‘‘తెలుగులో తెలుగు వచ్చిన అమ్మాయిలకంటే…తెలుగు రాని అమ్మాయిలనే మేం ఎక్కువగా ప్రోత్సహిస్తుం టాం. తెలుగు వచ్చిన అమ్మాయిలను ప్రోత్సహిస్తే ఏంటో నాకు తెలిసొచ్చింది. ఇక నేను తెలుగు రాని అమ్మాయిలను ఎంకరేజ్ చేయాలని నేను, దర్శకుడు సాయిరాజేష్ నిర్ణయించు కున్నాం’’ అంటూ నిర్మాత ఎస్‌కేఎన్ (Producer SKN) మాట్లాడటం ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది.
లవ్‌టుడే ఫేమ్ ప్రదీప్‌రంగనాథన్ హీరోగా అనుపమాపరమేశ్వర్, కయాదు లోహర్‌లు హీరోయిన్లుగా యాక్ట్ చేసిన తమిళ మూవీ ‘డ్రాగన్’. ఈ సిని మాను తెలుగులో ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ పేరుతో ఈ నెల 21న మైత్రీమూవీ మేకర్స్ రిలీజ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనే, నిర్మాత ఎస్‌కేఎన్ పై విధంగా వ్యాఖ్యలు చేశారు.
అయితే తెలుగు హీరోయిన్ వైష్ణవీచైతన్యను ఉద్దేశించే, నిర్మాత ఎస్‌కేఎన్ పై విధంగా మాట్లాడరన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఆనంద్ దేవర కొండ, వైష్ణవీ చైతన్య, విరాజ్ అశ్విన్‌లు ప్రధానతారాగణంగా ‘బేబీ’ అనే మూవీ, సాయిరాజేష్ డైరెక్షన్‌లో వచ్చి, సూపర్‌హిట్‌గా నిలిచింది. ఆ సమయంలో వైష్ణవీ చైతన్యతో మూడు సినిమాల అగ్రిమెంట్ చేసుకున్నారట ఎస్‌కేఎన్–సాయిరాజేష్‌లు. కానీ వేరే అవకాశాలతో వైష్ణవీకి చేయడానికి వీలుపడలేదట. దీంతో అప్పట్నుంచి వీలైనప్పుడల్లా..ఎస్‌కేఎన్ ఇలా మాట్లాడతున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది.
అయితే నిర్మాత ఎస్‌కేఎన్ వ్యాఖ్యలు సరైనవి కావనే టాక్ తెరపైకి వచ్చింది. ఆయన సినిమాల్లో ఎవర్ని హీరోయిన్‌గా తీసుకోవాలన్నది ఆయన ఇష్టం. కానీ తెలుగు అమ్మాయిలను ప్రోత్సహించకూడదన్న పరోక్ష భావాన్ని వ్యక్తపరచేలా ఎస్‌కేఎన్ వ్యాఖ్యలు ఉండటాన్ని కొందరు నెటిజన్లు తప్పుపడుతున్నారు. అలాగే ఏదో ఒక్క ఇన్సిడెంట్‌ని తెలుగు అమ్మాయిల మొత్తానికి ఆపాదించడం కూడా కరెక్ట్ కాదని మరికొంతమంది వాదన. మన హీరోయిన్స్‌నే మనం తక్కువ చేసి, మాట్లాడటం కరెక్ట్ కాదన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి…ఈ విషయం ఎక్కడికి వెళ్లి ఆగుతుండో చూడాలి.