ఏందయ్యా…సామీ… వీచే గాలికి అత్తరద్దిందెవ్వరూ…

Viswa

Web Stories

Endhayya Saami song From Ranabaali : ‘గీతగోవిందం (2018), డియర్‌ కామ్రేడ్‌ (2019)’ చిత్రాల తర్వాత హీరో విజయ్‌ దేవరకొండ, హీరోయిన్‌ రష్మికా మందన్నా కలిసి ముచ్చటగా మూడోసారి కలిసి నటిస్తున్న సినిమా ‘రణ బాలి’. 19వ శతాబ్ధం నేపథ్యంలో 1854 నుంచి 1878 వరకు రాయ లసీమ ప్రాంతంలో జరిగిన కొన్ని వాస్తవ, చారిత్రక సంఘటలన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ ‘రణబాలి’ సినిమాలో విజయ్‌ దేరకొండ టైటిల్‌ రోల్‌ చేస్తుండగా, జయమ్మ పాత్రలో రష్మి కా మందన్నా నటిస్తున్నారు. హాలీవుడ్‌ యాక్టర్‌ ఆర్నాల్డ్‌ వోస్లూ ఈ సినిమాలో విలన్‌గా నటి స్తారు. ‘టాక్సీవాలా’ వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత హీరో విజయ్‌దేవరకొండ, దర్శకుడు రాహుల్‌ సంకృత్యాన్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ఇది.

2026 ఫిబ్రవరి 26న విజయ్‌దేవరకొండ, రష్మికా మందన్నాల వివాహం ఉదయపూర్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘రణబాలి’ టీమ్, ఈ సినిమాలోని ‘ఏమైందయ్యా సామీ’ పాట లిరికల్‌ వీడియోను రిలీజ్‌ చేసి, శుభాకాంక్షలు తెలియజేసింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ పాట లిరికల్‌ వీడియోను రిలీజ్‌ చేశారు.

 

ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాలోని ఈ పాటకు రామజోగయ్యశాస్త్రి లిరిక్స్‌ అందించగా, శ్వేతామోహన్, అజయ్‌గోగవాలే పాడారు. అజయ్‌–అతుల్‌ ద్వయం ఈ సినిమాకు మ్యూజిక్‌ కంపోజ్‌ చేశారు.

‘ఏందయ్యా…సామీ..ఇట్టా కాస్త ఉందీ వెన్నెల…, వీచే గాలికి అత్తరద్దిందెవ్వరూ…’ అంటూ ఈ పాట లిరిక్స్‌ సాగుతాయి.

గుల్షన్‌కుమార్, భూషణ్‌ కుమార్, టీ సిరీస్‌ ఫిలింస్‌ సమర్పణలో నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబరు 11న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi