హిందీ రామాయణ సినిమాను నితీష్ తివారి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటివరకు ఈ సినిమాలోని నటీనటుల విషయాలపై అఫిషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రాలేదు. కానీ..నితీష్ తివారి హిందీ రామాయణ మూవీలో..రాముడిగా రణ్‌బీర్‌కపూర్, సీతగా సాయిపల్లవి, లక్ష్మణుడిగా రవి దుబే, హను మంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ చేస్తున్నారని ఆల్మోస్ట్ కన్ఫార్మ్ అయిపోయింది. ఇప్పుడు మిగిలిన పాత్రలకు సంబంధించిన ఒక్కో రివీల్…బయటకు వస్తుం ది. ఈ హిందీ రామాయణ సినిమాలో రావణుడి భార్య మండోదరిగా కాజల్ అగర్వాల్ (kajal in Ramayana movie) కనిపించనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. రీసెంట్ టైమ్స్‌లో ముంబైలో వేసిన ఓ భారీ సెట్‌లో యశ్ పాల్గొంటుండగా, కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌లోకి కాజల్ అగర్వాల్ జాయిన్ అయ్యారని, ప్రజెంట్ యశ్–కాజల్ కాంబినేషన్‌లోని సీన్స్‌ను మేకర్స్ తీస్తున్నారని బాలీవుడ్ సమాచారం.
హిందీ రామాయణ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. నమిత్ మల్హోత్రా, యశ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హిందీ రామాయణ తొలిభాగం 2026 దీపావళికి, రెండోభాగం 2027 దీపావళికి రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు. విశేషం ఏంటంటే..ఈ సినిమా తొలిభాగం ఆల్రెడీ పూర్తయిపోయిందని, మలిభాగం షూటింగ్ ఇప్పుడు జరుగుతుందని తెలు స్తోంది. రెండు పార్టుల సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాతే, సినిమా అప్‌డేట్స్‌ను ఒక్కొక్కటిగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.
కన్నప్పలో పార్వతిదేవి!
రామాయణ సినిమాలో మండోదరిగా ఆల్మోస్ట్ కన్ఫార్మ్ అయిపోయిన కాజల్ అగర్వాల్, మంచు విష్ణు తీస్తున్న ‘కన్నప్ప’ మూవీలో పార్వతి దేవి పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే కదా. ఈ మూవీలో కన్నప్పగా మారిన తిన్నడు పాత్రలో మంచు విష్ణు, రుద్రగా ప్రభాస్, శివుడి పాత్రలో అక్షయ్‌కుమార్ కనిపిస్తారు. జూన్ 27న కన్నప్ప సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది.