కర్మ ఎవర్ని వదిలిపెట్టదు.. రెండో పెళ్లి వార్తలపై నటి మీనా ఫైర్..!

Kumar NA

Web Stories

Actress Meena open up about second marriage : దశాబ్దాల పాటు వెండితెరపై అగ్ర కథానాయికగా అలరించిన మీనా, తన రెండో పెళ్లిపై వస్తున్న పుకార్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు. భర్త విద్యాసాగర్ మరణం తర్వాత ఆమె వ్యక్తిగత జీవితంపై సాగుతున్న అసత్య ప్రచారాలను సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా ఖండించారు. తనను ఏదో ఒక నటుడితో ముడిపెడుతూ వార్తలు రాస్తున్న వారిపై ఆమె ఆవేదనతో కూడిన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

తన పెళ్లి గురించి వస్తున్న కథనాల్లో ఏమాత్రం వాస్తవం లేదని, అసలు సంబంధం లేని వ్యక్తులతో లింకులు పెట్టడం దురదృష్టకరమని మీనా మండిపడ్డారు. ఒక సెలబ్రిటీగా, ఒంటరి మహిళగా ఉన్నంత మాత్రాన ఇష్టానుసారం రాయడం సరైనది కాదని హెచ్చరించారు. 2022లో భర్తను కోల్పోయిన మీనా, ప్రస్తుతం తన 15 ఏళ్ల కుమార్తె నైనిక బాధ్యతలే పరమావధిగా బతుకుతున్నారు. “నాకు ఎదిగొచ్చిన కూతురు ఉంది, ఇలాంటి చెత్త రాతలు తనపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఆలోచించరా?” అని ఆమె ప్రశ్నించారు. ఈ పుకార్లు తనకు ఎంతో చిరాకును, అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయని ఆవేదన చెందారు. ఇలాంటి నెగెటివిటీపై స్పందించి తన సమయాన్ని, ఆరోగ్యాన్ని వృధా చేసుకోదలచుకోలేదని ఆమె స్పష్టం చేశారు. కర్మ అనేది ఒకటుంటుందని, అది ఎవరినీ వదిలిపెట్టదని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం మీనా తన సెకండ్ ఇన్నింగ్స్‌లో భాగంగా సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్నారు. తన పూర్తి ఏకాగ్రత కేవలం తన వృత్తిపై, కూతురు నైనిక ఎదుగుదలపైనే ఉందని ఆమె తేల్చి చెప్పారు. ఇప్పటికైనా తన వ్యక్తిగత జీవితంపై సాగే ఈ దుష్ప్రచారాలకు ఫుల్ స్టాప్ పడుతుందని ఆమె ఆశిస్తున్నారు.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi Shivani Nagaram