ఈ ఏడాది దసరా సందర్భంగా సెప్టెంబరు 25న పవన్‌కల్యాణ్ (Pawankalyan) ఓజీ (OG Movie) , బాలకృష్ణ ‘అఖండ 2’ (AkhandaThandavam Release) సినిమాలు ఒకే రోజున విడుదల కానున్నాయనే టాక్ తెరపైకి వచ్చింది. అయితే ఈ రెండు సిని మాలు ఒకే రోజు విడుదల కావడం లేదట. బాలకృష్ణ ‘అఖండ 2’ చిత్రం ఆల్మోస్ట్ వాయిదా పడుతుందని, డిసెంబరు 4 లేదా 5న ‘అఖండ 2’ (Akhanda2 Release) చిత్రం రిలీజ్ కానుందని ఫిల్మ్‌నగర్ సమా చారం.
అసలే సినిమాలు లేక అల్లాడుతున్న తెలుగు నిర్మాతలకు ‘ఓజీ, అఖండ 2’ సినిమాలు మంచి అవకాశాలు కాస్త కోలుకోవడానికి. ఇలాంటి తరుణంలో ఈ రెండు చిత్రాలూ ఒకే రోజంటే… జనాలు రెండు సినిమాలు చూసే పరిస్థితి లేదీప్పుడు. కాబట్టి…ఒక సినిమాను వాయిదా వేశా రు. పవన్‌కల్యాణ్ ‘ఓజీ’ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ముందుగా ‘ఓజీ’ సినిమాకు క్లియరెన్స్ ఇచ్చేందుకు అంతా సిద్ధమై నట్లుగా తెలుస్తోంది. దీంతో ‘అఖండ 2’ సినిమాను డిసెంబరు తొలివారానికి వాయిదా వేశారు.

సాధారణంగా డిసెంబరు తొలివారం అంటే కాస్త డల్ సీజన్. కానీ అది ఒకప్పుడు. ఇప్పుడు డిసెంబరు తొలివారంలో విడుదలై, మంచి టాక్ తెచ్చుకుంటే..ఆ సినిమా ఆ నెలంతా ఆడే స్తుంది. క్రిస్మస్ సెలవులను క్యాష్ చేసుకుంటుంది. ‘పుష్ప ది రూల్’ సినిమా ఇందుకు మంచి ఉదాహరణ. 2021లో ‘అఖండ’ కూడా డిసెంబరు 2నే విడుదలైంది. ఇప్పుడు 2025 డిసెంబరు 4 లేదా 5న ‘అఖండ 2’ రిలీజ్‌కు సన్నాహాలు మొదలైయ్యాయి.
ఇంతవరకు బాగానే ఉంది కానీ…డిసెంబరు 5న ప్రభాస్ ‘ది రాజాసాబ్’ (Therajasaab Release date) సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ తరుణంలో డిసెంబరు 4 లేదా 5న ‘అఖండ 2’ అంటే…అప్పుడూ కూడా ఈ రెడింటిలో ఒక సినిమా వాయిదా పడొచ్చు. వీటిలో ఏదో ఒక సినిమా సంక్రాంతి రిలీజ్‌ని టార్గెట్ చేయవచ్చు. ‘అఖండ 2, రాజాసాబ్’ ఈ రెండు చిత్రాలకు వీఎఫ్‌ఎక్స్ వర్క్స్ భారీగా జరగాల్సి ఉంది. ఏ సినిమా వీఎఫ్‌ఎక్స్ పనులు ఆలస్యమైతే, ఆ సినిమా రిలీజ్ వాయిదా ఉంటుంది. మరి..ఏం జరుగుతుందో చూడాలి.