటాడు. మమ్ముట్టీ సినిమా షూటింగ్‌ సమయంలోనే రేఖా ఎందుకు చనిపోయింది? అసలు..రేఖా చనిపోవడానికి గల ప్రధాన కారణం ఏమిటి? విన్సెంట్‌ గతం ఏమిటి? అనేది సినిమాలోని (Rekhachithram movie Review) సస్పెన్స్‌ పాయింట్స్‌.

విశ్లేషణ

రీసెంట్‌ టైమ్స్‌లో మలయాళ క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీస్‌ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ రేఖా చిత్రమ్‌ మూవీ కూడా అలాంటిదే. ఈ సినిమాను పది కోట్ల రూపాయల బడ్జెట్‌తో తీస్తే, రూ. 50 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. కథ చాలా సింపుల్‌. ఓ సంస్థ వచ్చే చారిటీ డబ్బులను కాజేసేందుకువకచ్చన్, పుష్పమ్‌ ప్లాన్‌ చేస్తారు. ఆ సమయంలో ఆ కాన్వెంట్‌కు వచ్చిన కొత్త అమ్మాయి రేఖను చంపి, ఈ డబ్బుతో రేఖ పారిపోయిందని చెప్పి,…వకచ్చన్, పుష్పమ్‌లు ఆ డబ్బు కాజేస్తారు….ఇదంతా..1985లో జరుగుతుంది. ఈ సంఘటనను వివేక్‌ అనే అఫీసర్‌ ఇప్పుడు ఎలా ప్రూవ్‌ చేశాడనే పాయింట్‌నే సినిమాలో కీలకం. రేఖ కేసు ప్రారంభం కాగానే విన్సెంట్‌ భయపడటం, వివేక్‌ ఎంక్వైరీ చేసిన ఒక్కొక్కరినీ..విన్సెంట్‌ చంపించేయడం…వంటి సీన్స్‌…అసలైన నేరస్తుడు విన్సెంట్‌నే అని కన్ఫార్మ్‌ చేస్తాయి. కానీ దీనికి వివేక్‌ ఎలా ప్రూవ్‌ చేశాడనే పాయింట్‌ను ఎంగేజింగ్‌గా చెప్పడంతో దర్శకుడు జోసిఫ్‌ టి. చాకో (Rekhachithram movie Director) సక్సెస్‌ అయ్యాడు. సినిమాల్లో హీరోయిన్‌ అవ్వాలని వచ్చే రేఖా సీన్స్‌ కాస్త ఆడియన్స్‌ సహనాన్ని పరీక్షిస్తాయి. కానీ ఈ సీన్స్‌కు ఆ తర్వాత ఇంపార్టెన్స్‌ ఏర్పడటం అనేది దర్శకుడి ప్రతిభ, స్క్రీన్‌ ప్లే, రైటింగ్‌ స్టైల్‌ని మెచ్చుకునేలా చేస్తాయి. ఒక్క డైలాగ్‌ లేకపోయినా..మమ్ముట్టీ గెస్ట్‌ రోల్‌ సీన్స్‌ బాగుంటాయి. ఫైట్స్, సాంగ్స్, లవ్‌స్టోరీ…గట్రా అనవసరైన ట్రాక్స్‌ జోలికి వెళ్లలేదు దర్శకుడు. క్రైమ్‌ థ్రిల్లర్స్‌ చూసేవారికి ఈ రేఖాచిత్రమ్‌..ఓ మంచి చిత్రమ్‌. అలాగే రేఖను నిజంగా చంపింది ఎవరు? అనే థ్రిల్లింగ్‌ పాయింట్‌ బాగానే ఉంటుంది.

పెర్ఫార్మెన్స్‌

వివేక్‌గా అసిఫ్‌ అలీ (AsifAli) బాగా యాక్ట్‌ చేశాడు. చాలా సీన్స్‌లో సెటిల్డ్‌ పెర్ఫార్మెన్స్‌ చేశాడు. ఇక మమ్ముట్టీ ఫ్యాన్‌గా, హీరోయిన్‌ అవ్వాలనుకునే అమ్మా యిగా…అనస్వర యాక్టింగ్‌ బాగుంటుంది. ఈ సినిమాలో హీరోయిన్‌ కాకపోయినా..ఈ స్థాయి స్క్రీన్‌ ప్రెజెన్స్‌ అనస్వర పాత్రకు దక్కింది. యాక్టింగ్‌ కూడ బాగానే చేసింది. విన్సెంట్‌ అలియాస్‌ వక్కాచాన్‌గా మనోజ్‌. కె. జయన్‌ కనిపిస్తారు. సిద్ధిఖీ పాత్రలో రాజేంద్రన్, కథకు ఎంతో కీలకమైన ఫ్రాన్సిస్‌ తటిత్తల్‌గా సాయికుమార్‌ (మలయాళం నటుడు)లు వారి పాత్రల మేరకు చేశారు. రేఖా సిస్టర్‌గా ఆశగా ప్రియాంకా నాయర్, జాన్‌ పాల్, జగదీష్‌లు గెస్ట్‌ రోల్స్‌లో యాక్ట్‌ చేశారు. టెక్నికల్‌ వెల్యూస్‌ బాగున్నాయి. ఎడిటింగ్‌తో ఇంకాస్త కత్తెర వేయవచ్చు. ముజీబ్‌ ఆర్‌ఆర్‌ ఒకే.

ఫైనల్‌గా..:రేఖాచిత్రమ్‌…చక్కని ఇన్వెస్టిగేటివ్‌ చిత్రమ్‌

రేటింగ్‌: 2.75/5

సోనీలివ్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది.

Share This Article
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *