హీరోల బర్త్ డేల సందర్భంగా, ఆ హీరో సినిమాల అప్‌డేట్స్ రావడం, ఆ అప్‌డేట్స్‌తో ఆ హీరో ఫ్యాన్స్ సోషల్‌మీడియాలో కాస్త హడావిడి చేయడం, వీలైతే ట్రెండ్లోకి తీసుకురావడం ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది.
ఇక ఈ నెల 27న రామ్‌చరణ్ బర్త్ డే (Hero Ramcharan Birthday). ఈ సందర్భంగా రామ్‌చరణ్ కొత్త సినిమాల అప్‌డేట్స్ కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సారి ఫ్యాన్స్‌ని నిరాశపరచకూడదని, ఓ వీడియోను రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు ఈ చిత్రం దర్శకుడు బుచ్చిబాబు సాన. రామ్ చరణ్ కెరీర్‌లోని ఈ 16వ సినిమా (RC16) టైటిల్, రిలీజ్ డేట్ ఈ వీడియోలో ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. వచ్చే ఏడాది మార్చి 26న…అంటే 2026 రామ్‌చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాను రిలీజ్‌కు రెడీ చేయాలన్నది టీమ్ ప్లాన్ అట.
అలాగే గత ఏడాది రామ్‌చరణ్ బర్త్ డే సందర్భంగా సుకుమార్‌తో సినిమా చేయనున్నట్లుగా రామ్‌చరణ్ ప్రకటించాడు. ‘రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత వీరి కాంబోలో రాబోతున్న సినిమాపై (RC17) అంచ నాలు అయితే ఉన్నాయి. ఈ ఏడాది బర్త్ డేకి ఈ సినిమాకు చెందిన మరో అప్‌డేట్ ఉండొచ్చని చరణ్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఇద్దరు బాలీవుడ్ దర్శకులు చెప్పిన కథ విన్నారు రామ్‌చరణ్. తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజన్‌తో చరణ్ ఓ మూవీ చేయాల్సి ఉంది. కేవీన్ ప్రొడక్షన్స్‌తో రామ్‌చరణ్ ఓ సినిమా చేయాల్సి ఉంది. ప్రశాంత్‌నీల్ తో రామ్‌చరణ్ ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇలా…ఈ లైనప్‌లోని సినిమాల అప్‌డేట్స్ కూడా ఏమైనా వస్తాయా? అనేది చూడాలి. ఒకవేళ వస్తే మాత్రం …చరణ్ ఫ్యాన్స్‌కు పండగే. మరి..ఏం జరుగుతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.