మే 20న ఎన్టీఆర్ బర్త్ డే (NTRBirthdy). ప్రజెంట్ ఎన్టీఆర్ ‘డ్రాగన్’ (Dragon)మూవీ చేస్తన్నాడు ప్రశాంత్‌నీల్ డైరెక్షన్‌లో. ఈ మూవీ అప్‌డేట్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కానీ…‘డ్రాగన్’ సినిమా అప్‌డేట్ ఏదీ లేదని, ఈ సారికి ‘వార్ 2’ (War2 update) సినిమా అప్‌డేట్‌తో సరిపెట్టుకోమని ‘డ్రాగన్’ టీమ్ చెప్పేసింది.
హృతిక్‌రోషన్ హీరోగా చేస్తున్న మూవీ ‘వార్ 2 (War2)’. అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లోని ఈ స్పై యాక్షన్ మూవీలో ఎన్టీఆర్ ఓ లీడ్ రోల్ మాత్రమే చేస్తున్నాడు. అలాంటింది..ఈ బర్త్ డేకి ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ‘వార్ 2’ అప్‌డేట్‌తో సరిపెట్టుకోమనడం కరెక్ట్ కాదు..పైగా ముందుగా ‘డ్రాగన్’ గ్లింప్స్ వదులుతామని, ఊరించి, ఆ తర్వాత ఫ్యాన్స్‌ను ఊసురుమనించారు దర్శకుడు ప్రశాంత్ నీల్.

తమ అభిమాన నటుడు హీరోగా చేస్తున్న మూవీ అప్‌డేట్ ఉంటే ఫ్యాన్స్ ఖుషీ అవుతారు కానీ..వేరే హిందీ హీరో హీరోగా చేస్తున్న సినిమా అప్‌డేట్ అంటే ఫ్యాన్స్‌కి మాత్రం ఏం కిక్ ఉంటుంది. కనీసం డ్రాగన్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసినా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్తైనా హ్యాపీ ఫీల్ అయ్యేవారు.
అలాగే రీసెంట్‌గా జరిగిన ‘మ్యాడ్ 2’ సక్సెస్‌మీట్‌లో ‘దేవర 2’ సినిమాను కన్ఫార్మ్ చేశారు ఎన్టీఆర్. మరి..‘దేవర 2’ (Devara2) అప్‌డేట్ వచ్చినా…ఫ్యాన్స్ హ్యాపీ ఫీలవుతారు.
‘డ్రాగన్’ సినిమా షూటింగ్‌లో అనుకున్నదానికంటే కాస్త లేట్‌గానే జాయిన్ అయ్యారు ఎన్టీఆర్. ఓ యాక్షన్ సీక్వెన్స్ మాత్రమే తీశారు. ఇప్పుడు ఈ సీక్వెన్స్‌ను కాస్త ఎడిట్ చేసి, రిలీజ్ చేస్తే ఏ మాత్రం తేడా వచ్చిన సోషల్ మీడియా హోరెత్తిపోతుంది. పైగా డ్రాగన్ రిలీజ్ వచ్చే ఏడాది జూన్ 25న. సో…ఎలాగూ 2026 మే 20…ఉండనే ఉంది. ఆ సమయానికి మాత్రం ‘డ్రాగన్’టీజర్ లేదా ట్రైలర్‌ను ను కన్ఫార్మ్ చేసుకోవచ్చు.