హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లోని ‘పుష్ప’ (Pushpa)ఫ్రాంచైజీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ ‘పుష్ప’ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన ‘పుష్ప:ది రైజ్’, ‘పుష్ప: ది రూల్’ చిత్రాలు అద్భుత విజయాలు సాధిం చాయి. దీంతో ‘పుష్ప 3’ (Pushpa3) పై కూడా అంచనాలు ఉన్నాయి. ఆల్రెడీ ‘పుష్ప 3’ సినిమాను కన్ఫార్మ్ చేశారు అల్లు అర్జున్ అండ్ సుకుమార్. మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్‌లు ఈ మూవీని నిర్మిం చారు. రష్మికా మందన్నా హీరోయిన్‌గా యాక్ట్ చేశారు.
2028లో పుష్ప 3
‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్ వెంటనే సుకుమార్(Sukumar)తో పుష్ప 3 చేయమని అడిగారట. కానీ…సుకుమార్ ఆల్రెడీ మైత్రీమూవీమేకర్స్ పతాకంపైనే రామ్‌చరణ్‌తో ఓ మూవీ కమిటైయ్యాడు. దీంతో కొంత గ్యాప్ తర్వాత ‘పుష్ప 3’ చేస్తే బాగుంటుందని అన్నారట సుకుమార్. రామ్‌చరణ్‌తో సుకుమార్ చేయాల్సిన మూవీ చిత్రీకరణ ఈ ఏడాదే ప్రారంభం అవుతుంది. ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత సుకుమార్ ‘పుష్ప 3’ కథపై కూర్చొవచ్చు. రామ్‌చరణ్‌తో సుకుమార్ మూవీ కంప్లీట్ అయ్యేలోపు, తమిళ దర్శకుడు అట్లీతో ఒక సినిమా, త్రివిక్రమ్‌తో మరో సినిమా చేయాలన్నది అల్లు అర్జున్ ప్లాన్ అట. ఇదిలా ఉంటే…..‘పుష్ప 3’ సినిమాను 2028లో రిలీజ్ చేస్తామని మైత్రీమూవీమేకర్స్ నిర్మాత రవి వెల్లడించారు. మరి…అనుకున్నట్లుగా ‘పుష్ప 3’ (Pushpa3) సినిమా 2028లోనే వస్తుందా? అనేది చూడాలి.