సినిమా: ప్రవీంకూడు షాపు (Pravinkoodushappu Telugu Review)
ప్రధాన తారాగణం: బాసిల్ జోసెఫ్, చాందినీ శ్రీధరన్, షౌబిన్ షాహిర్, చెంబన్ వినోద్ జోస్
దర్శకత్వం: శ్రీరాజ్ శ్రీనివాసన్
నిర్మాణం: అన్వర్ రషీద్
సంగీతం: విష్ణు విజయ్
కెమెరా:మహమ్మద్ అలీ
ఎడిటింగ్: ఖలీద్
ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్‌నర్: సోనీ లివ్
కథ
ఎస్‌ఐ సంతోష్ (జోసెఫ్ బాసిల్)కు కల్లు వాసన అంటే పడదు. కానీ ఓ కల్లు దుకాణం యజమాని కొంబన్ బాబు (శివాజిత్) మర్డర్ కేస్‌ను సాల్వ్ చేయాల్సిన బాధ్యత సంతోష్‌పై పడుతుంది. ఓ వర్షం పడుతున్న రాత్రి కల్లుదుకాణంలో, ఆ షాపు యజమాని(కొంబన్ బాబు)తో పాటుగా, మరో పదకొండు మంది కల్లు సేవిస్తూంటారు. వీరిలో కొందరు పేకాట ఆడుతుంటారు (వేర్వేరు గదుల్లో). ఇంతలో కొంబన్ బాబు కల్లు దుకాణంలో ఉరి వేసుకున్నట్లుగా కనిపిస్తుంది. కానీ బాబు చాలా ఎగ్రెసివ్ అండ్ ఎనర్జిటిక్ పర్సన్. ఆ ఏరియాలో పెద్ద రౌడీ. ఇలాంటి వ్యక్తి ఊరి వేసుకోవడం జరగదు. భారీ ఆహార్యం ఉన్న బాబులాంటి వ్యక్తిని ఊరి వేసి చంపాలంటే కనీసం ఇద్దరు వ్యక్తులు కావాలి. పైగా కల్లుదుకాణంలో పదకొండుమంది ఉన్న ప్పుడు ఎవరు హత్య చేయడానికి సాహసించరు. ఎందుకంటే..ఇతరులు సాక్షులగా మారిపోతారు కాబట్టి. అయినా. కొంబన్ బాబు హత్య జరుగుతుంది (Pravinkoodushappu Telugu Review)
మరి..కొంబన్ బాబును కల్లు దుకాణంలో ఉన్న పదకొండు మందిలో ఎవరు హత్య చేశారు? పోలీసులు ప్రధానంగా ఈ కల్లు దుకాణంలో పని చేసే కన్నన్ (షౌబిన్ షాహిర్), కన్నన్ దగ్గర మ్యాజిక్ నేర్చు కోవాలనుకునే సుని (చెంబన్ వినోద్ జోస్), కన్నన్ భార్య మెరెండా (చాందినీ శ్రీధరన్)లనే ఎందుకు టార్గెట్ చేశారు. పది రోజుల్లో కేసును సాల్వ్ చేస్తానన్న సంతోష్ తన చాలెంజ్‌లో గెలిచాడా? అసలు.. బాబును హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఎందుకు? ఎలా? చేశారు? అన్నది సినిమా కథనం(Pravinkoodushappu Review )
సినిమా ఎలా ఉందంటే…
ఇన్వెస్టిగేటివ్ అండ్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది. ఇటీవల మలయాళ క్రైమ్ మూవీస్ ‘సూక్ష్మదర్శి ని, కిష్కిందకాండ,రేఖాచిత్రమ్, ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ వంటి సినిమాలు ఓటీటీ ఆడియన్స్‌ను బాగా మెప్పించాయి.ఈ సినిమాలను తెలుగు ఓటీటీ ఆడియన్స్ బాగా ఫాలో అయ్యారు. ఈ కోవలో వచ్చిన మరో మూవీయే ‘ప్రవింకూడు షాపు’ సినిమా.
మలయాళ సినిమాలు మెల్లిగా మొదలవుతాయి. సెకండాఫ్ వరకు కథ సాగుతూనే ఉంటుంది. సడన్‌గా… చివరి నలభై నిమిషాల్లో ఇంట్రెస్టింగ్‌గా మారిపోతుంది. ‘ప్రవింకూడు షాపు’ మూవీలోనూ ఇదే జరిగింది. కల్లుదుకాణంలో జరిగిన మర్డర్ సన్నివేశాలు, పోలీసు ఆఫీసర్ సంతోష్ పరిశోధన విజువల్స్, నిందితుల ఇన్వేస్టిగేషన్ వంటి సీన్స్‌తోనే కథ రోటీన్‌గా మెల్లగా సాగుతుంది.
