హరిహరవీరమల్లు సినిమా బిజినెస్‌, బ్రేక్‌ఈవెన్‌ అండ్‌ టికెట్‌ రేట్స్‌ డీలైట్స్‌

Kumar NA
Pawankalyan HHVM Trailer

HariHaraVeeraMallu Business: పవన్‌కల్యాణ్‌ (pawankalyan) ‘హరిహరవీరమల్లు’ సినిమా ప్రీమియర్స్‌కు సమయం దగ్గర పడింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా బుకింగ్స్‌ ఓపెన్‌ అయ్యాయి. రేపు ఉదయం పూర్తిస్థాయిలో హరిహరవీరమల్లు సినిమా బుకింగ్స్‌ ఓపెన్‌ అవుతాయి. ఇప్పటివరకు అయితే ఈ సినిమాపై ఫుల్‌ పాజిటివ్‌ బజ్‌ ఏర్పడింది. ప్రీ సేల్స్‌, ప్రీ బుకింగ్స్‌ అన్నీ బాగున్నాయి. పవన్‌కల్యాణ్‌ కెరీర్‌లోనే అత్యధిక భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ హరిహరవీరమల్లు తొలిపార్టు హరిహరవీరమల్లు స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌ సినిమా ఈ నెల 24 (HariharaVerramallu Release date) న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది.

అల్లు అర్జున్‌ ‘పుష్ప ది రూల్‌’ సినిమా తరహాలోనే, ఈ హరిహరవీరమల్లు స్పార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌ సినిమాకి, ఒక రోజు ముందుంగానే..అంటే ఈ నెల 23వ తారీఖు..బుధవారం రాత్రి నుంచే ప్రీమియర్స్‌ వేస్తున్నారు. సినిమా టికెట్స్‌ కూడా బాగా బుక్‌ అవుతున్నాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రీ సేల్స్‌ రూ. 20 కోట్ల వరకు చేరుకుందని తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో, ఓవర్‌సీస్‌లో ఈ సినిమాకు బాగనే బుకింగ్స్‌ (HariHaraVeeraMallu Bookings) ఉన్నాయి. కానీ కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో హరిహరవీరమల్లు సినిమాకు ఆశించిన బుకింగ్స్‌ లేవు. ఆయా రాష్ట్రాలో హరిహరవీరమల్లు సినిమా ప్రమోషన్స్‌ సరిగ్గా జరగలేదు. ఆ మాటకొస్తే ఆ రాష్ట్రాల్లో ఒక్క ప్రమోషనల్‌ ఈవెంట్‌ను కూడా చిత్రంయూనిట్‌ నిర్వహించకపోవడం అనేది యూనిట్‌కు ప్రతికూల అంశమనే చెప్పాలి. లేకపోతే ఈ సినిమా బుకింగ్స్‌ జోరు ఇంకా బాగా ఉండి ఉండేది.

HariHaraVeeraMallu Business & Breakeven: బ్రేక్‌ ఈవెన్‌ కోసం ఎంత రాబట్టాలి?

Pawan Kalyan HariHaraVeeraMallu
Pawan Kalyan HariHaraVeeraMallu

హరిహరవీరమల్లు (HHVM movie) స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌ సినిమాకు రూ. 250 నుంచి రూ. 300 కోట్ల రూపాయలు బడ్జెట్‌ అయ్యింది. రూ. 126 కోట్ల రూపాయాల బిజినెస్ జరిగిందనే టాక్‌ ఉంది. నైజాంలో రూ. 37 కోట్లు, సీడెడ్‌లో రూ. 17 కోట్లు రూపాయల బిజినెస్‌ జరిగిందట. ఇప్పుడు ఈ సినిమా బ్రేక్‌ఈవెన్‌ సాధించాలంటే…ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 250 కోట్ల రూపాయల కలెక్షన్స్‌ను సాధించాలి, తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 170 కోట్ల రాబట్టాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా అయితే రూ.125 కోట్లు షేర్‌ రూపంలో రావాలి, తెలుగు రాష్ట్రాల్లో వందకోట్ల షేర్‌ను రాబట్టాల్సి ఉంటుంది. మరి…హరిహరవీరమల్లు స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌ ఎంత వరకు కలెక్ట్‌ చేస్తుందో చూడాలి. తెలుగు రాష్ట్రాల్లో హరిహరవీరమల్లు సినిమా కోసం పెరిగిన సినిమా టికెట్‌ ధరలు, స్పెషల్‌ షోలు, ప్రిమియర్స్‌ ఈ సినిమాకు బాగా ఉపయోగపడేలా ఉన్నాయనిపిస్తోంది. ఈ నెల 23వ రాత్రి జరిగే ప్రిమియర్‌ షోలతో హరిహరవీరమల్లు సినిమా టాక్‌ ఏంటో అర్థమైపోతుంది.

HariHaraVeeraMallu Business And Ticket Rates టికెట్‌ ధరలు ఎలా ఉన్నాయి?

ఇక తెలుగు రాష్ట్రాల్లో హరిహరవీరమల్లు సినిమా పెయిడ్‌ ప్రీమియర్స్‌ ధరను రూ.600గా నిర్ణయించారు. సెలక్టివ్‌ సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్స్‌, మల్టీఫ్లెక్స్‌లలో ఈ పెయిడ్‌ ప్రిమియర్స్‌ను ప్రదర్శిస్తున్నారు. కొన్ని మల్టీఫ్లెక్స్‌లలో రెక్లయినర్‌ సీట్స్‌ రూ. 1000 ఉంటున్నాయి. బాల్కనీ, సెకండ్‌ క్లాస్‌ టికెట్‌ ధరలు రూ. 800 కాస్త అటు, ఇటుగా ఉన్నాయి. వీటికి బుకింగ్‌ చార్జీలు అదనంగా వడ్డిస్తారు. ఇక జూలై 24 నుంచి సింగిల్‌ స్క్రీన్స్‌లో హరిహరవీరమల్లు సినిమా పెంచిన ధరలు గరిష్టంగా రూ. 250, కనిష్టంగా రూ. 150 ఉన్నాయి. మల్టీఫ్లెక్స్‌లలో గరిష్టంగా రూ. 500, కనిష్టంగా రూ. 350 రూపాయలు ఉన్నాయి. వీటికి బుకింగ్‌ చార్జీలు అదనంగా ఉంటాయి.

ఇక తెలంగాణలో అయితే రాయల్‌ సీటింగ్‌ రూ. 500, ఎగ్జిక్యూటివ్‌ సీట్స్‌ రూ. 412 రూపాయలు చూపిస్తుంది. సింగిల్‌ స్క్రీన్‌లో బాల్కనీ రూ. 300, ఫ్రంట్‌ సర్కిల్‌ రూ. 200 ఉన్నాయి. అయితే కొన్ని ఏరియాలు, ప్రాంతాల వారిగా ఈ సినిమా టికెట్‌ ధరల్లో మార్పులు ఉండొచ్చు. ఎందుకంటే..సిటీల్లో అయితే ఈ ధరలతో సినిమాలు చూస్తారు. పల్లెటూర్లలో ఇంత టికెట్‌ ధరలతో చూడరు కాబట్టి, రేట్లు అక్కడికి తగ్గట్లు ఉండొచ్చు. ‘కుబేర’ సినిమా విషయంలో ఇదే జరిగింది. ఇప్పటివరకు అయితే హరిహరవీరమల్లు స్పిరిట్‌ వర్సెస్‌ స్వార్డ్‌
సినిమాకు అంతా పాజిటివ్‌గానే జరిగింది. మరి..పవన్‌కల్యాణ్‌ ఎన్ని రికార్డ్స్‌ కొల్లగొడతారో చూడాలి.

గమనిక: ఈ సినిమా బిజినెస్‌ వివరాలు, టికెట్‌ ధరలు, బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్స్‌…వంటి అంశాలను వివిధ సోర్సుల ఆధారంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి కచ్చితమైనవి, సరైనవి అని మేం చెప్పడం లేదని రీడర్స్‌ గమనించగలరు.

Please Share
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *