అఖిల్ (AkhilAkkineni) ఎన్నో అశలు పెట్టుకుని, ఎంతో కష్టపడి చేసిన ‘ఏజెంట్’ (2023) బాక్సాఫీస్ వద్ద బోర్ల పడింది. అప్పట్నుంచి అఖిల్ నెక్ట్స్ మూవీ గురించి, ఏవో వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ప్రశాంత్‌నీల్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన అనిల్ దర్శకత్వంలో అఖిల్ కొత్త సినిమా ఉంటుందనే పుకార్లు వినిపించాయి.

కొంత ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా జరిగాయి. దాదాపు వందకోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా ఉండబోతుందని, యూవీ క్రియేషన్స్–హోంబలే ఫిలింస్ (సలార్, కేజీఎఫ్, కాంతార సినిమాలను నిర్మించిన సంస్థ) కలిసి నిర్మించనున్నారన్న గాసిప్స్ ఫిల్మ్‌నగర్ సర్కి ల్స్ లో వినిపించాయి. కానీ ఉన్నట్లుండి ఈ సినిమాక్యాన్సిల్ అయినట్లుగా ఫిల్మ్‌నగర్‌సర్కిల్స్‌లో చెప్పుకుంటున్నారు.
దీంతో అఖిల్ (Akhil6) నెక్ట్స్ మూవీని ‘వినరో భాగ్యము విష్ణుకథ’ తీసిన అబ్బూరు మురళీ కిషోర్ డైరెక్టర్ చేయను న్నారని తెలిసింది. సితార ఎంటర్‌టైన్మెం ట్స్, అన్నపూర్ణస్టూడియోస్‌లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. అఖిల్ కెరీర్‌లోని ఈ 6వ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తారు. త్వర లోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది.
Pawan Kalyan HariHaraVeeraMallu: ఎట్టకేలకు క్లైమాక్స్‌కు చేరుకున్న హరిహరవీరమల్లు
చిత్తూరు బ్యాక్‌డ్రాప్‌తో సాగే ఈ సినిమా కథనం, పల్లెటూరి నేపథ్యంతో ఉంటుందని తెలిసింది. అతి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. అలాగే ‘సామజవరగమన’ సినిమాకు ఓ రైటర్‌గా పనిచేసిన నందుతో కూడా అఖిల్ ఓ సినిమా చేయ నున్నారనే టాక్ వినిపిస్తోంది.