విశాల్ 35(vishal35)వ సినిమాకు మకుటం టైటిల్ ఖరారైంది. ఈ మకుటం (Makutam) సినిమా టైటిల్ టీజర్‌ను లేటెస్ట్‌గా విడుదల చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై ఆర్‌బీ చౌదరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌లో ఇది 99వ సినిమా కావడం విశేషం. ఇంకా ఈ సినిమాలో అంజలి, దుషార విజయన్ ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. జీవీ ప్రకాష్‌కుమార్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. సముద్రం నేపథ్యంలో సాగే చిత్రంగా ముకుటం ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. సముద్రం నేపథ్యంలో సాగే మాఫియా డ్రామాగా ఈ చిత్రం ఉంటుంది. ఇందులో మాఫియాడాన్‌గా విశాల్ నటిస్తారు. రవి అరసు ఈ సినిమాకు దర్శకుడు.
ఇటీవల హిట్స్ లేక ఇబ్బందిపడుతున్న విశాల్‌కు ఈ ఏడాది మద గజ రాజా సినిమాతో హిట్ అందుకున్నారు. మరి..ఇప్పుడు మకుటం చేస్తున్నాడు. ఒక దశలో విశాల్ ‘తుప్పరివాలన్ 2’ సినిమాను స్టార్ట్ చేయాలనుకున్నాడు విశాల్. తానే డైరెక్షన్ చేయాలనుకున్నాడు. లొకేషన్ సెర్చ్ చేశాడు విదేశాల్లో. కానీ సడన్‌గా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇక ఏడాదిలో విశాల్ పెళ్లి జరగనుంది. హీరోయిన్ సాయిధన్సికతో విశాల్ పెళ్లి ఈ నెల 29న జరగాల్సింది. అయితే నడిగర్ సంఘం భవనం నిర్మాణం జరుగుతుందని, ఈ భవంతిలోనే విశాల్ పెళ్లి జరుగుతుందని, ఇందుకు సమయం పడుతుందని, దీంతో ఈ నెల 29న విశాల్ పెళ్లి జరగకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది.