నటీనటులు: తేజ సజ్జా, రితికా నాయక్, శ్రియా శరణ్, జగపతిబాబు, జయరాం, గెటప్ శ్రీను
నిర్మాత: టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్
దర్శకుడు– కెమెరా: కార్తీక్ ఘట్టమనేని
సంగీతం: హరిగౌర
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
నిడివి: 2 గంటల 48 నిమిషాలు
విడుదల తేదీ: 12–09–2025
రేటింగ్ 3/5
Tejasajja Mirai Movie Review: కథ
భీకరయుద్ధంలో చనిపోయిన లక్షలాదిమందిని చూసి, రాజు అశోకుడిలో పశ్చాత్తాప భావన కలుగుతుంది. దీంతో తన విజ్ఞానం మొత్తాన్ని, తొమ్మిది గ్రంథాల్లో నిక్షిప్తం చేస్తాడు. ఈ 9 గ్రంథాల్లో 8 గ్రంథాలను వీటిని రక్షించే యోధులకు అప్పగించి, ముఖ్యమైన 9వ గ్రంథాన్ని మాత్రం మునీశ్వరుల ఆశ్రమంలో ఉంచమని అశోకుడు ఆదేశిస్తాడు. 75 తరాలుగా, ఈ 9 గ్రంథాలను యోథులు, వారి తర్వాత వారి వారసులు సంరక్షిస్తుంటారు.
మరోవైపు ఈ తొమ్మిది గ్రంథాలను సొంతం చేసుకుని, అమరుడై, దేవుడే లేని ఓ కొత్త ప్రపం చాన్ని సృష్టించాలని మహావీర్ లామా (మంచు మనోజ్) లక్ష్యంగా పెట్టు కుంటాడు. తన ప్రయ త్నంలో భాగంగా ఒక్కో గ్రంథాన్ని సొంతం చేసుకుంటుంటాడు. భవిష్యత్‌ను చూడగల జ్ఞానం ఉన్న అంభిక (శ్రియ), మహావీర్ ప్రమాదాన్ని ముందుగానే ఊహించి, అతన్ని నిలువ రించేందుకు పరిష్కార మార్గాలు వెతుకుంటూ, నిండు గర్భిణిగా ఉండగానే, హిమాయాలకు వెళ్లి, అక్కడ అగస్త్యమునిని కలుస్తుంది. మహావీర్ ప్రమాదానికి పరిష్కారం ‘మిరాయ్’ ఒక్కటే అని, అంభికకు పుట్టబోయే బిడ్డ, ఈ మిరాయ్ సాయంతో మహావీర్‌ను అడ్డుకుంటాడని చెబు తాడు. కానీ అంభికకు కొడు క్కి దూరంగా ఉండాలని కండీషన్ పెడతాడు. అంభిక తన బిడ్డ వేద ప్రజాపతి (తేజా సజ్జ)కి జన్మనిచ్చి, శిశువుగా ఉన్నప్పుడే కాశీలో వదిలేస్తుంది. దేశమంతా తిరి గుతూ, వేద హైదరాబాద్‌లో జీవనం సాగిస్తుంటాడు. మరి..మహావీర్ లామాను వేద ఎలా ఎదుర్కొన్నాడు? ‘మిరాయ్’ను సాధించే క్రమంలో వేద ఎలాంటి సాహసాలు చేశాడు? వేదకు తన శక్తి తనకు తెలిసేలా చేసిన విభ (రితికా నాయక్) బ్యాక్‌డ్రాప్ ఏమిటి? వేద జీవితంలో అంగమ బలి (జగపతిబాబు), అగస్త్య మని(జయరాం)లా ప్రభావం ఏమిటి? అన్నది సిని మాలో చూడాలి.
Tejasajja Mirai Review కథనం
ప్రభాస్ వాయిస్ ఓవర్‌తో ‘మిరాయ్’ కథనం ప్రారంభమౌతుంది. మహావీర్ లక్ష్యం, వేద తన గురించి తాను తెలుసుకోవడం, ‘మిరాయ్’ను సాధించడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. కానీ ఇంట్రవెల్‌లో వచ్చే సంపాతీ సీక్వెన్స్ నెక్ట్స్ లెవల్లో ఉంటుంది స్క్రీన్‌పై. ఆడియన్స్ తప్పక ఎగై్జట్ అవుతారు. మహావీర్ గతం, అంభిక త్యాగం, కాలభూతి ప్రయోగం (చేతబడి తరహాలాంటిది) వేద–మహావీర్‌ల మధ్య పోరుతో సెకండాఫ్ ముగుస్తుంది. అయితే సెకండాఫ్‌లో క్లైమాక్స్ బాగా కుదిరింది. ట్రైన్ సీక్వెన్స్, లుకా (టాంజా కెల్లర్)తో జరిగే ఫైట్ బాగున్నాయి. విజువల్స్ అద్భు తంగా ఉన్నాయి.

