ప్రముఖ సంగీత దర్శకుడు–నిర్మాత, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహామాన్ (Music Director ARRehman) అనారోగ్య కారణాల రిత్యా ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ఈ రోజు (మార్చి 16) ఉదయం ఆయన ఛాతి నొప్పి కారణంగా చెన్నైలోని ఓ ప్రముఖ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారనే వార్తలు వస్తున్నాయి. వైద్యులు ఆయనకు చికిత్స అంది స్తున్నారు.ఆయనకు వైద్యులు యాంజియోగ్రామ్ చేశారు. కార్డియాలజీ విభాగపు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఏఆర్ రెహహాన్ ఆరోగ్యం పట్ల ఆయన అభిమానులు ఆందోళనకు గురి అవుతున్నారు. హాస్పిటల్ నుంచి ఓ అధికారిక హెల్త్ బులిటెన్ వెలువడితే కానీ…ఏఆర్ రెహమాన్ అరోగ్య పరిస్థితిపై మరింత సమాచారం అందే అవకాశం ఉంటుంది. ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
ఇక ఇటీవల చెన్నైలో జరిగిన ఓ కాన్సెర్ట్‌లోనూ, అలాగే..హిందీ చిత్రం ‘ఛావా’ ప్రమోషన్స్‌లోనూ ఏఆర్ రెహామాన్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక గత ఏడాది ఆయన భార్య సైరాభానుతో ఏఆర్ రెహహాన్ విడాకులు తీసుకున్నారన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే సైరాభాను కూడా ఓ అనారోగ్యసమస్య కారణంగా చికిత్స తీసుకుంటున్నారని, ఇటీవల ఆమె తరఫు లాయర్ ఓ సందర్భంగా వెల్లడించిన సంగతి తెలిసే ఉంటుంది.
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రెహమాన్
ఏఆర్ రెహమాన్ ఆరోగ్యం గురించి, ఈ రోజు ఉదయం నుంచి వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనకు ట్రీట్ చేసిన హాస్పిటల్ సిబ్బంది ఓ హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు. డీహైడ్రేషన్ లక్షణాలతో ఏఆర్ రెహ మాన్, ఆస్పత్రిలో జాయిన్ అయ్యారని, కొన్ని రోటిన్ హెల్త్ చెకప్‌ల అనంతరం ఆయన డిశ్చార్జ్ అయ్యారని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.
రామ్‌చరణ్ సినిమాకు సంగీతం
మరోవైపు రామ్‌చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందుతున్న ‘పెద్ది’ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. దాదాపు ఏడేళ్ల తర్వాత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం.