Madharaasi OTT: శివకార్తికేయన్ హీరోగా నటించిన లేటెస్ట్ తమిళ మూవీ ‘మదరాసి’ (Madharaasi ) సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటించి, ఏఆర్ మరుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబరు 5న థియేటర్స్‌లో రిలీజైంది. బీజు మీనన్, విద్యుత్ జమ్మ్వాల్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా ఈ మదరాసి సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను ప్రక టించారు మేకర్స్. అమెజాన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో మదరాసి సినిమా అక్టోబరు 1 నుంచి స్ట్రీమింగ్ (Madharaasi OTT Streaming Date) కానుంది. మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
తమిళనాడులోకి వస్తున్న ఇల్లీగల్ వెపప్స్‌ను రఘురావ్ అనే ఓ లవ్‌ఫెయిల్యూర్ వ్యక్తి, ఓ పోలీస్ ఆఫీసర్ సాయంతో ఎలా అడ్డుకున్నాడు? అన్నదే ‘మదరాసి’ సినిమా కథనం. ఈ చిత్రంలో రఘు రామ్ పాత్రలో శివకార్తీకేయన్, మాలతి పాత్రలో రుక్మిణీ వసంత్ నటించారు.