మరో తమిళ దర్శకుడితో ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌

Viswa
1 Min Read

Web Stories

Allu Arjun & Lokesh Kanagaraj Film Officially Announced: ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీతో ఓ సైన్స్‌ ఫిక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీ చేస్తున్నారు హీరో అల్లు అర్జున్‌. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్‌ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలిసింది. అయితే ఈ సినిమా తర్వాత ‘ఖైదీ, లియో’ చిత్రాల ఫేమ్‌ లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా చేయనున్నారు (Allu Arjun Lokesh Kanagaraj movie). సంక్రాంతి పండగ సందర్భంగా ఈ కొత్త సినిమాను (#AA23) అధికారికంగా ప్రకటించారు మేకర్స్‌. అంతేకాదు..అల్లు అర్జున్‌తో ‘పుష్ప, పుష్ప 2’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలు నిర్మించిన మైత్రీమూవీమేకర్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. అనిరు«ద్‌ రవిచందర్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. అంతే కాదు.. ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాదే ప్రారంభించనున్నట్లుగా అల్లు అర్జున్‌ అండ్‌ టీమ్‌ తెలిపింది ( Allu Arjun Lokesh film announced).

ఇక ‘కూలీ’ చిత్రం తర్వాత రజనీకాంత్‌ లేదా ఆమిర్‌ఖాన్‌లతో లోకేష్‌ కనగరాజ్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా రానున్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ ఈ ఇద్దరు స్టార్స్‌తో సినిమా పట్టాలెక్కలేదు. ఈ నేపథ్యంలో కార్తీతో ‘ఖైదీ 2’ సినిమా షూటింగ్‌ను లోకేష్‌ షురూ చేస్తారని అందరూ ఊహించారు. కానీ సంక్రాంతి పండగ సందర్భంగా అల్లు అర్జున్‌తో సినిమా చేయనున్నట్లుగా లోకేష్‌ కనగరాజ్‌(LokeshKanagaRaj Direction) ప్రకటించారు.

ప్రస్తుతం లోకేష్‌ కనగరాజ్‌ హీరోగా ‘డీసీ’ అనే మూవీ చేస్తున్నారు. యాక్టర్‌గా ఈ సినిమాను ఓ కొలిక్కి తెచ్చిన తర్వాత, అల్లు అర్జున్‌ సినిమాను లోకేష్‌ సెట్స్‌కు తీసుకువెళ్తారని ఊహింవచ్చు (Allu Arjun new movie update).

అల్లు అర్జున్‌తో లోకేష్‌ కనగరాజ్‌ ఫిల్మ్‌ ఫిక్స్‌

Please Share
Share This Article
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu