సాధారణంగా నాని (Nani) సినిమాలంటే…చిన్న పిల్లలకు పెద్దలకు మంచి ఎంటర్‌టైనింగ్‌గా ఉంటాయి. ఫర్ ది ఫస్ట్ టైమ్ నాని..అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్లారు. ‘హిట్ 3’ (HIT3) సినిమాలో ఫిరోషియస్ పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్ రోల్ చేశారు.
లేటెస్ట్‌గా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ఎంగేజింగ్‌గా ఉంది. కానీ.. మితిమీరిన హింస కనిపిస్తోంది. ట్రైలర్‌లోని విజువల్స్ చూస్తుంటే వెండితెర రక్తంతో తడిచిపోయేలా ఉంది. పైగా ఈ మూవీకి సెన్సార్ నుంచి ‘ఏ’ సర్టిఫికేట్ వచ్చింది. అంతేందుకు…‘హిట్ 3’ సినిమాకు చిన్న పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్ రావొద్దని నానీయే చెబుతున్నారు. అంటే ఈ మూవీలో ఎలాంటి విజువల్స్ ఉంటాయో
ఊహించుకోవచ్చు.
శైలేష్ కొలను (Sailesh Kolanu) ‘హిట్ ఫ్రాంచైజీ’ సినిమాలకు దర్శకుడు. ‘హిట్’లో విశ్వక్‌సేన్, ‘హిట్ 2’లో అడవి శేష్ హీరోలుగా నటిం చారు. ఈ రెండు సినిమాలను నిర్మించిన నానీయే ‘హిట్ 3’లో హీరోగా చేసి,ఈ సిని మాను నిర్మించారు. ఈ ‘హిట్ 3’ సినిమా మే 1న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. మరోవైపు… సూర్య హీరోగా చేసిన తమిళ చిత్రం ‘రెట్రో’ కూడా మే 1న రిలీజ్ కానుంది. కార్తీక్ సుబ్బరాజు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో పూజాహెగ్డే హీరోయిన్.