నైజాం రీజియన్‌లో నిన్నమొన్నటివరకు ‘దిల్’ రాజు (Producer DilRaju) ఆదిపత్యం సాగింది. కానీ మైత్రీమూవీమేకర్స్ (Mythrimovemakers) సొంత డిస్ట్రిబ్యూషన్ సంస్థను ఏర్పాటు చేయడం, నైజాంలో యాక్టివ్ అవ్వడం వంటి అంశాలకు ‘దిల్’ రాజుకు కొంత ఇబ్బందిని కలిగించాయి.
Ramcharan Gamechanger: బ్రేక్ ఈవెన్‌కి గేమ్‌చేంజర్ ఎంత కలెక్ట్ చేయాలి?
ఈ సంక్రాంతి నిర్మాతగా ‘దిల్’ రాజుకు చాలా కీలకం. దాదాపు 450 కోట్ల రూపాయాల బడ్జెట్‌తో ఆయన నిర్మించిన రామ్‌చరణ్ గేమ్‌చేంజర్, మరో పెద్ద సినిమా వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలు ఈ సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అవుతున్నాయి. అలాగే ఈ ఏడాది మరో సంక్రాంతి మూవీ ‘డాకు మహా రాజ్’ బిజినెస్‌లోనూ ‘దిల్’ రాజు యాక్టివ్‌గా ఉన్నారు.
అయితే మైత్రీమూవీమేకర్స్ నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్‌లు నిర్మించిన బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘పుష్పది రూల్’ మూవీ కొత్త వెర్షన్‌ను ఈ సంక్రాంతి సందర్భంగానే, జనవరి 11న రిలీజ్ చేస్తున్నారు. ఇది కచ్చితంగా మిగతా సినిమాలపై ప్రభావం చూపు తుంది. ముఖ్యంగా హిందీ బెల్ట్‌లో సంక్రాంతి సినిమాలకు ఇబ్బంది కలుగుతుంది. సుకుమార్ బర్త్ డే సందర్భంగా ‘పుష్ప ది రూల్’ న్యూ వెర్షన్‌ను రిలీజ్ చేస్తున్నట్లుగా మైత్రీమూవీమేకర్స్ వాళ్లు చెప్పుకుం టున్నప్పటికీని, పరోక్షంగా ‘దిల్’ రాజును టార్గెట్ చేసినట్లేనని, ఫిల్మ్‌నగర్ వాసులు చెప్పుకుంటున్నారు.
Akkineni Naga Chaitanya: రెండు హారర్ మూవీలకు సైన్ చేసిన నాగచైతన్య
గత ఏడాది 2024 సంక్రాంతికి మైత్రీమూవీమేకర్స్ వర్సెస్ దిల్ రాజు అన్నట్లు సాగిన పరిణామాలు గుర్తుండే ఉంటాయి. సర్కారువారిపాట, సైంధవ్, నాసామిరంగ సినిమాలతో డిస్ట్రిబ్యూషన్‌లో ‘దిల్’ రాజు ఇన్‌వాల్వ్ అవ్వగా, ఒక్క హను–మాన్ మూవీతో మైత్రీమూవీమేకర్స్ అసోసియేట్ అయ్యింది. థియేటర్స్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో హను–మాన్‌ను తక్కువ చేశారనే వార్తలు అప్పుడు వినిపించాయి. అయితే 2024 సంక్రాంతి విన్నర్‌గా మాత్రం హను–మాన్ నిలిచింది.