సినిమాల విషయంలో పవన్‌కల్యాణ్ మస్త్ స్పీడ్ చూపిస్తున్నాడు. రాజకీయాల్లోకి వెళ్లడానికి ముందు ‘హరిహరవీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాల షూటింగ్‌ను పెండింగ్ పెట్టాడు పవన్‌కల్యాణ్. ఇప్పుడు ఒక్కొక్కటిగా సినిమాల చిత్రీకరణలను పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే ‘హరిహరవీరమల్లు’ సినిమా తొలిపార్టు ‘హరిహరవీరమల్లు’ ఫస్ట్ పార్ట్ ‘హరిహరవీరమల్లు స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేశాడు పవన్‌కల్యాణ్. జ్యోతిక్రిష్ణ, జాగర్లమూడి రాధాక్రిష్ణ ఈ సినిమాకు దర్శకులు. అద్దంకి దయాకర్‌రావు, ఎఏమ్ రత్నం నిర్మించిన ఈ
సినిమా జూలై 24న రిలీజ్ కానుంది
పవన్‌కల్యాణ్ (Pawankalyan) చేస్తున్న మరో మూవీ ‘ఓజీ’ (Pawankalyan OG movie Shoot). ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాకు సుజిత్ డైరెక్టర్. కల్యాణ్ దాసరి, డీవీవీ దానయ్య ఈ సినిమా నిర్మాతలు. గత ఏడాది సెప్టెంబరులో ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ వీలు పడలేదు. పవన్‌కల్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల ఇది సాధ్యపడలేదు. ఇప్పుడు ఈ సినిమాను చిత్రీకరణ కూడా పూర్తయింది. సెప్టెంబరు 25న రిలీజ్‌కు సిద్దం చేస్తున్నారు. సెప్టెంబరు 25న ‘ఓజీ (OG movie)’తో పాటుగా, బాలక్రిష్ణ అఖండ 2 కూడ రిలీజ్ అవుతోంది. చిరంజీవి ‘విశ్వంభర’ కూడా రిలీజ్‌కు సిద్దమౌతోంది. అయితే ఈ మూడు సినిమాల్లో ఏదో ఒక చిత్రం రిలీజ్ వాయిదా పడుతుంది. ఏ చిత్రం విడుదల వాయిదా పడుతుంది? అనేది త్వరలో తెలుస్తుంది.
పవన్‌తో కాదుట..ప్రభాస్‌తో బాలయ్య పోటీ!
ఈ ”హరిహరవీరమల్లు స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’, ‘ఓజీ’ సినిమాల చిత్రీకరణలనే కాదు..ఉస్తాద్‌భగత్‌సింగ్ సినిమా చిత్రీకరణపై పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టాడు. ఈ సినిమా షూటింగ్ కు వరుస కాల్షీట్స్ కేటాయించారు. రానున్న రెండు మూడు నెలల్లో ఈ సినిమా చిత్రీకరణ కూడా పూర్తి అవుతుంది. మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్‌లు నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల కావొచ్చు. సంక్రాంతి బరిలో ఉస్తాద్ భగత్ సింగ్ నిలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు.