హరిహరవీరమల్లు వీరమల్లు కథ చెప్పిన పవన్‌కల్యాణ్‌

Viswa
PawanKalyan HariHaraVeeraMallu Release postponed once again from june12

‘హరిహరవీరమల్లు’ (HHVM Story)సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్‌కల్యాణ్‌ (pawankalyan) హీరోగా నటించిన ఈ పీరియాడికల్‌ మూవీ రెండు పార్టులుగా విడుదల కానుంది. తొలిపార్టుగా ‘హరిహరవీరమల్లు స్పిరిట్‌ వర్సెస్‌ స్వార్డ్‌’ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంతో మొదలవ్వగా, జ్యోతిక్రిష్ణ దర్వకత్వంతో ముగిసింది. ఏఏం రత్నం, అద్దంకి దయాకర్‌ నిర్మించిన ఈ సినిమా నెల 24న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. ఒకరోజు ముందుగా ‘హరిహరవీరమల్లు స్పిరిట్‌ వర్సెస్‌ స్వార్డ్‌’ సినిమా పెయిడ్‌ ప్రీమియర్స్‌ను తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరిగిన సినిమా మీడియా సమావేశంలో హరిహరవీరమల్లు సినిమా గురించి, కొన్ని ఆసక్తిరమైన విశేషాలు పంచుకున్నారు పవన్‌కల్యాణ్‌. ముఖ్యంగా ఈ సినిమా కథ చెప్పారు.

”క్రిష్ణా నది తీరంలో కొల్లూరులో కోహినూర్‌ వజ్రం ఎలా హైదరబాదీ సుల్తాన్ల దగ్గరకు వెళ్లింది? ఆ తర్వాత వారి దగ్గర్నుంచి ఎలా ఎక్కడెక్కడికి వెళ్లింది? అన్నదే ఈ హరిహరవీరమల్లు సినిమా కథ (Hariaharaveeramallu Story). మొఘల్‌ సామ్రాజ్య నేపథ్యం కూడా ఉంటుంది. మొఘలుల కాలంలో ప్రతి భారతీ యుడు కష్టపడ్డాడు. ఆ సమయంలో వీరమల్లులాంటి వ్యక్తి ఉంటే ఏం జరిగి ఉండేది? అన్నదే కథ. యాక్షన్‌ కొరియోగ్రఫీపై నాకు అనుభవం ఉంది. అందుకే ఈ సినిమాలో ఓ భారీ క్లైమాక్స్‌ను సిద్ధం చేశాం. ఈ సినిమాకు ఈ క్లైమాక్స్‌ ఆయువుపట్టులాంటిది. దాదాపు ఇరవై నిమిషాలు.. ఈ క్లైమాక్స్‌ సీక్వెన్స్‌ ఉంటుంది. యాభై రోజుల పాటు, కష్టపడి చేశాం. మే నెలలో వేసవిలో ఈ సీక్వెన్స్‌ను చిత్రీకరించాము. ఇది అందరికీ నచ్చుతుంది. నిజానికి ఈ సినిమాను రెండు పార్టులుగా తీయాలని మొదట్లో అనుకోలేదు. ఓ దశలో ఇంత పెద్దగా చెప్పాలన్నప్పుడు ఎక్కడో ఒక చోట బ్రేక్‌ పడాలని, ఈ క్లైమాక్స్‌తో ముగిస్తున్నాం. క్రిష్‌గారు మంచి కాన్సెప్ట్‌తో మా ముందుకు వచ్చారు. కానీ క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ వల్ల ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఇలా క్రియేటివ్‌, ఫైనాన్షియల్‌, కోవిడ్‌..ఇలా చాలా ఇబ్బందులను ఈ సినిమాకు ఫేస్‌ చేశాం” అని పవన్‌కల్యాణ్‌ ‘హరిహరవీరమల్లు’ సినిమాను గురించి చెప్పుకొచ్చారు.

pawanKalyan HariharaVeeramallu movie releaseing on may9
pawanKalyan HariharaVeeramallu movie releaseing on may9

అలాగే ‘హరిహరవీరమల్లు సినిమా కథను గురించి ఈ చిత్రం దర్శకుడు జ్యోతిక్రిష్ణ చెబుతూ- ”17వ శతాబ్ధంలో సాగే పీరియాడికల్‌ యాక్షన్‌ సినిమా ఇది. ఔరంగజేబు ఉన్న సమయంలో, హరిహరవీరమల్లు..అనే ఓ కల్పిత పాత్ర ఉండి, వారి మధ్య వైరుధ్యం ఏర్పడి, వారి మధ్య వార్‌ జరిగితే ఎలా ఉంటుందో అదే…’ఈ హరిహరవీరమల్లు’ సినిమా” అని చెప్పుకొచ్చారు.

”సెకండాఫ్‌లో వచ్చే ఓ ఫ్లాష్‌బ్యాక్‌ సీక్వెన్స్‌ చాలా బాగుంటుందని, అలాగే చౌకీదార్‌ నేపథ్యంతో వచ్చే యాక్షన్‌ సీక్వెన్స్‌ అద్భుతంగా ఉంటుందని’ ఈ చిత్రం సినిమాటోగ్రాఫర్‌ మనోజ్‌ పరమహంస చెప్పుకొచ్చారు.

Please Share
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *