రెండు సంవత్సరాల తర్వాత పవన్‌కల్యాణ్ నుంచి వస్తున్న సినిమా ‘హరిహరవీరమల్లు’. పైగా పవన్‌కల్యాణ్ ఉపముఖ్యమంత్రి అయిన తర్వాత విడుదలైన తొలి సినిమా ఇది. పవన్ కెరీర్‌లోనే తొలి పాన్ ఇండియా సినిమా ఇది. పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే హాయ్యెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ ఇది. పవన్ కల్యాన్ కెరీర్‌లోనే సుధీర్ఘంగా నిర్మించబడిన సినిమా హరిహరవీరమల్లు. అలాంటి ఈ సినిమాపై ఆయన అభిమానుల్లో, ఇండస్ట్రీ వర్గీయుల్లో అంచనాలు ఉండటం సహజం. మరి..ఆ అంచనాలను హరిహరవీరమల్లు సినిమా అందుకుందా? రివ్యూలో చదివేయండి.
సినిమా: హరిహరవీరమల్లు స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ (HariHaraVeeraMallu Review)
ప్రధాన తారాగణం: పవన్‌కల్యాణ్, నిధీ అగర్వాల్, బాబీ డియోల్, ఆదిత్యా మీనన్, విక్రమ్ జిత్, సత్యరాజ్, కబీర్‌బేడీ, అప్పయ్య పి శర్మ, బ్రహ్మానందం, తనికెళ్లభరణి, సునీల్, సుబ్బరాజు
దర్శకత్వం: జాగర్లమూడి రాధాక్రిష్ణ, జ్యోతిక్రిష్ణ
నిర్మాణం: ఏయం. రత్నం, అద్దంకి దయాకర్ రావు
సంగీతం: ఎమ్‌ఎమ్ కీరవాణి
కెమెరా :జ్ఞానశేఖర్, మనోజ్ పరమహంస
ఎడిటింగ్: కేఎల్ ప్రవీణ్
నిడివి: 2 గంటల 43 నిమిషాలు
విడుదల తేదీ: జూలై 24,2025
రేటింగ్: 2.0/5
HariHaraVeeraMallu:కథ
అగ్రహారం యువకుడు హరిహరవీరమల్లు (పవన్‌కల్యాణ్) వజ్రాల దొంగగా మచిలీపట్నం పోర్టులో దొంగతనాలు చేస్తుంటాడు. వీరమల్లు పనితనం తెలిసి చిన్నదొర (సచిన్ ఖేడ్కర్) అతనికి ఓ దొంగతనం పని చెబుతాడు. ఈ పనిని సవ్వంగా చేయకుండ గోల్డొండ నవాబు (దిలీప్ తాహిర్) కు బంధీగా దొరుకుతాడు వీరమల్లు. అయితే గోల్కండ నవాబు కూడా వీరమల్లుకు ఓ పని అప్పజెప్తాడు. అదెం టంటే…గోల్కొండ గౌరవానికి ఓ చిహ్నంగా భావించే కోహినూర్ డైమండ్, ఢిల్లీలోని ఎర్రకోట నెమలి సింహాసనంపై ఉందని, ఈ కోహినూర్ డైమండ్‌ను తిరిగి తీసుకువస్తే, ఓ వజ్రాల గని మొత్తాన్ని వీరమల్లుకు ఇచ్చేస్తానంటాడు గోల్కొండ నవాబు (HHVMReview).
మరోవైపు ఇస్లాం మతాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయాలని ఔరంగజేబు (బాబీ డియోల్) సంకల్పించుకుంటాడు. ఈ క్రమంలో మత మార్పి డులను ప్రోత్స హిస్తూ, ఇస్లాం మతాన్ని స్వీకరించని వారిని ఇబ్బంది పెడుతుంటాడు ఔరంగజేబు, అతని సైన్యం. అడ్డుపడిన రాజులను క్రూరంగా చంపేస్తుంటాడు. మతం మారని హిందువులపై జిజియా పన్ను విధిస్తాడు. విగ్రహారాధన, పూజలు చేసేవారిని ఇబ్బందుల పాలు చేస్తుం టాడు. అలాంటి ఈ ఔరంగ జేబు నెమలి సింహాసనంపైనే కోహినూర్ డైమండ్ ఉంటుంది. మరి..గోల్కొండ నవాబు చెప్పినట్లు వీరమల్లు కోహి నూర్ వజ్రాన్ని తిరిగి తీసుకువచ్చాడా? వీరమల్లు ఢిల్లీ ఎర్రకోటకు వెళ్తుంతున్నది కోహినూర్ వజ్రం కోసమేనా? లేక తనదైన మరో లక్ష్యం ఏమైనా ఉందా? వీరమల్లు ను పంచమి (నిధీ అగర్వాల్) ఎందుకు మోసం చేసింది? అన్న ఆసక్తికరమైన విశేషాలు స్క్రీన్‌పై చూడాలి (HariHaraVeeraMallu Review)
HariHaraVeeraMallu : వివరణ
17వ శాతాబ్దానికి చెందిన కథ ఇది. ఏటువంటి వివాదాలకు తావ్వివ్వకుండ వీరమల్లు పాత్ర, కల్పిత పాత్ర అని ముందే చెప్పేశారు మేకర్స్.’హరిహరవీరమల్లు’ సినిమాలోని తొలిభాగం ‘హరిహరవీరమల్లు స్వార్డ్ వర్సెస్ స్పిరిట్‌గా విడుదలైంది (HHVMReview).
నదిలో ఓ తొట్టిలో దొరికన ఓ చిన్నారికి హరిహరవీరమల్లు అనే పేరు పెట్టే సన్నివేశంతో, సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత ఆ పిల్లాడే, హరిహరవీరమల్లుగా మారి, మచిలీపట్నం పోర్టులో దొంగతనాలు చేస్తుంటాడు. హీరో ఇంట్రడక్షన్, పులిమేక ఫైట్, చార్మినార్ ఫైట్ బాగున్నాయి. కొల్లగొట్టినాదిరో సాంగ్ కూడా ఒకే. అయితే పులిమేక ఫైట్ బాగున్నా…కథలో దీని అవసరం ఏముంది. ఇంట్రడక్షన్ ఫైట్ తర్వాత… ఎలివేషన్స్‌తో హీరోకు మళ్లీ ఫైట్ సీన్ పెడితే, మళ్లీ ఇంట్రవెల్‌లో మరో ఫైట్ అంటే…ఆడియన్స్‌కు దర్శకుడు ఏం కథ చెబుతాడు. మూడు భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు కథలో ఉంటే…డ్రామాకు స్కోప్ ఎక్కడుంటుంది. అందుకే ….ప్రీ ఇంట్రవెల్ వరకు అసలు కథ ప్రారంభం కానట్టే ఉంటుంది ఆడియన్స్‌కి. హీరో హీరోయిన్‌కి మధ్య ఉన్న కత్తిలాంటి లవ్‌స్టోరీలో పదును లేదు. తుప్పుపట్టిన లవ్‌స్టోరీ ట్రాక్ ఇది. పంచమి క్యారెక్టర్‌తో వచ్చే ట్విస్ట్ ఫర్వాలేదనిపించినా, అదీ కథకు ఏ మాత్రం ఉపయోపడేది కాదు. అలాంటప్పుడు ట్విస్ట్ ఎలాంటిదైనా ఆడియన్స్‌కి థ్రిల్ ఎక్కడ ఉంటుంది. కోహినూర్ మిషన్‌తో విరామం కార్డు పడుతుంది.

తన మిత్రగణంతో వీరమల్లు ఢిల్లీకి బయలుదేరే ప్రయాణంతో సెకండాఫ్ సాగుతుంది. ఈ క్రమంలో హీరో ఎదుర్కొనే సవాళ్లు, మార్గ మధ్యంలో వీరమల్లు చేసే సాయాలతో కథనం ముందుకు సాగుతూ….ఉంటుంది. మధ్యలో సడన్‌గా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్. అంతలోనే… వీరమల్లు గురించి ఔరంగజేబుకి కబురు. వీరమల్లు- ఔరంగజేబు కలసుకోగానే…సెకండ్ పార్టుకు లీడ్…సినిమా అయిపోతుంది. సెకండాఫ్ చూసిన ఆడియన్స్‌కు ఫస్ట్‌హాఫ్‌నే బాగుందనిపిస్తుంది. కానీ..మొత్తంగా సినిమా అయితే నచ్చదు.
సనాతన ధర్మాన్ని పాటించే హీరో తన లక్ష్యానికి దొంగతనాన్ని మార్గంగా ఎంచుకుంటాడా? హీరోయిన్ తనకు ఇష్టం లేదంటే…మనసు పారేసు కున్నాను..నాతో వచ్చేయ్…అని హుకుం జారీ చేస్తాడా…? ఔరంగజేబు లక్షల సైన్యాన్ని ఎదుర్కొవడానికి తనతో పాటు, ఓ నలు గురైదుగురు సరిపోతారని అనుకుంటాడా? ఎలా…? బాహుబలి సినిమాలో కూడా ఆ హీరోకి చిన్నపాటి సైన్యమన్న ఉంటుంది. ఇక్కడ వీరమల్లు లక్ష్యం పెద్దది. కానీ సపోర్టర్స్ లేరు. ఇది ఎలా సాధ్యమౌతుంది అసలు. హీరో ఇమేజ్‌కి తగ్గ ఎలివేషన్స్‌ను పక్కన పెట్టి, కథపై, హీరో క్యారెక్టరైజేషన్‌పై కసరత్తు చేస్తే బాగుండేది. పవన్‌కల్యాణ్ ఎంతో నమ్మిన 18 నిమిషాల క్లైమాక్స్ సీక్వెన్స్ కూడా వర్కౌట్ కాలేదు. సినిమాలో పవన్‌కల్యాణ్‌ను హైలైట్ చేసే సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. ఇవి పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్‌కు నచ్చుతాయి.
వీఎఫ్‌ఎక్స్, గ్రాఫిక్స్ వర్క్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ముఖ్యంగా గుర్రాల సీన్స్ అయితే, గ్రాఫిక్స్ పట్ల మేకర్స్ ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో తెలియజేస్తుంది. కొన్ని సన్నివేశాల్లో డూప్‌ను వాడారన్న విషయం కూడా ఈ గ్రాఫిక్స్ స్పష్టంగా చూపిస్తున్నాయి. డూప్‌ను వాడటం తప్పు కాదు. కానీ అది ఆడియన్స్‌కు అర్థమయితే, హీరోతో ఆడియన్ ఎలా ఎమోషనల్‌గా ట్రావెల్ కాగలడు? ఇలా..చెప్పుకుంటే ఇంకా చాలానే ఉన్నాయి.
ఎవరు ఎలా యాక్ట్ చేశారు?
హరిహరవీరమల్లు క్యారెక్టర్‌లో పవన్‌కల్యాణ్ (pawankalyan) బాగానే కనిపించాడు. యాక్షన్ సీక్వెన్స్‌లో స్టైల్, తనదైన స్వాగ్ ఉంది. కానీ హీరో క్యారెక్టరైజేషన్ లోని షేడ్స్‌కు స్క్రిప్ట్‌లో బలం లేదు. పంచమి పాత్రలో నిధీ అగర్వాల్ కనిపించారు. ఇది అంత బలమైన పాత్ర ఏం కాదు. ఇంట్రవెల్ త ర్వాత, ప్రీ క్లైమాక్స్‌కు ముందు ఈ పాత్ర సడన్‌గా మాయమైపోతుంది. హీరోయిన్‌ని ఐటెం అమ్మాయిగా డ్యాన్స్ చేయించడం ఏంటో అర్థం కాదు.

ఔరంజేబు పాత్రలో బాబీ డియోల్ ఫర్వాలేదనిపించాడు. హీరో కు సహాయకులుగా…నాజర్ (వీసన్న), సునీల్ (సుబ్బన్న), సుబ్బరాజు (అబ్బన్న), మునిమాణిక్యం (రాఘుబాబు), కబీర్‌సింగ్‌దుహాన్, అయ్యప్ప పి. శర్మ (అబ్దుల్లా) కనిపించారు. వీరందరి పాత్రలు ఒక్కో సన్నివేశంలో ఒక్కో విధంగా హీరోకు ఎలివేషన్స్ ఇవ్వడంతోనే సరిపోయాయి. వీరి వల్ల కథకు కొత్తగా ఓరిగింది ఏమీ లేదు. అలా గని కామెడీ ట్రాక్ కూడా లేదు. ఇక మచిలి పట్నంలోని చిన్నదొరగా సచిన్ ఖేడ్కర్, పెద్ద దొరగా కోట శ్రీనివాసరావులు నటించారు. గురువుగా సత్యరాజ్ కనిపిస్తారు. విక్రమ్ జిత్, మురళీ శర్మ, కబీర్ బేడీ…వంటి వారు వారి వారి పాత్రల మేరకు నటించారు.
క్రిష్, జ్యోతిక్రిష్ణలు ఈ సినిమాకు దర్శకులు. క్రిష్ మార్క్ సన్నివేశాలు కొన్ని కనిపించాయి. ఇక ఈ సినిమాకు మరో ప్రాణవాయువు కీరవాణి మ్యూజిక్. ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ బాగుంది. మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్‌ల విజువల్స్ ఒకే. నిర్మాణ విలువలు యావరేజ్‌గా ఉన్నాయి. వీఎఫ్‌ఎక్స్ అయితే దారుణంగా ఉన్నాయి. ఎడిటింగ్ బాగా చేయవచ్చు. రిలీజ్ తర్వాత చిత్రంయూనిట్‌యే 20 నిమిషాలను ట్రిమ్ చేయడం ఇందుకు ఓ ఉదాహరణ
ఫైనల్‌గా…ఆడియన్స్ గుండెల్లో వీరముల్లు