మీ శక్తులేవీ మా దగ్గర పనిచేయవు..

Viswa
Avatar3 Trailer

James Cameron Avatar3: సిల్వర్‌స్క్రీన్‌పై అవతార్‌ (Avatar) సినిమా కోసం హాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ క్రియేట్‌ చేసిన పండోర గ్రహాం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను ఆకర్షించింది. జేమ్స్ కామె రూన్ డైరెక్షన్‌లో 2009లో వచ్చిన ‘అవతార్‌’ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్‌ల సునామిని తెచ్చి, అప్పటివరకు ఉన్న అన్ని సినిమాల కలెక్షన్స్‌ను దాటి, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్‌ను కొల్లగొట్టిన సినిమాగా నిలిచింది. దీంతో ‘అవతార్‌’ ఫ్రాంచైజీని క్రియేట్‌ చేశారు జేమ్స్‌కామెరూన్‌. ఇలా అవతార్‌ ఫ్రాంచైజీ నుంచి 2022లో రెండో భాగంగా ‘అవతార్‌ ద వే ఆఫ్‌ వాటర్‌’ సినిమా విడుదలై, సూపర్‌హిట్‌గా నిలిచింది. తాజాగా ‘అవతార్‌’ సినిమా నుంచి మూడో భాగంగా ‘అవతార్‌ ఫైర్‌ అండ్‌ యాష్‌’ సినిమా (James Cameron Avatar3) వస్తోంది.

‘అవతార్‌’ సినిమా మూడోభాగం ‘అవతార్‌ ఫైర్‌ అండ్‌ యాష్‌’ చిత్రం (Avatar3) ఈ డిసెంబరు 19న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘అవతార్‌ 3’ సినిమా తెలుగులోనూ విడుదల కానుంది. అందుకే తెలుగు ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు.

James Cameron Avatar3 Trailer out now
James Cameron Avatar3 Trailer out now

‘మన పూర్వీకుల శక్తి అంతా నీలోనే ఉంది’
‘ఇంత ద్వేషం నింపుకుని ఎలా బతుకుతావ్‌..ఇంకా ఎంతకాలం’
‘నువ్వు చేయగలిగినది ఏదైనా ఉంటే..ఆ పని వెంటనే చేయాలి’
‘నా పిల్లలు…’
‘నో…నో..స్పైడర్‌’
‘మనం వేరే దారి వెతుకుదాం..’
‘మీ అమ్మోరీ శక్తులేవీ మా దగ్గర పనిచేయవు..’

అన్న డైలాగ్స్‌ ఈ ‘అవతార్‌ 3’ ట్రైలర్‌లో ఉన్నాయి.

ఇక ఈ ‘అవతార్‌ 3’ సినిమాలో సామ్‌ వర్తింగ్టన్‌, జో సల్దానా, సిగౌర్నీ వీవర్, ఉనా చాప్లిన్‌, స్టీఫెన్‌ లాంగ్‌లు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నిజానికి ‘అవతార్ 3’ సినిమా 2024 డిసెంబరులోనే విడుదల కావాల్సింది. కరోనా పరిస్థితులు, కొన్ని కారణాల వల్ల ఈ ఏడాది ‘అవతార్‌ 3’ విడుదల కానుంది.

ఇంకా అవతార్‌ ఫ్రాంచైజీ నుంచి ‘అవతార్ 4’, ‘అవతార్‌ 5’ సినిమాలు విడుదల కానున్నాయి. 2029 డిసెంబరు 21న అవతార్‌ 4 సినిమా, 2031 డిసెంబరు 19న అవతార్‌ 5 సినిమా విడుదల కానున్నాయి. పరిస్థితులు, గ్రాఫిక్స్ పనుల కారణంగా, ఈ సినిమా విడుదలలో జాప్యం ఉండొచ్చు.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *