షారుక్‌తో సుకుమార్‌ నిజమేనా?

Viswa
Bollywood actor ShahRukhKhan 2025 Latest Photo

బాలీవుడ్‌ టాప్‌ స్టార్స్‌ (Bollywood heroes)అందరూ తెలుగు చిత్ర పరిశ్రమపై ఓ కన్నేశారు. ఇప్పటికే పదిమందికి పైగా బాలీవుడ్‌ నటుడు తెలుగు సినిమాల్లో విలన్‌ క్యారెక్టర్స్‌ చేస్తున్నారు. ఇప్పు డు మెల్లిగా హీరోలూ ఒక్కరొకరుగా వస్తున్నారు. దక్షిణాది దర్శకులతో సినిమాలు చేసేందుకు రెడీ అవు తు న్నారు. ఈ తరుణంలోనే మరో వార్త తెరపైకి వచ్చింది. అదే షారుక్‌ఖాన్‌ (ShahRukhKhan)తో సుకుమార్‌ సిని మా.

ప్రముఖ తెలుగు నిర్మాణసంస్థ షారుక్‌ఖాన్‌తో సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆ దిశగా చర్చలైతే ప్రారంభమైయ్యాయి. కానీ ఈ చర్చలు ఎంత మేరకు సఫలం అవుతాయో చూడాలి. ఇదే నిర్మాణసంస్థ ప్రతినిధులు గతంలో సల్మాన్‌ఖానుకు కలిశారు. కానీ ఆ ప్రాజెక్ట్‌ ప్రస్తుతానికి హోల్డ్‌లో పడింది. ఇప్పుడు ఈ నిర్మాణసంస్థ ప్రతి నిధులు షారుక్‌ఖాన్‌తో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నారట. షారుక్‌ఖాన్‌ ఒకే చెబితే, సుకుమార్‌ (Director sukumar) ను రంగంలోకి దించాలని భావిస్తున్నారట. షారుక్‌ఖాన్‌తో సినిమా అంటే సుకుమార్‌కు అంతకుమించిన బాలీవుడ్‌ డెబ్యూ ఏముంటుంది? షారుక్‌ఖాన్‌ ఒకే చెబితే, సుకుమార్‌ కూడా ఒకే చెప్పినట్లే.

ప్రెజెంట్‌ ‘కింగ్‌’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు షారుక్‌ఖాన్‌. ఈ సినిమా పూర్తి కావడానికి చాలా సమయం ఉంది. మరోవైపు రామ్‌చరణ్‌తో సుకుమార్‌ ఓ మూవీ కంప్లీట్‌ చేయాల్సి ఉం ది. సో…ఈ ఇద్దరు వారి కమిట్‌మెంట్స్‌ పూర్తి చేసుకున్న తర్వాత, షారుక్‌–సుకుమార్‌ల కాంబోపై ఓ స్పష్టత వచ్చే అవకాశాలైతే ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి.

Please Share
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *