రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గేమ్‌ఛేంజర్’ (Ramcharan GameChanger Movie Review) ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ తర్వాత రామ్‌చరణ్ సోలో హీరోగా నటించి, విడుదలైన ‘గేమ్‌చేంజర్’ మూవీ ఆడియన్స్ మెప్పించిందా? ‘ఇండియన్ 2’తో ఫ్లాప్‌ని చవిచూసిన దర్శకుడు శంకర్ … ‘గేమ్‌ఛేంజర్’ (GameChanger) మూవీతో కమ్‌బ్యాక్ అయ్యాడా? రివ్యూలో చదివేద్దాం.
కథ
విశాఖపట్నం కలెక్టర్‌గా రామ్‌నందన్ (Ramcharan )చార్జ్ తీసుకుని, వచ్చీ రాగానే రాజకీయ నాయకుల అక్రమాలను– రౌడీషీటర్ల ఆగడాలను అపేయాలని ప్రయత్నిస్తుంటాడు. మరోవైపు ఆరు నెలల్లో ఎన్నికలు వస్తున్న తరు ణంలో అభ్యదయం పార్టీ సీయం బొబ్బిలి సత్యమూర్తి (శ్రీకాంత్) ఓ కొత్త నిర్ణయం తీసుకుంటాడు. పార్టీలోని నాయకులు ఎవరు అక్రమార్కలకు పాల్పడకూడదని చెబుతాడు. కానీ తన తండ్రి సత్యమూర్తి చెప్పిన మాటలు మినిస్టర్ మోపిదేవి (ఎస్‌జే సూర్య)కి నచ్చవు. పైగా ఎలాగైనా తానే సీయం కావాలని కలలు కంటుంటాడు. మరి..మోపిదేవి లక్ష్యం నెరవేరిందా? మోపిదేవి లక్ష్యానికి రామ్‌నందన్ ఎలా అడ్డుపడ్డాడు? అసలు అభ్యుదయం పార్టీ స్థాపకుడు అప్పన్న (రామ్‌చరణ్) సీయం కాకుండ, బొబ్బిలి సత్యమూర్తి ఎలా సీయం అయ్యాడు? తండ్రి అప్పన్న గురించి నిజం తెలుసుకున్న రామ్‌నందన్, అతని తల్లి పార్వతీదేవి (అంజలి) ఏం చేశారు? అన్నది మిగిలిన కథనం (GameChanger Movie Review)
Sanjay Leela Bhansali Meets AlluArjun: బన్నీతో భన్సాలీ…రెండో మీటింగ్ కూడా ఓవర్
విశ్లేషణ
సీయం కావాలని తాపత్రయ పడే బొబ్బిలి మోపిదేవి అనే యువ రాజకీయ నాయకుడికి, నిజాయితీగా పని చేయాలనుకునే ఓ ఐఎఎస్ ఆఫీసర్ రామ్‌నందన్‌కు మధ్య సాగే ఫేస్ టు ఫేస్ డ్రామాయే ‘గేమ్‌చేంజర్’ (GameChanger Movie Review) మూవీ. సినిమాలోని మెజారిటీ సీన్స్ అన్నీ చరణ్ వర్సెస్ ఎస్‌జే సూర్య (SJ Suriya) అన్నట్లుగానే సాగుతాయి. ఫస్టాఫ్‌లో వచ్చే డ్రామా, ఇంట్రవెల్ బ్యాంగ్ ఆడియన్స్‌ను అలరిస్తుంది. ముఖ్యంగా ఇంట్రెవల్ తర్వాత వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అదరిపోతాయి. ‘గేమ్‌చేంజర్’ (Ramcharan GameChanger Movie Review) సినిమాకు ఈ ఎపిసోడే అత్యంత కీలకం. ఈ ఫ్లాష్‌బ్యాక్‌లో అప్పన్నగా రామ్‌చరణ్ యాక్టింగ్ సూపర్ అనే చెప్పాలి. ఈ ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ తర్వాత చరణ్‌కు, ఎస్‌జే సూర్యలకు వచ్చే సీన్స్‌తో కథ ముగుస్తుంది. క్లైమాక్స్ రోటీన్‌గానే ఉంటుంది. కానీ సినిమాలో చాలా మైనస్‌లు ఉన్నాయి.
అప్పన్నను చంపిన సత్యమూర్తి, అతని భార్య పార్వతీదేవి, కొడుకును ఎందుకు వదిలేస్తాడో కారణం కనిపించదు. ఓ మారుమూల గ్రామంలో మొదలైన, అభ్యుదయ పార్టీ తొలి ఎలక్షన్స్‌లోనే ఎలా విజయం సాధిస్తుందన్న విషయంపై క్లారిటీ ఉండదు. పైగా అభ్యుదయం పార్టీకి ఉన్న వ్యతిరేక పార్టీ ఏమిటి? అభ్యుదయం పార్టీని ఆపేందుకు, అప్పటి ప్రతిపక్ష పార్టీ ఏదీ లేదా? అనే డౌట్స్ వస్తుంది. దీనికి తోడు ఓ మారుమూల చిన్న గ్రామంలో మొదలైన పార్టీకి, తక్కువ సమయంలోనే రాష్ట్రమంతా అభ్యర్థులు ఎలా దొరుకుతారు? ఇలా ఎన్నో చిక్కుముడుల ప్రశ్నలకు క్లారిటీ ఉండదు. మరీ ముఖ్యంగా భర్త చావును కళ్లారా చూసిన పార్వతీ దేవి, ఈ విషయాన్ని ఎవరికీ ఎందుకు చెప్పదు? అభ్యదయం పార్టీ వాళ్లు అప్పన్నకు ఏమైంది? అని ఎందుకు తెలుసుకోరు? ఇలా…బోలెడు ప్రశ్నలు ఉన్నాయి. కాలేజీ లవ్‌ట్రాక్, సునీల్ కామెడీ ట్రాక్, జయరాం వ్యంగ్యమైన కామెడీ ఆడియన్స్‌ను ఏమంత ఎగై్జట్ చేయదు. సాంగ్స్ స్క్రీన్‌పై రీచ్‌గా కనిపిస్తాయి. శ్రోతల నోట్లో వినిపించేలామాత్రం లేవు. కానీ ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే అరుగు పాట ఎమోషనల్‌గా, విజువల్ పరంగా బాగుంది (GameChanger Review)
AkhilAkkineni: అఖిల్ చేయాల్సిన వందకోట్ల సినిమా క్యాన్సిల్?
