బ్రహ్మాజీ, శత్రు, ‘మాస్టర్’ మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఇన్వెస్టిగేటివ్ సస్సెన్స్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ‘కర్మణ్యే వాధికారస్తే’ (Karmanye Vadhikaraste). బెనర్జీ, పృథ్వీ, శివాజీ రాజా, అజయ్ రత్నం, శ్రీ సుధా ఈ సినిమాలోని ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. అమర్ దీప్ చల్లపల్లి దర్శ కత్వంలో ఈ చిత్రాన్ని ఉషస్విని ఫిలిమ్స్ పతాకంపై డి ఎస్ ఎస్ దుర్గా ప్రసాద్ నిర్మించారు. ఇటీవలే మధుర ఆడియో ద్వారా ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఇప్పుడు ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ‘కర్మణ్యే వాధికారస్తే’ సినిమాను సెప్టెంబర్ 19 న విడుదల చేయ నున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.
మళ్లీ మళ్లీ కలిసేలా …నచ్చావే చాలా చాలా…….
”కర్మణ్యే వాధికారస్తే’ అంటే “”పని చేసే హక్కు నీకుంది, ఫలితాల మీద కాదు” అనేది అర్థం. భారతీయ ఇతీహాసం భగవద్గీత లోని ఒక పదం. ఈ టైటిల్ కి అనుగుణంగా కథ కూడా చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. కథకు తగ్గట్లుగా బ్రహ్మాజీ, శత్రు, ‘మాస్టర్’ మహేంద్రన్ వారి నటనతో ఈ సినిమాకు ప్రాణం పోశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, ఈ సినిమాను సెప్టెంబరు 19న రిలీజ్ చేస్తున్నాం. ఈ చిత్రంతో కృష్ణ భట్, ఇరా దయానంద్, అయేషా, రెహానా ఖాన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు” అని చిత్రంయూనిట్ పేర్కొంది.