బాలకృష్ణ, బోయపాటి శీను కాంబినేషన్‌లో 2021లో వచ్చిన ‘అఖండ’ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. అయితే ‘అఖండ’ సినిమా సక్సెస్‌మీట్‌లోనే ‘అఖండ’ సినిమాకు సీక్వెల్‌గా ‘అఖండ 2’ (Balakrishna akhanda2 Teaser) ను ప్రకటించారు బాలకృష్ణ. అప్పట్నుంచే ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో బాలకృష్ణ 110వ చిత్రం ‘అఖండ 2’ సినిమా చిత్రీకరణ మొదలైంది. ‘అఖండ’ సినిమాకు దర్శకత్వం వహించిన బోయపాటి శీనుయే, ‘అఖండ 2’ సినిమాకూ దర్శకత్వం వహిస్తున్నారు. కాకపోతే నిర్మాతలు మారారు. ‘అఖండ’ సినిమాను మిర్యాలరవీందర్‌రెడ్డి నిర్మించగా, ‘అఖండ 2’ సినిమాను బాలకృష్ణ కుమార్తె ఎం. తేజస్విని నందమూరి, గోపీ ఆచంట, రామ్ ఆచంట నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా సెప్టెంబరు 25న (Balakrishna akhanda2 Release) ఈ చిత్రం థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.
‘‘నా శివుడి అనుమతి లేనిదే, ఆ యముడైనా కన్నెత్తి చూడడు..నువ్వు చూస్తావా..!, అమాయకుల ప్రాణాలు తీస్తావా…!, ‘‘వేదం చదివిన శరభం యుద్దానికి దిగింది’’ అని టీజర్‌లో ఉన్న డైలాగ్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. హిమాయాల్లో తీసిన యాక్షన్ సీక్వెన్స్‌లోని విజువల్స్‌ను టీజర్ (Balakrishna akhanda2 Teaser)గా రిలీజ్ చేశారు.
ప్రస్తుతం ‘అఖండ 2’ సినిమా చిత్రీకరణ జార్జియాలో జరుగుతోంది. కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగు తోంది.
ఇక ‘అఖండ’ సినిమాలో హీరోయిన్‌గా ప్రగ్యా జైస్వాల్ నటించగా, సీక్వెల్ ‘అఖండ 2’లో మాత్రం సంయుక్త హీరోయిన్‌గా చేస్తున్నారు. విలన్‌గా ఆదిపినిశెట్టి కనిపిస్తారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా చేసిన ‘సరైనోడు’ సినిమా తర్వాత ..మళ్లీ ‘అఖండ 2’ సినిమాలో బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో ఆదిపినిశెట్టి విలన్‌గా చేస్తుండటం విశేషం.