మోహన్‌లాల్ హీరోగా 2019లో వచ్చిన ‘లూసీఫర్’ (Mohanlal Empuran Review) సినిమాకు సీక్వెల్‌గా ‘ఏంపురాన్’ (లూసీఫర్ 2) మూవీ రూపొం దింది. ‘లూసీఫర్’ సినిమా అప్పట్లో పెద్ద హిట్‌గా నిలిచింది. దీంతో ‘ఎంపురాన్’ (Empuran Release)మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. పైగా ప్రీ సెల్స్ కూడా రూ. 50 కోట్లు వచ్చాయి. మరి…‘ఎంపురాన్’ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోగలిగిందా (Empuran Release date)? ఎలా ఉంది సినిమా. రివ్యూలో చదవండి.
కథ
కేరళలో రాజకీయ పార్టీ ఐయూఎఫ్ యువనేత, సీయం జితిన్ రామ్‌దాస్ (టోవినో థామస్)….రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం పీకేఆర్ఐయూఎఫ్ అనే కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించాలనుకుంటాడు. ఇందు కోసం ఉత్తరాదికి చెందిన బాబా భజ్రంగ్(అభిమన్యుసింగ్)తో పొత్తు పెట్టు కుంటాడు. కానీ…స్టీఫెన్ నెడుంపల్లి ఆలియాస్ అబ్రహాం ఖురేషీ (మోహన్‌లాల్)కి ఇది నచ్చదు. కేరళకు మంచి చేస్తాడని నమ్మి, సీయం చేస్తే తాను తప్పుడు దారిలో వెళ్తున్నాడని, స్టీఫెన్ అనుకుంటాడు. వెంటనే…జితిన్ రామ్‌దాస్ సోదరి ప్రియ దర్శిని రామ్‌దాస్ (మంజు వారియర్)ను రంగం లోకి దించి, ఐయూఎఫ్ పార్టీ లీడర్‌గా ఉండమని చెబుతాడు. ఈ విషయం భజ్‌రంగ్‌కు తెలిసి, ప్రియదర్శిని టార్గెట్ చేస్తాడు. స్టీఫెన్ అడ్డుపడతాడు. అప్పుడు ఏం జరిగింది? స్టీఫెన్ అలియాస్ ఖురేషీ అబ్రహాం అనుచరుడు సయ్యద్ మసూద్‌కి (పృథ్వీరాజ్ సుకు మారన్), బాబా భజ్రంగ్తో ఉన్న వైరం ఏమిటి? అసలు..అబ్రహాం ఖురేషీకి (lucifer2 Review) ఇంటర్నేషనల్ డ్రగ్ కార్ట్టైల్తో తో ఉన్న వైరం ఏమిటి? అన్నది మిగిలిన కథాంశం (Mohanlal Empuran Review)
విశ్లేషణ
మతం రంగుపులుముకునే రాజకీయం, వారసత్వపు రాజకీయాలు, అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్….ఈ మూడింటిని కలిపి ‘లూఫీసర్ 2’ కథను రెడీ చేసినట్లుఉన్నారు ఈ చిత్రం దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్.తొలిపార్టులో మోహన్‌లాల్ చేసిన స్టీఫెన్ గట్టుపల్లి క్యారెక్టర్, ఐయూఎఫ్ రాజకీయ పార్టీ భవితవ్యంపై కథసాగుతుంది. సయ్యద్ మసూద్ పాత్ర చాలా తక్కువ. కానీ సెకండ్పార్టులో సయ్యద్ మసూద్ పాత్ర, అతని ప్రతీకారం సెం ట్రల్ పాయింట్‌గా కథ రాయబడింది. స్టీఫెన్‌కు, సయ్యద్‌కు …బాబా భజరంగ్ ఎలా కామన్ శత్రువు అయ్యాడు అవుతాడు అనే పాయింట్ ఆసక్తి కరంగా ఉండదు. స్టీఫెన్, సయ్యద్‌లు…కలిసి బాబా భజరంగ్‌ను చంపే రోటీన్ క్లైమాక్స్ ఆడియన్స్‌కు బోర్ కొడుతుంది.
ఓ భారీ హింసాత్మక సీక్వెన్స్‌తో సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత వెంటనే…ఇంటర్నేషనల్ ఏజెంట్స్ ఆపరేషన్. ఆ వెంటనే..కేరళలో ఐయూఎఫ్ పార్టీ వ్యవహారం…ఇలా కథ మూడుముక్కలుగా మొదలై, ఆడియన్స్‌ను కన్ఫ్యూజ్ చేస్తుంది. వీటికి తోడు డిఫరెంట్ టైమ్‌లైన్స్, డిఫరెంట్ ఇంటర్నేషనల్ లొకేషన్స్ కూడా ఇబ్బంది పెడతాయి.

ఎవరు ఎలా చేశారు?
అబ్రహాం ఖురేషీ అలియాస్ స్టీఫెన్ నెడుంపల్లిగా మోహన్‌లాల్ (Mohanlal) నటన ఒకే. యాక్టింగ్ సన్నివేశాలు లేవు. ఎక్స్ప్రెషన్స్, స్టైలిష్ వాకింగ్, యాక్షన్ సీక్వెన్స్‌లతోనే సరిపోయింది. సయ్యద్ మసూద్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) రోల్ ఉన్నంతలో చేశాడు. యాక్టింగ్‌కు స్కోప్ లేదు. డైలాగ్స్, స్క్రీన్ ప్రెజెన్స్ రెండూ తక్కువే.ఉన్నంతో చేశారు. కానీ ఓ దర్శకుడిగా మాత్రం పృథ్వీరాజ్ ఫెయిల్ అయ్యాడు. సినిమా ప్రారంభంలో వచ్చే గర్భవతి సీన్…చాలా అంటే చాలా బాగోలేదు. దర్శకుడిగా పృథ్వీరాజ్ స్థాయిని తగ్గించేలా ఉంది.
ప్రియదర్శిని రామ్దాస్గా మంజువారియర్ బాగా యాక్ట్ చేశారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే అరెస్ట్ సీన్ బాగుంటుంది. యంగ్ సయ్యద్గా..యువ నటుడు కార్తీకేయ ఫర్వాలేదనిపించాడు.జితిన్ రామ్దాస్గా టోవినో థామస్ పాత్ర కాస్త నెగటివ్ షేడ్స్‌లో ఉంటుంది. ఉన్నంతలో చేశాడు. సెకం డాఫ్‌లో ఈ పాత్ర తేలిపోతుంది. బాబా భజ్రంగ్ ఆలియాస్ బల్రాజ్ పటేల్‌గా అభి మన్యుసింగ్ విలన్‌గా చేశాడు. గంభీరంగా, క్రూరంగా స్క్రీన్‌పై కనిపించాడు. రోటీన్ విలన్ రోల్ చేశాడు. జర్నలిస్ట్ గోవర్థన్గా ఇంద్రజిత్ సుకుమారన్, అంతర్జాతీయ గూఢచారి బోరిస్గా ఫ్లైన్, కేంద్రప్రభుత్వ అధికారి కార్తీక్‌గా కన్నడ కిశోర్, విలన్ మున్నాగా సుకాంత్ గోయెల్ వారి వారి పాత్రల పరిధిలో చేశారు. టెక్నికల్‌గా ఈ మూవీ హైస్టాండర్ట్స్లో ఉంటుంది. విజువల్స్, గ్రాండియర్ అదిరిపోయాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త చేయవచ్చు. ఆర్ఆర్ ఒకే.