రికార్డుల్లో విరోష్‌ వెడ్డింగ్‌

Viswa

Web Stories

Rashmika’s Insta pic : ‘విరోష్‌’ (విజయ్‌దేవరకొండ, రష్మికా మందన్నా) వెడ్డింగ్‌ రికార్డులకెక్కింది. హీరో విజయ్‌ దేవరకొండ, హీరోయిన్‌ రష్మికా మందన్నాల పెళ్లి ఈ నెల 26న ఉదయపూర్‌లోని ప్యాలెస్‌లో ఘనంగా జరిగింది. ఉదయం హిందు సంప్రదాయంలో, సాయంత్రం కొడవ సంప్రదాయంలో వీరి వివాహం జరిగింది. అభిమానులు తమను పిలుచుకుంటున్నట్లుగానే ‘విరోష్‌’ అనే పేరుతో తమ వెడ్డింగ్‌ను నిర్వహించుకున్నారీ లవ్‌బర్డ్స్‌. తమ పెళ్లి వేడుక ఫోటోలను విజయ్‌దేవరకొండ, రష్మికా మందన్నాలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా, అవి వైరల్‌ అయ్యాయి.

VijayDevarakonda And Rashmika Marriage2

అయితే హీరోయిన్‌ రష్మికమందన్నా షేర్‌ చేసిన ఓ పెళ్లి ఫోటో రికార్డుల కెక్కింది. ఫోటో షేరింగ్‌ సోషల్‌మీడియా యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక లైక్స్‌ సాధించిన ఫోటోగా, రష్మికమందన్నా పెళ్లి ఫోటో నిలిచింది. గతంలో ఈ రికార్డు ప్రముఖ భారత క్రికెటర్‌ విరాట్‌కోహ్లి పేరిట ఉండేది. ఇప్పుడు ఈ రికార్డు తుడుచుపెట్టుకుపోయింది.

దీంతో రష్మికా మందన్నా నేషనల్‌ క్రష్‌ అనడానికి ఇదొక నిదర్శనమని ఆమె అభిమానుల హ్యాపీ ఫీలవుతున్నారు. ఇక ‘విరోష్‌’ రిసెప్షన్‌ వేడుక మార్చి 4న బుధవారం హైదరాబాద్‌లో ఘనంగా జరగనుంది. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi