పవన్‌కల్యాణ్ (Pawankalyan) , రామ్‌చరణ్ (Ramcharan next film) కాంబినేషన్‌లో (Ramcharan Trivikram) ఓ మూవీ రాబోతుంది. కానీ పవన్‌కల్యాణ్, రామ్ చరణ్‌లు కలిసి నటించడం లేదు. ఇంతకీ…విషయం ఏంటంటే…పవన్‌కల్యాణ్‌కు ఇటీవల దర్శ కుడు త్రివిక్రమ్ ఓ కథ చెప్పారు. ఈ కథ పవన్‌కల్యాణ్‌కు బాగా నచ్చింది. అయితే ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండటం, ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలను త్వరితగతిన పవన్‌కల్యాణ్ పూర్తి చేయాల్సి రావడం వంటి కారణాల చేత త్రివిక్రమ్‌కు నో చెప్పారట పవన్‌కల్యాణ్.
అయితే ఈ కథను రామ్‌చరణ్‌తో చేయాల్సినదిగా త్రివిక్రమ్‌కు పవన్‌కల్యాణ్ సూచించారట. రామ్‌చరణ్ కూడా స్టార్ హీరోనే, పైగా త్రివిక్రమ్–రామ్‌చరణ్‌ల కాంబో అంటే అది కచ్చితంగా కొత్తగానే ఉంటుంది. సో…త్రివిక్రమ్ కూడా ఈ సినిమా చేసేందుకు ఓకే చెప్పారట. ఈ సిని మాకు పవన్‌కల్యాణ్ ఓ నిర్మాతగా వ్యవహరించనున్నారు. చాలామందికి అవగాహన ఉండ కపోవచ్చు కానీ, పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అని పవన్‌కల్యాణ్‌కు ఓ నిర్మాణసంస్థ ఉంది. నితిన్ కెరీర్‌లోని 25వ చిత్రం ‘చల్‌మోహన్‌రంగ’ నిర్మాణంలో ఈ ‘పీకే క్రియేటివ్ వర్క్స్’ బ్యానర్ భాగస్వామి అయ్యింది. ఇప్పుడు కొంత గ్యాప్ తర్వాత రామ్‌చరణ్‌తో ఓ సినిమాను నిర్మించేందుకు పవన్‌కల్యాణ్ రెడీ అవుతున్నాడు.
మరోవైపు ప్రస్తుతం రామ్‌చరణ్ ‘పెద్ది’ సినిమా చేస్తున్నాడు. బుచ్చిబాబు సాన ఈ సినిమాకు దర్శకుడు. వెంకట్ సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తారు. ఈ మూవీ తర్వాత సుకుమార్‌తో ఓ సినిమా చేస్తారు రామ్‌చరణ్. ఈ లోపు వెంకటేష్‌తో సినిమా చేస్తారు త్రివిక్రమ్. ఇలా రామ్ చరణ్, త్రివిక్రమ్‌లు వారి ఇమ్మిడియేట్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌ని పూర్తి చేసిన తర్వాత వీరి కాంబి నేషన్‌లోని మూవీ సెట్స్‌కు వెళ్లొచ్చు.