Genelia Deshmukh: ‘శివ, క్షణక్షణం, రంగీలా, మనీ. సర్కార్’ వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలను తీశాడు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. కానీ దర్శకుడిగా ఆయన గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. గత పదేళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్కటీ సాలిడ్ హిట్ మూవీ లేదు. ఈ తరుణంలో రామ్‌గోపాల్ వర్మ ఓ హారర్ కామెడీ సినిమా తీసేందుకు సిద్ధమైయ్యారు. అదే ‘పోలీస్ స్టేషన్ మే భూత్ (POLICE STATION MEIN BHOOT)’.
రామ్‌గోపాల్‌వర్మ డైరెక్షన్‌లోని ‘సత్య, కౌన్, శూల్(1999)’ సినిమాల్లో నటించిన మనోజ్ బాజ్‌పేయి (Manoj Bajpayee) ఈ పోలీస్ స్టేషన్ మే భూత్’ సినిమాలో హీరోగా నటిస్తాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమాను గురించి, అధికారికంగా ప్రకటించాడు రామ్‌గోపాల్ వర్మ (Ramgopalvarma). ఈ వారంలో ఈ సినిమా షూటింగ్ హైద రాబాద్‌లో ప్రారంభం కానుంది. ఆసక్తికరమైన విశేషం ఏంటంటే…ఈ సినిమాలో హీరోయిన్‌గా జెనిలియా (Genelia )నటించనున్నారు.
బాలీవుడ్ దర్శక-నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత, జెనిలియా ఫ్యామిలీ టైమ్ గడపాల్సి వచ్చింది. అలా..పదేళ్ల గడిచి పోయాయి. ఆ మధ్యలో ఒకట్రెండు సినిమాలు చేశారామె. ఇటీవలి కాలంలో యాక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. ఆమిర్‌ఖాన్‌తో హిందీలో జెనిలియా నటించిన ‘సితారే జమీన్ పర్’ హిట్ మూవీగా నిలిచింది. కన్నడ మూవీ ‘జూనియర్’లోనూ ఓ కీలక పాత్రలో నటించారు జెనిలియా. ఇప్పుడు రామ్‌గోపాల్‌వర్మ డైరెక్షన్‌లోని హిందీ సినిమా ‘పోలీస్‌స్టేషన్ మే భూత్’ సినిమాలో హీరోయిన్‌గా యాక్ట్ చేయనున్నారు. 2026లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.
హరిహరవీరమల్లు సినిమా ఫస్ట్ రివ్యూ
ఓ పోలీస్‌స్టేషన్‌లో ఓ భారీ ఎన్‌కౌంటర్ జరుగుతుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన గ్యాంగ్‌స్టర్స్, ఆ పోలీస్‌స్టేషన్‌కు భూతాలుగా వస్తే, ఏం జరుగుతుంది. ఆ పోలీస్‌స్టేషన్ ఓ హంటెడ్ స్టేషన్‌గా మారిపోతుంది. గ్యాంగ్‌స్టర్స్ దెయ్యాలుగా మారి, పోలీసుల వెంటపడినప్పుడు ఏం జరు గుతుంది? అన్నదే పోలీస్‌స్టేషన్ మే భూత్ సినిమా కథ అని, రామ్‌గోపాల్ వర్మ ఈ సినిమా అనౌన్స్‌మెంట్ సమయంలో చెప్పారు. కానీ ఈ హారర్ సినిమా, సీరియస్‌గా ఉండదు. కామెడీ హారర్ మూవీలానే ఉంటుంది.