ఏడు గ్రంథాలను సొంతం చేసుకున్న తర్వాత,తనకు రెండు వారాలే టైమ్ ఉన్నట్లుగా, మహావీర్ చెప్తాడు. ఎందుకు అనేది సరైన స్పష్టత ఉండదు. ఫస్టాఫ్‌ను డ్రైవ్ చేసిన విభ పాత్ర, సెకండాఫ్ లో కంప్లీట్‌గా సైలెంట్ అయిపోతుంది. శ్రియా క్యారెక్టర్ అంభిక రోల్‌ను హైలైట్ చేసేందుకు ఇలా చేసి ఉండొచ్చు. పోలీసుల ట్రాక్ స్పీడ్ బ్రేకర్‌లా ఉంటుంది. ‘వైబ్ ఉందిలే పిల్లా..’ పాట ను, తీసేసినట్లుగా, ఈ పోలీసుల ట్రాక్‌ను కూడ తగ్గిస్తే, సినిమా ఎక్కవ నిడివి ఉందన్న ఫీలింగ్ ఆడియన్స్‌కు ఉండదు. అసలు.. ఎక్కడుందో తెలియని అమరత్వపు గ్రంథాన్ని వెతికి మరి, విలన్ ముందుకు తెస్తాడు హీరో. అసలు..ఈ గ్రంథం ఎక్కడుంతో తెలియకపోతే, విలన్ కూడా ఏం చేయలేడు.కానీ హీరో ఈ గ్రంథాన్ని వెతికి బహిర్గతం చేయడంలో అర్థం లేదు. కాలాభూతి ప్రయోగాన్ని హీరోయిన్ కూడా చేయవచ్చు. ఎందుకంటే..హీరోయిన్‌యే హీరోకు చెబుతుంది ఆ ముద్ర గురించి. కానీ హీరోయే చేయాలంటు సినిమాలో చూపిస్తారు. ఇది కన్విన్సింగ్‌గా ఉండదు. ఇలాంటివి మరికొన్ని ఉన్నాయి. కానీ స్క్రీన్‌పై కనిపించే విజవల్స్, మైథలా జికల్ ఎలిమెంట్స్ అనేవి ఈ లోటుపాట్లను డామినేట్ చేస్తాయి.

వేద ప్రజాపతి పాత్రలో తేజ సజ్జా మంచి యాక్టింగ్ చేశాడు. యాక్షన్ సీక్వెన్స్ కోసం తేజ పడిన కష్టం కనిపిస్తోంది. ముఖ్యంగా సంపాతి సీక్వెన్స్, ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్‌లో మంచి యాక్షన్ చూపించాడు. తల్లిని గురించిన ఆలోచనలతో ఉన్న ఎమోషనల్ సీన్స్‌లోనూ యాక్టర్‌గా మెప్పిం చాడు. మహావీర్ లామాగా మంచు మనోజ్ మంచి పవర్‌ఫుల్ రోల్ చేశాడు. ఎలివేషన్ యాక్షన్ సీక్వెన్స్ ఒకటే ఉంటే బాగుండేది. స్క్రీన్‌పై పాత్రకు తగ్గ న్యాయం చేశాడు. అంభిక పాత్రలో శ్రియ ఈ సినిమాకు ఆయువు పట్టులా కనిపించింది. మంచి డెప్త్ అండ్ ఇంటెన్స్ స్పిరిట్చువల్ రోల్‌లో శ్రియ కనిపించి, సూపర్ యాక్టింగ్ చేశారు. హీరోకు సాయం చేసే, అంగమబలిగా జగపతి బాబు, అగస్త్య మునిగా జయరాం వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. హీరో ఫ్రెండ్‌గా గెటప్ ఉన్నంతలో ఫర్వాలేదు. హీరోయిన్ రితికా కూడా ఫర్వాలేదు. ఈ పాత్రకు సెకండాఫ్‌లోనూ కాస్త ఇంపార్టెన్స్ ఉండి ఉంటే బాగుండేది. లుకాగా టాంజా కెల్లర్‌కు మంచి రోల్ పడింది. యాక్షన్ సీక్వెన్స్‌లూ ఉన్నాయి. మిగిలిన వారు వారి వారి పాత్రల పరిధి మేరకు యాక్టింగ్ చేశారు.
నటీనటులు – సాంకేతిక విభాగం
వేద ప్రజాపతి పాత్రలో తేజ సజ్జా మంచి యాక్టింగ్ చేశాడు. యాక్షన్ సీక్వెన్స్ కోసం తేజ పడిన కష్టం కనిపిస్తోంది. ముఖ్యంగా సంపాతి సీక్వెన్స్, ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్‌లో మంచి యాక్షన్ చూపించాడు. తల్లిని గురించిన ఆలోచనలతో ఉన్న ఎమోషనల్ సీన్స్‌లోనూ యాక్టర్‌గా మెప్పిం చాడు. మహావీర్ లామాగా మంచు మనోజ్ మంచి పవర్‌ఫుల్ రోల్ చేశాడు. ఎలివేషన్ యాక్షన్ సీక్వెన్స్ ఒకటే ఉంటే బాగుండేది. స్క్రీన్‌పై పాత్రకు తగ్గ న్యాయం చేశాడు. అంభిక పాత్రలో శ్రియ ఈ సినిమాకు ఆయువు పట్టులా కనిపించింది. మంచి డెప్త్ అండ్ ఇంటెన్స్ స్పిరిట్చువల్ రోల్‌లో శ్రియ కనిపించి, సూపర్ యాక్టింగ్ చేశారు. హీరోకు సాయం చేసే, అంగమబలిగా జగపతి బాబు, అగస్త్య మునిగా జయరాం వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. హీరో ఫ్రెండ్‌గా గెటప్ ఉన్నంతలో ఫర్వాలేదు. హీరోయిన్ రితికా కూడా ఫర్వాలేదు. ఈ పాత్రకు సెకండాఫ్‌లోనూ కాస్త ఇంపార్టెన్స్ ఉండి ఉంటే బాగుండేది. లుకాగా టాంజా (Mirai Movie lady Villan Tanja Keller) కెల్లర్‌కు మంచి రోల్ పడింది. యాక్షన్ సీక్వెన్స్‌లూ ఉన్నాయి. మిగిలిన వారు వారి వారి పాత్రల పరిధి మేరకు యాక్టింగ్ చేశారు.
దర్శకుడు కార్తిక్‌ఘట్టమనేని (Mirai Movie Director Karthik Gattamneni) టెక్నికల్ బ్రిలియన్స్‌ను తప్పక మెచ్చుకోవాలి. తక్కువ బడ్జెట్‌లోనే అదిరిపోయే విజువల్స్ ఇచ్చాడు. మైథలాజికల్ అంశాలను, డ్రామాను ఆడి యన్స్ కనెక్ట్ అయ్యేలా బ్లెండ్ చేయగలిగాడు. దాదాపు రూ. 60 కోట్లతో ఈ సినిమాను నిర్మించి, ఈ చిత్రం నిర్మాత టీజీ విశ్వప్రసాద్ టీమ్‌కు బాగా సపోర్ట్ చేసినట్లు ఉన్నారు. నిర్మాణ విలువలు బాగు న్నాయి. వీఎఫ్‌ఎక్స్ వర్క్ ఫర్వాలేదు. ఇక ఈ సినిమాకు ప్రధానబలం హరిగౌర మ్యూజిక్. ఆర్‌ఆర్ అదిరిపోయింది. ‘రుధిర ..’ అంటూ బ్యాగ్రౌండ్ స్కోర్ వచ్చిన ప్రతిసారి ఆడియన్ ఎగై్జట్ అవుతాడు. కెమెరా వర్క్ సూపర్. విజువల్స్ ఈ సినిమాకు ప్రధానబలం. ఎడిటింగ్ ఇంకాస్త చేయాల్సింది. సెకండాఫ్‌లో ఆ స్కోప్ ఉంది.
ఫైనల్‌గా..: సూపర్‌నేచురల్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా వెండితెరపై ‘మిరాయ్’ సూపర్. మైథలాజికల్ డ్రామాలను ఇష్టపడే వారికి, ఈ సినిమా బాగా నచ్చుతుంది. యాక్షన్ బ్లాక్స్ యాక్షన్ లవర్స్‌ని అలరిస్తాయి. థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌కు ‘మిరాయ్’ ఓ మంచి ఛాయిస్.
బెల్లంకొండ సాయిశ్రీనివాస్- అనుపమల కిష్కింధపురి సినిమా రివ్యూ