టాలీవుడ్ యువ హీరో అక్కినేని అఖిల్ ఓ ఇంటివాడైయ్యాడు (AkkineniAkhil weds Zainab). అక్కినేని అఖిల్ వివాహం శుక్రవారం ఉదయం బ్రహ్మామూహుర్తం సమయాన తెల్లవారుజామున 3 గంటల 35 నిమిషాలకు హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. నాగార్జున ఇంట్లో ఈ వివాహ వేడుక జరిగింది. సినీ ఇండస్ట్రీ ప్రముఖులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషుల సమక్షంలో అఖిల్, జైనబ్‌లు ఏడడుగులు వేశారు (AkkineniAkhil Marriage photos). 2024 నవంబరులో అఖిల్ అండ్ జైనాబ్‌ల నిశ్చితార్థం జరిగింది.
రెండు సంవత్సరాల క్రితం అక్కినేని అఖిల్, జైనబ్ (Akhil Wife Zainab)లు ఒకొరికొకరు పరిచయం అయ్యారు. ఈ పరిచయం స్నేహాంగా మారి, ఈ స్నేహాం ప్రేమ బంధానికి దారి తీసింది. ఆ తర్వాత అఖిల్, జైనబ్‌లు వారి కుటుంబాల పెద్దల అంగీకారంతో, అఖిల్-జైనబ్‌ల వివాహం జరిగింది. అఖిల్-జైనబ్‌ల వివాహం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, నాగార్జున సోషల్‌మీడియా వేదికగా ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ రివ్యూ (ఓటీటీ)..జగమంతా కుటుంబంనాది!