మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa First Review). శివభక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా ‘కన్నప్ప’ (Kannappa Movie) సినిమాను చిత్రీకరించారు. మంచు విష్ణు ఈ సినిమాకు స్క్రిప్ట్‌ను అందించారు. హిందీలో మహా భారతం సీరియల్ (2013)ను డైరెక్ట్ చేసిన, ముఖేష్‌కుమార్ (Kannappa movie director Mukesh Kumar Singh) ఈ సినిమాకు దర్శకుడు. ‘కన్నప్ప’ సినిమాను మంచు మోహన్‌బాబు నిర్మించారు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. దాదాపు రూ. 200 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ ‘కన్నప్ప’ సినిమా (Kannappa movie) ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. మోహన్‌బాబు, మోహన్‌లాల్, ఆర్. శరత్‌కుమార్, బ్రహ్మానందం, ప్రభాస్ (Kannappa Prabhas role Rudra), కాజల్ అగర్వాల్, సప్తగిరి, బ్రహ్మాజీ, శివ బాలాజీ…వంటి వారు నటించిన ఈ సినిమాలో ప్రీతి ముకుందన్ (Kannappa movie heroine Preity mukhundhan) హీరోయిన్‌గా నటించారు. స్టీఫెన్ దేవస్సీ (Kannappa Music Director) ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఈ కన్నప్ప సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదలైంది.
కన్నప్ప కథ (Kannappa movie Story)
దేవుడిపై నమ్మకం లేని తిన్నడు, ఆ పరమశివుడికి ఎలా భక్తుడు అయ్యాడు? అన్నదే ‘కన్నప్ప’ సినిమా కథ. కథ అందరికీ తెలిసిందే. కన్నప్ప జీవితం ఆధారంగా గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో దర్శకుడు ముఖేష్‌కుమార్…కన్నప్ప కథను ఎలా ప్రజెంట్ చేశారన్నదే ఆసక్తికరంగా ఉండబోతుంది. ఇక దేవుడికి, భక్తుడికి మధ్యలో ఎవరూ ఉండాల్సిన అవసరం లేదని, మనసారా భక్తితో పూజిస్తే చాలని, కొన్ని మూఢనమ్మకాలను వద్దని చెప్పడమే ‘కన్నప్ప’ సినిమా తీయడం వెనక ఉన్న ఉదేశమని మంచు విష్ణు చెబుతున్నారు. ఇక కన్నప్ప పాత్రకు మంచు విష్ణు వందశాతం న్యాయం చేశారని, ఆ విషయాన్ని సినిమాల్లో చూస్తారని, ముఖ్యంగా సినిమాలోని అఖరి గంట ఈ సినిమాకు ఎంతో కీలకమని ఈ చిత్రం దర్శకుడు ముఖేష్‌కుమార్ ఇటీవల ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. విడుదలైన ట్రైలర్‌ని బట్టి, ఈ సినిమా కథ ప్రధానంగా వాయులింగం చుట్టు తిరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా…ఈ సినిమా మేజర్ షూటింగ్ న్యూజిలాండ్‌లో జరిగింది. ప్రభాస్, అక్షయ్‌కుమార్‌ల సన్నివేశాలను మాత్రమే ఇండియాలో చిత్రీకరించామని ఈ చిత్రం దర్శకుడు ముఖేష్‌కుమార్ సింగ్ చెబుతున్నారు.
ప్రభాస్ వచ్చేది సెకండాఫ్‌లోనే..!
‘కన్నప్ప’ సినిమాకు మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే లక్షకుపైగా సినిమా టికెట్లు బుక్ కావడమే ఇందుకు ఓ నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం థియేటర్స్‌లో ‘కుబేర’ సినిమా ఒక్కటే ఉంది. కానీ ఈ సినిమాపై బజ్ మెల్లిగా తగ్గుతోంది. ఇలాంటి సమయంలో కన్నప్ప సినిమా విడుదల అవుతుండటం, ఈ సినిమాలో భారీ తారాగణం ఉండటంతో ‘కన్నప్ప’ సినిమాపై అంచనాలు ఉన్నాయి. అలాగే ఈ కన్నప్ప సినిమాలో ప్రభాస్ 40 నిమిషాల వరకు ఉంటారని, మంచు విష్ణు కన్ఫార్మ్ చేశారు. దీంతో ‘కన్నప్ప’ సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోయాయి. ఈ అంచనాలకు తగ్గట్లే ‘కన్నప్ప’ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆసక్తిగా అనిపించింది. ఆడియన్స్‌ను ఏట్రాక్ట్ చేసింది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ ఉండే 40 మినిట్స్ ఎపిసోడ్ మాత్రం సెకండాఫ్‌లోనే ఉంటుంది.
Kannappa movie cast and Crew: ఎవరు ఏ పాత్రలో చేశారు?
కన్నప్ప సినిమాలో భారీ తారాగణం ఉంది. కన్నప్ప సినిమాలో మంచు విష్ణు తండ్రి మోహన్‌బాబు, మంచు విష్ణు ముగ్గురు కుమార్తెలు, కొడుకు అవ్రామ్ నటించడం విశేషం. ఈ సినిమాలో తిన్నడి చిన్నప్పటి పాత్రలో అవ్రామ్ యాక్ట్ చేశాడు. ట్రైలర్‌లో ఈ షాట్స్ చూడొచ్చు.
తిన్నడు ఆలియాస్ కన్నప్ప పాత్రలో మంచు విష్ణు
నెమలిరాణి పాత్రలో ప్రీతిముకుందన్
మహాదేవశాస్త్రి పాత్రలో మోహన్‌బాబు
మల్లయ్య పాత్రలో రఘుబాబు
కుమార దేవ శాస్త్రి పాత్రలో శివ బాలాజీ
రుద్రగా ప్రభాస్
కిరాతగా మోహన్‌లాల్
శివుడి పాత్రలో అక్షయ్‌కుమార్
పార్వతి దేవీగా కాజల్ అగర్వాల్ నటించారు. ఇంకా బ్రహ్మానందం, బ్రహ్మాజీ, సురేఖా వాణి, ముకేష్‌రుషి, ఐశ్వర్యా భాస్కరణ్, సప్తగిరి..వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు.
ఇంకా చాలామంది ఈ సినిమాలో నటించారు. ఇక ఈ సినిమా మూడు గంటల నిడివి ఉంది. తొలుత మూడు గంటల ముప్పై నిమిషాల నిడివి ఉన్నట్లుగా వార్తలొచ్చాయి. కానీ ఫైనల్‌గా మూడుగంటల మూడు నిమిషాలకు ఈ సినిమా నిడివిని తగ్గించారు మేకర్స్.
ఆలస్యంగా ఓటీటీలోకి..
ఈ సినిమాపై నమ్మకంతో ‘కన్నప్ప’ సినిమాను పది వారాల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేస్తామని విష్ణు మంచు చెబుతున్నారు. అలాగే ఈ సినిమాలో వీఎఫ్‌ఎక్స్ కోసం భారీ ఖర్చు చేశామని, అది స్క్రీన్‌పై అద్భుతంగా కనిపిస్తుందని, దాదాపు పదికోట్ల రూపాయాలు వీఎఫ్‌ఎక్స్ ఖర్చు రూపంలో వేస్ట్ అయ్యాయని ఓ ఇంటర్వ్యూలో విష్ణు మంచు చెప్పారు