‘90స్ మిడిల్ క్లాస్ బయోపిక్‘ ఫేమ్ మౌళి తనుజ్, యంగ్ హీరోయిన్ శివానీ నాగరం లీడ్ రోల్స్‌లో నటించిన ప్రేమకథా చిత్రం ‘లిటిల్ హార్ట్స్‘. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. ‘90స్ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్ ఫేమ్ దర్శకుడు ఆదిత్య హాసన్ ‘లిటిల్ హార్ట్స్’ (Little Hearts )చిత్రాన్ని నిర్మించారు. ముందుగా ఈ లిటిల్ హార్ట్స్ చిత్రాన్ని డైరెక్ట్‌గా ‘ఈటీవీ విన్’ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు ప్లాన్ చేశారు. కానీ సినిమాపై నమ్మకంతో నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్ గా రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబరు 5న ఈ సినిమాను రిలీజ్ కానుంది. సెప్టెంబరు 4న పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు.
ఈ చిత్రంలో అఖిల్ పాత్రలో తనుజ్ మౌళి, కాత్యాయనిగా శివానీ నాగరం నటించారు. ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. చదువులో పూర్ స్టూడెంట్స్ అయిన అఖిల్, కాత్యాయని ప్రేమించుకోవడం, ఆ తర్వాత కాత్యాయని బెంగళూరు షిష్ట్ కావాల్సి రావడం, ఆ తర్వాత మళ్లీ ఈ ఇద్దరు కలుసుకుని, తమ ప్రేమ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకు న్నారు? అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ‘లిటిల్‌హార్ట్స్’ సినిమా కథనం సాగుతుందన్నట్లు గా తెలుస్తోంది.