”2025లో మా నుంచి ‘సక్రాంతికి వస్తున్నాం’ లాంటి హిట్ మూవీ, ‘గేమ్‌చేంజర్’ రూపంలో ఓ ఫ్లాప్ మూవీ వచ్చాయి. ఇప్పుడు నితిన్ చేసిన తమ్ముడు సినిమా రిజల్ట్ కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాం. ఓ డిఫరెంట్ యాక్షన్ చిత్రం ఇది. ఇక 2025 నుంచి మేం గేర్ చేంజ్ చేశాం (Dil Raju Next Movies)” అని ‘దిల్ రాజు (Producer DilRaju) చెబుతున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్ సంస్థలతో వచ్చే రెండు సంవత్సరాల్లో పది సినిమాలను థియేటర్స్‌లోకి తీసు కువచ్చేలా ‘దిల్’ రాజు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ విషయాలపై తాజాగా ఆయన మాట్లాడారు. నితిన్ చేసిన తమ్ముడు సినిమా జూలై 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో ‘దిల్’ రాజు మాట్లాడి, తమ బ్యానర్‌లోని తర్వాతి చిత్రాలను గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (Srivenkateswaracreations), దిల్ రాజు ప్రొడక్షన్స్ (DilRaju Productions) సంస్థల్లో ఈ ఏడాది ఇప్పటికే మూడు ప్రాజెక్ట్‌లు ఫైనలైజ్ అయ్యాయి. ఎల్లమ్మ (Yellamma) (నితిన్ హీరో- దర్శకుడు ‘బలగం’ ఫేమ్ వేణు ఎల్దండి ), రౌడీ జనార్థన (విజయ్ దేవరకొండ హీరో- రవి కిరణ్ కోలా దర్శకుడు), దేత్తడి (ఆశిష్ హీరో) సినిమాలు ఉన్నాయి. మరో ప్రాజెక్ట్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అతి త్వరలోనే ఫైనలైజ్ యచేసి, వివరాలు వెల్లడిస్తాం. అలాగే మా బ్యానర్‌లో హోల్డ్‌లో ఉన్న ఆశిష్ ‘సెల్ఫీష్’ సినిమాపై ఈ వారంలో ఓ క్లారిటీ వస్తుంది. ఇక…ఎల్లమ్మ, రౌడీ జనార్థన, దేత్తడి, మరో సినిమా…ఇవి ఈ ఏడాది చిత్రీకరణ స్టార్ట్ చేస్తాం. 2026లో విడుదల చేస్తాం.
2026లో మేం ప్రారంభించాలనుకుంటున్న సినిమాలు ఐదారు ఉన్నాయి. త్వరలోనే నరేషన్ స్టార్ట్ చేస్తాం. ఈ సినిమాల్లో అనిల్‌రావిపూడితో ఒకటి, మార్కో డైరెక్టర్ హనీష్‌తో సినిమాలు ఉన్నాయి. ఇద్దరు కొత్త దర్శకులతో సినిమా ఉంటుంది. ఇంకా ‘దిల్’ రాజు డ్రీమ్ ద్వారా ఆగస్టులో నాలుగైదు సినిమాలు ఫైనలైజ్ అవుతాయి. ‘జఠాయు’ సినిమా ఉంది. ఇందులో ఎనిమిది భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. కొంత వర్క్ చేయాల్సి ఉంది. 2026లో మేం ప్రారంభించే సినిమాలు 2027లో విడుదల అవుతాయి. ఇక ఎల్లమ్మ సినిమా..గ్రామదేవత నేపథ్యంలో ఉంటుంది. డివైన్ టచ్ ఉంటుందీ కానీ, డివోషనల్ ఫిల్మ్ కాదు” అని చెప్పారు. ఇంకా తమ బ్యానర్‌లో ప్రశాంత్‌నీల్ తో ఓ సినిమా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తా రనే ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ పేరు తెరపైకి వస్తుంది. ‘పుష్ప2’ తర్వాత దిల్ రాజుతో అల్లు అర్జున్ ఓ సినిమా చేసేందుకు చర్చలు జరిగాయి. దీంతో అల్లు అర్జున్ చేయబోయేది ప్రశాంత్‌నీల్ డైరెక్షన్‌లోని సినిమాయే అన్నది ఫిల్మ్‌నగర్ వాసుల టాక్.
Read more:
రామ్‌చరణ్ గేమ్‌చేంజర్ మూవీ రాంగ్ స్టెప్..నా ఫెయిల్యూర్
రామ్‌చరణ్ ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పిన నిర్మాత శిరీష్‌రెడ్డి