Manchu Manoj: గత మూడు రోజులుగా మంచు ఫ్యామిలీలో (Manchu Family) ఆస్తుల విషయంలో గొడవులు జరుగుతున్నాయన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. మొదట్లో ఈ వార్తల్లో నిజం లేదన్న పుకార్లు వినిపించాయి. కానీ పోలీసులు డయల్ 100కి ఫిర్యాదు అందినట్లుగా వెల్లడించారు. ఆ తర్వాత మంచు మనోజ్ తాను గాయపడ్డట్లుగా హాస్సిటల్లో చికిత్స తీసుకున్నారు. దీంతో మంచు ఫ్యామిలీలో గొడవులు జరిగిన విషయం నిజమేనని ఖరారైపోయింది. తాజాగా తన రెండో కుమారుడు మంచు మనోజ్‌పై మోహన్‌బాబు పోలీలసులకు ఫిర్యాదు చేశారు.
‘‘కొందరు అసాంఘీక వ్యక్తులతో కలిసి మనోజ్ (Manchu Manoj) నా ఇంటి వద్ద అలజడి సృష్టించాడు. మనోజ్, అతని భార్య మౌనికలు కలిసి చట్టవిరుద్ధంగా నా ఇంటికి ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. మాదాపూర్‌లోని నా ఆఫీస్‌లో 30మంది చొరబడి అక్కడి సిబ్బిందిని బెదిరించారు. నా నివాశాన్ని ఖాళీ చేయమని బెదిరి స్తున్నారు. నాకు రక్షణ కల్పించండి’ అంటూ మంచు మనోజ్‌పై ఆరోపణలు చేస్తూ రాచకొండ పోలీసులకు మంచు మోహన్‌బాబు (Manchu MohanBabu) ఫిర్యాదు చేశారు.
My humble request to serve justice through a transparent and righteous investigation.@ncbn Garu @naralokesh Garu @PawanKalyan Garu @Anitha_TDP Garu @revanth_anumula Garu @Bhatti_Mallu Garu @TelanganaCMO @TelanganaDGP Garu 🙏🏼 https://t.co/M3xbNALZje pic.twitter.com/BBokLPLNEP
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) December 9, 2024
తాజాగా ఈ విషయంపై మంచు మనోజ్ (Manchu Manoj) స్పందించారు. ‘‘మా నాన్నగారు నాపై, నా భార్యపై చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలు. నా ఆర్థిక అవసరాల కోసం మా ఫ్యామిలీపై నేను ఎప్పుడూ ఆధారపడ లేదు. స్వతంత్రంగా ఎంతో హుందాగా జీవిస్తున్నాం. కొన్ని కారణాల వల్ల మంచు విష్ణు దుబాయ్‌కి వెళ్లారు.మా అమ్మగారికి తోడుగా ఉండేందుకు నన్ను ఇక్కడ ఉండమన్నారు మా నాన్న. ఆ సమయంలో నా భార్యగర్భవతి. నాలుగు నెలలుగా నేను ఇక్కడ ఉంటున్నాననేది అవాస్తవం. ఏడాదికి పైగా ఉంటున్నాను. కావాలంటే నా మొబైల్ సిగ్నల్ టవర్ లోకేషన్ చెక్ చేసుకోవచ్చు. ఏడు నెలల నా కుమార్తెను ఈ ఇష్యూలోకి తీసుకురావడం, ఫిర్యాదులో ప్రస్తావించడం అనేది ఆ మానవీయం. అసలు సీసీ టీవీ మాయం కావడంవెనకాల ఉన్న కారణాలపై పోలీసుల ఎంక్వైరీ జరగాలి. అసలు..ఏం దాచడానికి ప్రయత్నిస్తున్నారు.
RRR Documentary: ఆర్ఆర్ఆర్ పై డాక్యుమెంటరీ ఈ సీక్రెట్స్‌పై క్లారిటీ వస్తుందా?
మా నాన్న, విష్ణు సినిమాల కోసం నేను ఎంతో కష్టపడ్డాను. ఎనిమిది సంవత్సరాలు శ్రమించాను. ఫ్యామిలీ కోసం కష్టపడ్డాను. రూపాయి కూడా ఆశించలేదు. కానీ ఫ్యామిలీ బెనిఫిట్స్ అన్నీ విష్ణుకు దక్కాయి. మా నాన్న కూడా అన్ని వేళల విష్ణుకే అండగా ఉన్నారు. నన్ను పక్కన పెట్టారు. నేను ఫ్యామిలీ కోసం కొన్ని త్యాగాలు చేసినా కూడా నాపై వివక్ష కొనసాగింది.
అసలు…సీసీటీవీ డ్రైవ్ ఎందుకు మిస్ అయ్యింది. ఏం దాచడానికి ప్రయత్నిస్తున్నారు. వారసత్వ ఆస్తులు కావాలని నేను ఎప్పుడు ఎక్కడ అడిగాను? ఫ్యామిలీ మనీని వృధా చేస్తున్నది నేనా..విష్ణునా..? ’’అంటూ ఓ సుధీర్ఘమైన రిప్లైను ‘ఎక్స్’లో షేర్ చేశారు మంచు మనోజ్ కుమార్.
pushpa2 Collections: హిందీలో టాప్ ప్లేస్‌కి పుష్ప 2 ఎంత కలెక్ట్ చేయాలో తెలుసా?