ఇండియన్ సినిమా రంగ ప్రముఖలందరూ ప్రజెంట్ ‘రామాయణ (Ramayana)’ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఇటీవల విడుదలైన ‘రామాయణ’ ఫస్ట్‌ట్రైలర్ అనౌన్స్‌మెంట్ వీడియో కూడా మంచి ఇంపాక్ట్‌ని క్రియేట్ చేసింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అంతేనా..’రామాయణ’ సినిమా బడ్జెట్ రూ. 4000 కోట్లు అంటూ ఈ చిత్రం నిర్మాత నమిత్ మల్హోత్రా (Namit Malhotra’s Ramayana) షాకింగ్ న్యూస్ బయటపెట్టారు. దీంతో బాలీవుడ్ బడా నిర్మాతలందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. భారతీయ ఇతిహాసం ‘రామాయణం’ను ఈ స్థాయిలో తీయడం మంచి విషయమే. కానీ ఇప్పుడు జరుగుతున్న చర్చంతా…ఇండియన్ సినిమాకు , ఇండియాలో కానీ లేదా అంతర్జాతీయ మార్కెట్‌లో కానీ..ఇంత బిజినెస్ జరుగుతుందా? లేదా అని.
ఇప్పటివరకు ఆమిర్‌ఖాన్ ‘దంగల్’, ప్రభాస్-రాజమౌళిల ‘బాహుబలి2’ సినిమాలే ఇండియన్ హాయ్యెస్ట్ గ్రాసర్ సినిమాలు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ రెండు సినిమాల టోటల్ ప్రపంచవ్యాప్త కలెక్షన్స్‌ను కలిపినా (దాదాపు 3800 కోట్లు) కూడా ‘రామాయణ’ సినిమా బడ్జెట్‌ను మ్యాచ్ చేయలేకపోతున్నాయి. అలాంటిది నమిత్ మల్హోత్రా ‘రామాయణం’ సినిమాపై నాలుగు వందల కోట్ల రూపాయాలు పెట్టుబడి పెడుతుండటం అనేది పెద్ద సాహసమనే చెప్పాలి.బడ్జెట్ పరంగా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా ‘రామాయణ’.
బాహుబలి మొదలుపెట్టిన్నప్పుడు,ఈ సినిమా కలెక్షన్స్ రెండొందల కోట్ల రూపాయాలు దాటతాయని ఎవరూ ఊహించలేదు. కానీ నిజమైంది. ఇప్పు డు ఆ తరహాలోనే ‘రామాయణ’ సినిమా విషయంలో కూడా ఏదైనా అద్భుతం జరిగితే ఇండియన్ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న గుర్తింపు మరింత పెరుగుతుందనే చెప్పుకోవాలి. ‘రామాయణ’ సక్సెస్ మరెన్నో పెద్ద సినిమాలకు బాసటగా నిలుస్తుంది. అలాగే ఆస్కార్, కాన్స్ వంటి ఫిల్మ్ ఫెస్టివల్స్ రూల్స్‌పై కూడా ‘రామాయణ’ సినిమా మేకర్స్ ఓ ద్రుష్టి పెడితే, భారతీయ సినిమా పరిధి మరింత విస్తరిస్తుంది అనడంలో సందే హం లేదు.
ఇక రామాయణ (Ramayana) సినిమాలో రాముడిగా రణ్‌బీర్‌కపూర్ (Ranbirkapoor), సీతగా సాయిపల్లవి, లక్ష్మణుడిగా రవి దూబే, హనుమంతుడిగా సన్నీ డియోల్‌లు యాక్ట్ చేస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్స్ ఏఆర్ రెహామాన్, హాన్స్ జిమ్మర్ ఈ సినిమాకు సూపర్భ్ మ్యూజిక్ ఇస్తున్నారు. ఎనిమిది సార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న డీఈఎన్‌జీ స్టూడియోతో కలిసి ఫ్రైమ్ ఫోకస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాత, డీఈఎన్‌జీ స్టూడియో సీఈవో నమిత్ మల్హోత్రా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు యశ్ సహ-నిర్మాత. నితేష్ తివారి (Ramayana director nitesh tiwari)దర్శకుడు.
ఇక రామాయణ సినిమా రెండు పార్టులుగా విడుదల కానుంది. ‘రామాయణ’ సినిమా తొలిపార్టు 2026 దీపావళికి విడుదల కాగా, రెండో పార్టు 2027 దీపావళికి విడుదల కానుంది. ‘రామాయణ’ తొలిపార్టు సక్సెస్ అయితే, మలిపార్టుపై మరింత అంచనాలు ఏర్పడతాయి. మరి..ఏం జరుగుతుందో చూడాలి.