వెబ్‌సిరీస్ : విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ (Viraatapalem: PC Meena Reporting Review)
ప్రధాన తారాగణం: అభిజ్ఞవూతలూరు, చరణ్ లక్కరాజు, లావణ్య సాహుకర, రామరాజు, గౌతమ్ రాజు, సతీష్
దర్శకత్వం: పోలూరు క్రిష్ణ (
నిర్మాత: కేవీ శ్రీరామ్ (poluru Krishna)
రైటర్, డైలాగ్స్ : దివ్వ తేజస్వీ
ఎడిటర్ : చంద్రశేఖర్
కెమెరా: మహేశ్ కె స్వరూప్
స్ట్రీమింగ్ పార్ట్‌నర్ జీ5
రేటింగ్ 2.0/5.0
కథ
Viraatapalem: PC Meena Reporting Review: విరాటపాలెం అనే ఊర్లో పెళ్లి చేసుకుంటున్న అమ్మాయిలు పెళ్లి రోజే రక్తం కక్కుకుని చనిపోతుంటారు. ఇదంతా అమ్మవారి శాపం అని ఊరి జనం అనుకుంటుంటారు. దీంతో ఆ గ్రామంలోని యువతీయువకుల పెళ్లిళ్లు పక్క ఊర్లో జరుగుతుంటాయి. ఎవరైనా సాహసించి, పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించిన ప్రతిసారి ఒక అమ్మాయి చనిపోతూనే ఉంటుంది. పదేళ్లుగా ఇలా జరుగుతుంటుంది. ఈ క్రమంలో కానిస్టేబుల్ మీనా ఆ ఊర్లోకి వచ్చి, ఈ విషయాలను గమనిస్తుంది. ఇది అమ్మవారి శాసం కాదని, ఎవరో కావాలనే హత్యలు చేస్తున్నారని భావించి, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. మరి…విరాటపాలెంలో అమ్మాయిలు చనిపోవడం అనేది అమ్మవారి శాపమా? మూఢనమ్మకమా? లేక ఎవరైనా కావాలనే హత్యలు చేస్తున్నారా? అనేది జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విరాటపాలెం పీసీ మీనారిపోర్టింగ్ వెబ్‌సిరీస్ (Viraatapalem: PC Meena Reporting Review) చూసి తెలుసుకోవాలి.
Viraatapalem: PC Meena Reporting Review: విశ్లేషణ
1980-1990 నేపథ్యంలో సాగే కథ ఇది. ‘రెక్కీ’ వంటి సూపర్‌హిట్ వెబ్‌సిరీస్ తీసిన పోలూరు క్రిష్ణ డైరెక్షన్‌లో రూపొందిన ఈ ‘విరాటపాలెం పీసీ మీనారిపోర్టంగ్ వెబ్‌సిరీస్‌పై కాస్త అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా ఈ సీరిస్‌పై ఆసక్తిని పెంచింది. కానీ ట్రైలర్‌లో ఉన్న క్యూరియాసిటీ ‘విరాటపాలెం పీసీ మీనారిపోర్టంగ్’ సిరీస్‌లో లేదు. ఏడు ఎపిసోడ్స్‌తో ఈ సీరిస్ సాగుతుంది. ఏ ఎసిపోడ్ కూడా పాతిక నిమిషాలకు మించి లేకపోవడం ప్లస్ పాయింట్. 23 నిమిషాలు ఉన్న ఐదో ఎపిసోడ్‌యే, ఈ సిరీస్‌లో పెద్ద ఎపిసోడ్. కానీ కథ, కథనంలో ఏ మాత్రం బలం లేదు. వరుస హత్యలు జరుగుతుండటం, ఈ నేపథ్యంలో మీనా కూడా పెళ్లి చేసుకుని, ఈ మిర్డర్‌మిస్టరీని కనిపెట్టాలనుకోవడం ఇలా ఏదీ ఆసక్తికరంగా సాగదు. ఊహాత్మక సన్నివేశాలతో ముందుకు సాగిపోతూ ఉంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ కూడ పెద్ద కొత్తదీ ఏం కాదు. చివర్లో సందేశం కూడా చాలా పాతదే. కొన్ని లాజిల్‌లు కూడా మిస్ అయ్యాయి. అమ్మవారి శాపమా? అన్నట్లు ఓ అంశాన్ని ప్రస్తావించారు. ఆ దిశగా కూడా కథనంలో బలం లేదు. ఓటీటీ వ్యూయర్స్ స్మార్ట్‌గా ఉన్న ఈ రోజుల్లో, ఇలాంటి తరహా కథ, కథనాలతో వారిని మెప్పించాలనుకుంటే అది వర్కౌట్ కాదు. కథ, కథనాలపై రచయితలు, దర్శకుడు మరింత వర్క్ చేసి ఉండాల్సింది.
నటీనటుల పెర్ఫార్మెన్స్
కానిస్టేబుల్ మీనా పాత్రలో అభిజ్ఞ వూతలూరు (Abhignya Vuthaluru), మీనాకు సహాయం చేసే పాత్రలో చరణ్ లక్కరాజు (Charan lakkaRaju), ప్రెసిడెంట్ కూమార్తె భ్రమరాంబ కుమార్తెలగా లావణ్య సాహుకర, ఈ ఊరి ప్రెసిడెంట్‌గా రామరాజు, హెడ్‌కానిస్టేబుల్‌గా గౌతమ్ రాజు లు ప్రధాన పాత్రలు కనిపిస్తారు. దాసన్న, జయవాణి, సురభి ప్రభావతి, సతీశ్‌వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఫర్వాలేదనిపించింది. మీనా పాత్రలో అభిజ్ఞ వూతలూరు మంచి నటన కనబరిచింది. కిట్టుగా చరణ్‌కు మంచి రోల్ దక్కింది. భ్రమరాంబకు లావణ్య ఒకే. నిర్మాణ విలువలు, కెమెరా పనితనం పర్వాలేదు. ఎడిటింగ్ కూడా అంతే. రోహిత్ మ్యూజిక్ ఒకే.