సినిమా: అగాథియా (Jivaa Aghathiyya Movie Telugu Review)
ప్రధాన తారాగణం: జీవా, రాశీఖన్నా, అర్జున్ సర్జా, యోగిబాబు, ఎడ్వర్డ్ సోన్నేన్‌బ్లిక్
దర్శకుడు: పా. విజయ్
నిర్మాతలు: ఇషారి కే గణేష్, అనీష్ అర్జున్ దేవ్
సంగీతం: యువన్ శంకర్‌రాజా
కెమెరా: పి. దీపక్‌కుమార్
ఎడిటర్: ఎస్. లోకేష్
నిడివి: 2 గంటల 16 నిమిషాలు
విడుదల తేదీ: 28–02–2025
కథ
ఆర్ట్ డైరెక్టర్ అగస్త్య (జీవా) తన తొలి సినిమా కోసం రూ. 30 లక్షల రూపాయాల సొంతఖర్చుతో పాండి చ్చేరిలో ఓ హారర్ ఫిల్మ్ కోసం ఓ పెద్ద బంగ్లాకు సెట్ వేస్తాడు. ఈ సినిమా షూటింగ్ క్యాన్సిల్ అవుతుంది. సొంత డబ్బులు, చాన్స్ రెండు మిస్ కావడంతో తీవ్రమైన నిరాశకు గురవుతాడు ఆగస్త్య. అయితే తన ప్రేయసి వీణ (రాశీఖన్నా) ఆలోచన, స్నేహితులతో ఓ స్కారీ హౌస్‌ను స్టార్ట్ చేస్తాడు. కానీ ఈ స్కారీ హౌస్‌ను చేసేందుకు గార్ల్‌ఫ్రెండ్‌తో వచ్చిన లోకల్ కార్పొరేటర్ తమ్ముడు రవి సడన్‌గా మిస్ అవుతాడు. దీంతో ఈ స్క్యారీ హౌస్‌లో నిజంగానే దెయ్యాలు ఉన్నాయనే టాక్‌తో ఇది మూసిపడిపోతుంది.
అయితే ఈ స్క్యారీ హౌస్‌లో దొరికిన ఓ పురాతన ఫజిల్ పియానో ఆధారంగా 1940 కాలం నాటి విషయాలను తెలుసుకుంటాడు ఆగస్త్య. ఆ కాలంలో సిద్దార్థ్ (యాక్షన్‌కింగ్ అర్జున్) అనే సిద్ధవైద్యుడు ఉండేవాడని, అతను బోన్ క్యాన్సర్‌కు సిద్దవైద్యంతో మందు కనుక్కునే ప్రయత్నం చేశాడని, ఈ
ప్రయత్నాన్ని అప్పటి పాండిచ్చేరి బ్రిటిష్ సబ్‌గవర్నర్ ఎడ్విన్ డిప్లెసిస్ (ఎడ్విన్) అడ్డుపడ్డాడని తెలుస్తుంది. ఆ మందును ఇప్పుడు ఎలాగైనా కనిపెట్టి, బోన్ క్యాన్సర్ వ్యాధిని కనిపెట్టి, తన అమ్మను రక్షించుకోవాలని ఆగస్త్య నిర్ణయించుకుంటాడు. మరి…ఈ క్రమంలో ఏం జరిగింది? ఆగస్త్య ఇందులో సక్సెస్ అయ్యాడా? అనేది సినిమాలో చూడాలి.
విశ్లేషణ
సినిమా కథ రెండు టైమ్‌లైన్స్‌లో సాగుతుంది. ఒకటి ప్రజెంట్…రెండు 1940. అయితే 1940లో జరిగే సన్నివేశాల్లో అర్జున్‌యే హీరోగా అన్నట్లు చూపిస్తారు. ఇరవై నిమిషాల తర్వాత 1940 స్టోరీ మొదలవు తుంది. కథలో లవ్, మదర్‌సెంటిమెంట్, దేశభక్తి, సిద్దవైద్యం, దైవశక్తి, హారర్…ఇలా నాలుగైదు జానర్స్‌తో కలిపి ఈ సినిమా కథ సాగుతుంది. హీరో జీవ, అర్జున్‌లకు బ్యాక్‌స్టోరీలు ఉంటాయి. కథలోని ఇతర పాత్రల్లో కూడా బ్యాక్‌స్టోరీ కథల లేయర్స్ ఉంటాయి. ఇన్ని స్టోరీస్ మధ్య ఆడియన్స్ కన్‌ఫ్యూజ్ అయ్యే చాన్సెస్ ఉన్నాయి. 1940లో ఫ్రీడమ్ ఫైటర్‌గా ఉన్న నాన్జీ క్యారెక్టర్‌కు కథలో బలం ఉండదు. ప్రజెంట్ ఆర్ట్ డైరెక్టర్‌గా ఆగస్త్య పాత్రకు నాజ్జీ పాత్రతో కనెక్షన్ క్రియేట్ చేయడం కోసమే దర్శకుడు ఇలా చేశాడెమో అనిపి స్తుంది. సిద్దార్థ్ గా అర్జున్ లవ్‌ట్రాక్ కూడా రోటీన్‌గా ఉంటుంది. చివర్లో ఆత్మల ఫైటింగ్‌తో కథ ముగుస్తుంది. కథలో కొంచెం ఇమాజినేషన్ కూడా ఉంటుంది. భారతదేశంలో సిద్ధవైద్యం ప్రాముఖ్యతను చెప్పాలనుకున్నది దర్శకుడు మెయిన్ పాయింట్‌నా? లేక బోన్ క్యాన్సర్ నుంచి తన తల్లిని హీరో కాపాడుకోవడం అనేది సినిమా కోర్ పాయింట్‌నా? అనేది క్లారిటీ ఉంది. విజువల్స్ బాగున్నాయి. గ్రాఫిక్స్ బాగానే చేశారు.
పెర్ఫార్మెన్స్
ఆర్ట్ డైరెక్టర్ ఆగస్త్యగా, స్వాతంత్య్రసమరయోధుడిగా జీవ కనిపించారు. ఉన్నంతలో బాగానే చేశారు. స్వా తంత్య్ర సమరయోధుడు నాన్జీ పాత్రకు కూడా కొంచెం బలం ఉండాల్సింది. కథలో మరో ప్రధానమైన పాత్ర సిద్దార్థ్‌ది. ఒక దశలో ఈ సినిమాకు హీరో అర్జున్‌యే అన్నట్లుగా కథ సాగు తుంది. అర్జున్ బాగానే పెర్ఫార్మ్ చేశారు. ఎడ్వర్డ్ డూప్లెక్స్‌గా ఎడ్వర్డ్ సొనేన్నేబ్లెక్‌కు మంచి రోల్ పడింది. ఎడ్వర్డ్ సోదరి, సిద్దార్థ్ లవర్ జాక్వె లిన్‌గా మాటిల్డాకు కథలో పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న రోల్ చేశారు. జీవ తల్లిగా రోహిణీ కనిపించారు. ఈ పాత్రతో ఎదో ఎమోషన్‌ను క్రియేట్ చేయాలను కున్నారు కానీ వర్కౌటయినట్లుగా లేదు. శేషాద్రిగా రాధా రవి క్యారెక్టర్‌తో కామెడీ రాబట్టాలకున్న కుదర్లేదు. యోగిబాబు, వీటీవీ గణేష్, అభిరామి, పూర్ణిమా భగ్యరాజ్‌లు గెస్ట్ రోల్స్‌లో చేశారు. సినిమాటోగ్రఫీ సూపర్భ్‌గా ఉంటుంది. క్లైమాక్స్ విజువల్స్ బాగున్నాయి. ఎడిటింగ్ ఒకే. నిర్మాతలు బాగానే ఖర్చుపెట్టారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఈ సినిమాకు ఫ్లస్ కాలేకపోయింది.