vijay – rashmika engagement: విజయ్ దేవరకొండ (VijayDevarakonda), రష్మిక మందన్నా(RashmikaMandhanna)లు కొన్నేళ్లుగా డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ముంబై వీధుల్లో, విదేశాల్లోని ఫేమస్ లోకేషన్స్‌లో, ఎయిర్‌పోర్ట్స్‌లో ప్రేమ పక్షుల్లా వీరిద్దరూ ఫోటోల్లో చిక్కిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాగే విజయ్‌దేవరకొండ ఇంట్లో జరిగిన పలు ఫంక్షన్స్‌కు రష్మిక మందన్నా హాజరైయ్యారు. ఇలా విజయ్ – రష్మికల ప్రేమ పరోక్షంగా బహిర్గతమౌతూనే ఉంది. ఫైనల్‌గా…ఈ ఇద్దరు దసరా పండగ మరుసటి రోజున నిశ్చితార్థం చేసుకున్నారు (vijay – rashmika engagement). ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విజయ్-రష్మిల మందన్నాల పెళ్లి జరగనుందని తెలిసింది. బహుశా…ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న పెళ్లి (VijayDevarakonda and Rashmika Marriage) చేసుకుంటారెమో. అలాగే విజయ్ – రష్మికల ది డెస్టినేషన్ వెడ్డింగ్ అనే ప్రచారం జరుగుతోంది.
హైదరాబాద్‌లోని విజయ్ స్వగృహంలో విజయ్–రష్మికల నిశ్చితార్థం ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండానే, బంధుమిత్రుల సమక్షంలో జరిగింది. ఇటు విజయ్ కానీ, అటు రష్మిక కానీ…తమ నిశ్చితార్థ వేడుకపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు.
ఇక ‘ఛలో’ సినిమాతో హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు రష్మిక మందన్నా. విజయ్ దేవరకొండతో తొలిసారిగా ‘గీతగోవిందం’ సినిమా చేశారు. ఆ తరవాత వీరిద్దరూ కలిసి ‘డియర్ కామ్రేడ్’ అనే మరో సినిమాలో కూడా నటించారు. ప్రజెంట్ రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్‌లోని ఓ కొత్త సినిమాలో విజయ్, రష్మికా మందన్నాలు మళ్లీ కలిసి నటిస్తున్నారని తెలిసింది. స్వాతంత్య్ర పూర్వానికి ముందు రాయలసీమ నేపథ్యంతో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది.