‘పుష్ప: ది రూల్’ సినిమా తర్వాత అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్ ఓ భారీ మూవీ చేయాల్సింది. కానీ సడన్‌గా తమిళ దర్శకుడు అట్లీతో మూవీని సెట్స్‌కు తీసుకువెళ్తున్నాడు అల్లు అర్జున్. దీంతో త్రివిక్రమ్ డైలమాలో పడిపోయారు.
అల్లు అర్జున్, అట్లీ కాంబోలోని మూవీ భారీ సెటప్ కాబట్టి..కనీసం రెండు సంవత్సరాలు పడింది. పోనీ.. అట్లీ మూవీ చేస్తూనే, త్రివిక్రమ్‌తోనూ సినిమాను అల్లు అర్జున్ కంటిన్యూ చేయా లంటే.. లుక్స్..మేకోవర్ విషయంలో కష్టాలు, ఇబ్బందులు తప్పవు. దీంతో..అసలు…ఈ ప్రాబ్లమ్స్ ఏవీ లేకుండా…మరో హీరోతో మూవీ చేస్తే సరిపోతుందని త్రివిక్రమ్ అనుకుంటున్నారట.
ఇక వెంకటేష్– త్రివిక్రమ్ కాంబో మూవీ గురించి, ఎప్పట్నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్‌బస్టర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ తర్వాత, మళ్లీ ఇలాంటి తరహా మూవీ చేయా లనే వెంకటేష్ భావిస్తున్నారు. ఇందుకు త్రివిక్రమ్ అయితే కరెక్ట్ అని వెంకటేష్ భావిస్తున్నారు.
పైగా తన కోసం సితారలో ఓ కథ కూడా రెడీ అవుతోందని, ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ సమయంలో వెంకటేష్ చెప్పారు. సో..వెంకీతో త్రివిక్రమ్ ప్రోసీడ్ అయిపోవచ్చు. పైగా త్రివిక్రమ్ రైటర్‌గా చేసి, వెంకటేష్ హీరోగా చేసిన ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఇలా త్రివిక్రమ్ దర్శకత్వంలో తొలిసారి వెంకటేష్ మూవీ చేస్తే, అది కచ్చితంగా పాజిటివ్ సైనే, ఆడియన్స్‌ను థియేటర్స్‌కు తీసుకువచ్చే ఫిల్లింగ్ ఫ్యాక్టరే అనుకోవచ్చు.