నటీనటులు-సాంకేతిక నిపుణుల పెర్ఫార్మెన్స్

ఐఏఎస్ ఆఫీసర్ రామ్‌నందన్‌గా, అప్పన్నగా రామ్‌చరణ్ నటన నెక్ట్స్ లెవల్లో ఉంది. అప్పన్న పాత్రకు స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నా ఈ రోల్‌లో రామ్‌చరణ్ నటన మాత్రం ఆడియన్స్‌ను కట్టిపడేస్తుంది. ‘రంగస్థలం’ లోని రామ్‌చరణ్‌కు గుర్తుకు తెస్తుంది. విశాఖపట్నం కలెక్టర్ రామ్‌నందన్ గానూ రామ్‌చరణ్ అలరించారు. కలెక్టర్ ఆఫీస్‌లో వచ్చే సీన్, సెకండాఫ్‌లో ఎస్‌జే సూర్యతో వచ్చే సీన్స్‌లో రామ్‌చరణ్ నటన మెచ్చుకునేలా, ఫ్యాన్స్‌కు హై ఇచ్చేలా ఉంటుంది. సినిమా మొత్తాన్ని రామ్‌చరణ్ భుజస్కంధాలపై నడుపుతున్నట్లుగా ఉంటుంది.
చరణ్ తర్వాత అంతటి పాత్రలో చేసింది ఎస్‌జే సూర్య. చరణ్‌తో పోటీపడి ఎస్‌జే సూర్య నటించాడు. బొబ్బిలి మోపిదేవి పాత్రలో ఎస్‌జే సూర్య బాగా చేశాడు. ఇక సీయం బొబ్బిలి సత్యమూర్తి పాత్రలో శ్రీకాంత్ నటన అలరిస్తుంది. కథను మలుపు తిప్పే పాత్ర కూడా. కాస్త నెగటివ్ షేడ్స్ కూడా ఉంటాయి. పార్వతీదేవిగా అంజలి నటన అద్భుతం. మరీ ముఖ్యంగా కాంటెంపరరీ సీన్స్‌లో అంజలి గెటప్స్ కూడా బాగుంటుంది. ఎమోషనల్ సీన్స్‌లో అలరిస్తుంది. ఒకట్రెండు హై ఇచ్చే సీన్స్ కూడా ఉన్నాయి. హీరోయిన్ దీపిక రోల్‌లో కియారా అద్వానీది రోటీన్ రోల్. లవ్ ట్రాక్, సాంగ్స్ కోసమే ఈ రోల్ పెట్టిన ట్లుగా ఉంటుంది. ముకుంద్‌గా రాజీవ్ కనకాల, మాణిక్యంగా జయరాం, కలెక్టర్ బంట్రోతుగా సునీల్, మోపిదేవి దగ్గర పనిచేసే రౌడీషీటర్‌గా నవీన్ చంద్ర వారి వారి పాత్రల మేరకు యాక్ట్ చేశారు.
Ramcharan Gamechanger: బ్రేక్ ఈవెన్‌కి గేమ్‌చేంజర్ ఎంత కలెక్ట్ చేయాలి?
తిరు విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. నిర్మాణ విలువలు, నిర్మాత ‘దిల్’ రాజు (Dil Raju) ఖర్చు స్క్రీన్‌పై కనప డుతుంది. కానీ శంకర్ మార్క్ మూవీ అయితే మాత్రం ‘గేమ్‌ఛేంజర్’ కాదు. కార్తీక్ సుబ్బరాజు కథలో లోపాలు ఉన్నాయా? లేక శంకర్ టేకింగ్ కుదర్లేదా? అన్నది వారికే తెలియాలి. తమన్ మ్యూజిక్ బాగుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. అక్కడక్కడ ఓవర్ సౌండ్ వినిపిస్తుంది. ఎడిటింగ్‌కు స్కోప్ ఉంది. లవ్‌ట్రాక్, సెకండాఫ్‌లో కొంత ఎడిట్ చేసుకోవచ్చు.
చివరిగా…: రామ్‌చరణ్ ఫ్యాన్స్‌ను ‘గేమ్‌చేంజర్’ సినిమా అలరిస్తుంది. అప్పన్న పాత్ర కోసమైనా ఆడియన్స్ ఈ మూవీని ఓ సారి చూడొచ్చు. దర్శ కుడు మార్క్ మూవీ అయితే కాదు. శంకర్ సినిమాల్లో వినిపించే సామాజిక సందేశం ఈ సినిమాలోనూ ఉంటుంది.
Ramcharan Gamechanger Release: గేమ్‌చేంజర్ కాస్ట్‌లీ మిస్టేక్!