KiranAbbavaram New Film: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ‘కె’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత కిరణ్ అబ్బవరంకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రజెంట్ కిరణ్ చేతిలో దాదాపు 6 సినిమాలు ఉన్నాయి. వీటిలో నాలుగు ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉండగా, మరో రెండు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. ‘ది చెన్నైలవ్‌స్టోరీ’ సినిమా షూటింగ్ జరుగుతోంది. కిరణ్ నటించిన ‘కె–ర్యాంపు’ సినిమా ఈ దీపావళి సందర్భంగా థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.
ఇక హీరోగానే కాక, నిర్మాతగానూ బిజీ అవ్వాలనుకుంటున్నాడు కిరణ్ అబ్బవరం. ‘క’సినిమా తానే నిర్మాత. పనిలో పనిగా, తాను ఎప్పట్నుంచో అనుకుంటున్న ఓ ట్రయాలజీ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేశాడు కిరణ్ అబ్బవరం. లంకెబిందెల నేపథ్యంతో సాగే ఈ పీరియాడికల్ మిస్టీరియస్ ఫిల్మ్‌కి, ఓ యువ దర్శకుడు దర్శకత్వం వహిస్తారు. ‘క’ సినిమా సమయంలోనే ఈ సినిమాను గురించి, కిరణ్ అబ్బవరం చెప్పుకొచ్చారు. ఈ సినిమా ట్రయాలజీలోని సినిమాలకు ‘దీపావళి రోజు’, ‘ఉగాది రోజు..’ అంటూ తెలుగు ఆడియన్స్‌కు నచ్చే టైటిల్స్‌ను ప్లాన్ చేస్తున్నారట కిరణ్. ఈ సినిమాపై త్వరలోనే ఓ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అలాగే ‘క’ సినిమా సీక్వెల్‌కు సంబంధించిన పనులు కూడా ఊపందుకున్నాయి.