హీరోయిన్ శ్రీలీల బాలీవుడ్ కల నెరవేరింది. కొన్నాళ్ళుగా బాలీవుడ్‌లో సినిమా చేయాలని శ్రీలీల తెగ ప్రయ త్నాలు చేసింది. వరుణ్‌ధావన్ మూవీలో శ్రీలీలకు చాన్స్ వచ్చిన్నట్లే వచ్చి, చేజారిపోయింది. కానీ నిరాశ పరకుండ, తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది శ్రీలీల. ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న బాలీవుడ్ నిర్మాత దినేష్ విజన్ నిర్మాణంలో ఓ మూవీ కోసం చర్చలు జరిపింది. ఈ చిత్రంలో సైఫ్‌అలీఖాన్ కొడుకు ఇబ్రహీం ఆలీఖాన్ హీరో. ఏమైందో కానీ..ఈ మూవీ అనౌన్స్‌మెంట్ కూడా పెండింగ్‌లో పడిపోయింది.
కానీ కార్తీక్ ఆర్యన్ మూవీలో శ్రీలీల కన్ఫార్మ్ అన్నట్లు అప్పుడప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఫైనల్‌గా ఆ వార్తలే నిజమైయ్యాయి. కార్తీక్ ఆర్యన్ హీరోగా అనురాగ్‌బసు డైరెక్షన్‌లో రానున్న ఓ మ్యూజికల్ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా కన్ఫార్మ్ అయిపోయారు. అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. భూషణ్‌కుమార్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ దీపావళికి ఈ సినిమా రిలీజ్ కానుంది. హిందీలోని వన్నాఫ్ ది హిట్ ఫ్రాంచైజీస్‌లో ఒకటైన ‘ఆషికీ’ నుంచి, రానున్న ‘ఆషికీ 3’ ఈ మూవీయే అన్న టాక్ బాలీవుడ్‌లో మొద లైంది. కానీ టైటిల్ విషయంలో వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఈ విషయంపై ఓ స్పష్టత రావడానికి కొంత సమయం పడుతుంది.
మరోవైపు ఈ ఏడాదే శ్రీలీల కోలీవుడ్ ఎంట్రీ కూడా ఖరారైపోవడం విశేషం. శివకార్తీకేయన్ హీరోగా సుధా కొంగర తీస్తున్న పీరియాడికల్ కాలేజ్ క్యాంపస్ అండ్ పొలిటికల్ డ్రామా పరాశక్తి మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా చేస్తున్నారు. తమిళంలో శ్రీలీలకు ఇదే తొలి మూవీ కావడం విశేషం. నిజానికి సూర్య –బాలా కాంబి నేషన్‌లోని మూవీతో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ జరగి ఉండాల్సింది. కానీ ఆ మూవీ క్యాన్సిల్ కావడంతో శ్రీలీల ఎంట్రీ కాస్త ఆలస్యంగా జరుగుతోంది. ఇక తెలుగులో ఎప్పటిలాగానే మూడ్నాలుగు సినిమాలతో శ్రీలీల ఫుల్ బిజీగా ఉంది. పనిలో పనిగా ‘మంగళవారం 2’లోనూ శ్రీలీల హీరోయిన్ నటించే ఆలోచన చేస్తున్నారట. అయితే ఈ విషయంపై ఇంకా సరైన స్పష్టత రాలేదు.