కిరణ్ అబ్బవరం కెరీర్‌లో మేజర్ హిట్ ఫిల్మ్ ‘క’. ఈ సినిమా గత ఏడాది దీపావళి సందర్భంగా విడుదలై, బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. కిరణ్ అబ్బవరం ‘క’ సినిమా రిలీజ్ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారెమె కానీ…తన తాజా సినిమా ‘కె-ర్యాంప్’ (kiran Abbavaram K-Ramp) ను దీపావళి సందర్భంగానే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కిరణ్ అబ్బవరం కెరీర్‌లోని ఈ 11వ సినిమాకు జైన్స్ నాని దర్శకుడు. రాజేష్ దండ, శివ బొమ్మ నిర్మాతలు. యుక్తి తరేజా హీరోయిన్‌గా చేస్తున్నారు. ఈ ‘కె-ర్యాంప్’ (K-Ramp)సినిమా స్పోర్ట్స్ డ్రామా అని తెలుస్తోంది. రూలర్ బ్యాక్‌డ్రాప్ మూవీ. ఆల్రెడీ షూటింగ్ మొదలైంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసి, కే-ర్యాంపు సినిమాను ఈ దీపావళి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.
పోయిన ఏడాది దీపావళికి ‘క’ సినిమాతో పాటుగా దుల్కర్‌సల్మాన్ ‘లక్కీభాస్కర్’, శివకార్తీకేయన్ ‘అమరన్’ సినిమాలు విడుదలైయ్యాయి. అయితే ఈ మూడు సినిమాలు విజయం సాధించాయి. ఈ దీపావళికి కూడా ‘కె-ర్యాంపు’ సినిమాతో పాటుగా, సిద్దు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’, ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’ సినిమాలు ఆల్రెడీ దీపావళి రిలీజ్‌ను ప్రకటించాయి. కార్తీ ‘సర్దార్ 2’ లేదా సూర్య ‘కరుప్పు’లలో ఏదో ఒకటి దీపావళి సందర్భంగా విడుదల అయ్యే చాన్సెస్ ఉన్నాయనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ‘సర్దార్ 2’ షూటింగ్ పూర్తయింది. పైగా ‘సర్దార్’ సినిమా కూడ దీపావళి సందర్భంగానే రిలీజైంది. సో..ఎక్కువ శాతం ‘సర్దార్ 2’ సినిమా రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇక కిరణ్ అబ్బవరం నుంచి విడుదలైన గత చిత్రం ‘దిల్ రుబా’ ప్రేక్షకులను నిరాశపరించింది. ఈ నేపథ్యంలో ‘కె-ర్యాంపు’ సినిమా ఎలా ఉండబోతుందన్న ఆసక్తి ఆడియన్స్‌లో ఉంటుంది. పైగా ఈ సినిమా కిరణ్ అబ్బవరం కెరీర్‌కు ఎంతో కీలకం కానుంది.