Kalyani priyadarshi emotional comments on Vijay rashmika marriage : టాలీవుడ్ మోస్ట్ టాక్డ్ కపుల్ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ఎట్టకేలకు వివాహ బంధంతో ఒకటయ్యారు.సుదీర్ఘ కాలం పాటు సాగిన రూమర్లకు తెరదించుతూ, ఈ జంట ఫిబ్రవరి 27న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా ఏడడుగులు వేశారు. అత్యంత సన్నిహితులు, ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక ఎంతో ప్రైవేట్‌గా, ఆత్మీయంగా జరిగింది. పెళ్లి అనంతరం తమ మధుర క్షణాలను సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో, “విరోష్” అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
ఈ వివాహ వేడుకలో రష్మిక ప్రాణ స్నేహితురాలు, నటి కళ్యాణి ప్రియదర్శన్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.” నా ప్రియ స్నేహితురాలు తన మనసుకు నచ్చిన వాడిని పెళ్లాడటం చూడటం మనసు నిండిపోయేలా ఉంది. రష్మిక నడుచుకుంటూ వస్తున్నప్పుడు వారిద్దరి కళ్లలో మెరిసిన ఆనంద బాష్పాలు వారి స్వచ్ఛమైన ప్రేమకు సాక్ష్యంగా నిలిచాయి.”స్నేహంతో మొదలైన వీరి ప్రయాణం నేడు వైవాహిక బంధం వరకు చేరడం అద్భుతం. ఈ వేడుకలో భాగమవ్వడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను” అంటూ కళ్యాణి భావోద్వేగానికి లోనయ్యారు.ప్రస్తుతం ఈ హీరోయిన్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.’గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి చిత్రాలతో వెండితెరపై మ్యాజిక్ చేసిన ఈ జోడీ, ఇప్పుడు నిజ జీవితంలోనూ జంటగా మారడం విశేషం.
తెరపై వీరి కెమిస్ట్రీని ఇష్టపడే అభిమానులు, ఇప్పుడు భార్యాభర్తలుగా మారిన వీరిని చూసి నెట్టింట శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు విజయ్, రష్మికల పెళ్లి ఉదయ్‌పూర్ లో జరగడంతో కేవలం కుటుంబ సభ్యులే హాజరయ్యారు. అందుకే రిసెప్షన్‌కు మాత్రం సినీ, రాజకీయ రంగాల ప్రముఖులను భారీగా ఆహ్వానిస్తున్నారు. మార్చ్ 4 న వీరి రిసెప్షన్ జరగనుంది. ఈ రిసెప్షన్ కు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి సీనియర్లతో పాటు మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు హాజరయ్యే అవకాశం ఉంది. సుకుమార్, సందీప్ రెడ్డి వంగా , పరశురామ్ వంటి ప్రముఖులు ఈ లిస్ట్‌లో ఉన్నారు. రష్మిక పాన్ ఇండియా స్టార్ కావడంతో బాలీవుడ్ నుంచి రణబీర్ కపూర్, కన్నడ నుంచి రిషబ్ శెట్టి వంటి వారు వచ్చే అవకాశం ఉందని టాక్.