కానీ ఎప్పుడైతే చనిపోయిన వ్యక్తి క్యా రెక్టర్ బ్యాక్‌స్టోరీ తెరపైకి రావడం, మెరిండా పాత్ర కథలోకి రావడం జరుగుతుందో కథ కాస్త ముందుకు కదులుతుంది. ఇక్కడ కూడా భార్యభర్తలైన కన్నన్–మెరిండా సన్నివేశాలు మళ్లీ రోటీన్‌గానే ఉంటాయి. అయితే బాబు మర్డర్‌ను సుని చేశాడని సంతోష్ ఓ నిర్ణయానికి వచ్చి, ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టినప్పుడు కథ వేగం పెరుగుతుంది.
మెరెండాతో నిజం రాబట్టాలని సంతోష్ చేసే ప్రయత్నాల సన్నివేశాలు, కన్నన్–సంతోష్‌ల సన్నివేశాలు సాధారణంగానే ఉంటాయి. కానీ ప్రీ క్లైమాక్స్‌లో కన్నన్–సునిల మధ్య సన్నివేశాలే ఈ సినిమాకు హైలైట్. సీన్‌ను రీ క్రియేట్ చేసే ప్రీ క్లైమాక్స్ సన్నివేశం సూపర్భ్‌గా ఉం టుంది. దర్శకుడి పనితనం ఇక్కడ బయటపడుతుంది. బాబును ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అనే కోర్ పాయింట్ చాలా సినిమాల్లో సాధారణమైన విషయమే. కానీ ఎలా చంపారు? అనే పాయింటే ఈ సినిమాకు బలం.
ఎవరు ఎలా చేశారు?
ఎస్‌ఐ సంతోష్‌గా జోసెఫ్ బాసిల్ (Basil joseph) మంచి యాక్టింగ్ చేశాడు. కన్నన్, మెరిండాల పాత్రలతో వచ్చే సన్ని వేశాల్లో తన యాక్టింగ్ స్టైల్ చూపించాడు. ముఖ్యంగా మెరిండాతో వచ్చే సీన్స్‌లో జోసెఫ్ యాక్టింగ్ మెప్పిస్తుంది. ఇక షౌబిన్ షాహిర్ (Soubin Shahir) నటన ఈ సినిమాకే మేజర్ హైలైట్. ఒకరకంగా ఈ సినిమాకు అతనే హీరో అన్న రేంజ్‌లో అతని యాక్టింగ్, అతని పాత్ర ఇంపార్టెన్స్ కథలో ఉంటుంది. దివ్యాంగుడిగా నటించడం, మ్యాజిక్ సీన్స్‌లో షౌబిన్ యాక్టింగ్ సూపర్భ్.
ఇక చాందినీ శ్రీధర్ రోల్ కథలో మంచి ఇంపార్టెన్స్ ఉంది. కోర్ పాయింట్, మూలకథ..ఈ పాత్రతోనే ముడిపడి ఉంటుంది. ట్విస్ట్‌లు, మలుపులు కూడా ఈ పాత్రతోనే కనెకై్ట ఉంటాయి. తొలిభాగంలో పెద్ద ప్రాముఖ్యత లేకపోయినా…సెకండాఫ్‌లో వినోద్ జోస్ రోల్‌కు మంచి ఇంపార్టెన్స్ ఉంది. ముఖ్యంగా సీన్ –రీ క్రియేషన్‌లో ఈ పాత్రకు మంచి వెయిట్ కనిపిస్తుంటుంది. బాబుగా శివాజిత్ యాక్టింగ్ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలకే పరిమితమైంది.
దర్శకుడు సిరాజ్ శ్రీనివాసన్ టేకింగ్, టెల్లింగ్ బాగున్నాయి. కథ, స్క్రీన్ ప్లేని ఇంకాస్త గ్రిప్పింగ్ చెప్పి ఉండాల్సింది. విష్ణు విజయ్ మూవీస్ మ్యూజిక్ ఒకే. ఖలీద్ విజువల్స్ ఫర్వాలేదు. మహమ్మద్ అలీ.. ఎడిటింగ్ ఇంకొంచెం చేయవచ్చు. కల్లుదుకాణం సీన్స్, సెకండాఫ్‌లో మరికొన్ని సీన్స్‌కు కత్తెర వేసే చాన్స్ అయితే ఉంది.
బాటమ్‌లైన్: మర్డర్ విత్ మ్యాజిక్ (ఒపిగ్గా క్రైమ్ థ్రిల్లర్స్ చేసే ఆడియన్స్‌కు ఈ సినిమా నచ్చుతుంది)
రేటింగ్: 2.75/5