కథ
Sundeep Kishan Mazaka movie Review: వెంకటరమణ (రావు రమేష్) వీసా ఆఫీసులో పనిచేసే ఉద్యోగి. అతని కొడుకు కృష్ణ (సందీప్‌కిషన్). కృష్ణ పుట్టగానే వెంకటరమణ భార్య మరణస్తుంది. దీంతో వెంకటరమణ, కృష్ణ ఒకే ఇంట్లో బ్యాచ్‌లర్ తరహా లైఫ్‌ని లీడ్ చేస్తుంటారు. ఆడతోడు లేని మగవాళ్ళు. దీంతో కృష్ణకు పెళ్లి చేసి, ఓ అమ్మాయిని కోడలిగా తెచ్చుకోవాలని వెంకటరమణ ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ కుదరవు. దీంతో తానే ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుని, కృష్ణకు అమ్మను తీసుకువస్తే, అప్పుడు కృష్ణకు ఇంకా సులభంగా పెళ్లి అవుతుందని ఆలోచిస్తాడు వెంకటరమణ. వీసా పేపర్ల కోసం తన దగ్గరకు వచ్చిన యశోద (మన్మథుడు ఫేమ్ అన్షు)ను ఇష్టపడతాడు వెంకటరమణ. ఈ లోపు మీరా (రీతూ వర్మ)తో ప్రేమలో పడతాడు కృష్ణ. యశోదను పెళ్లి చేసుకుని వెంకట రమణ, మీరాను పెళ్లిచేసుకుని కృష్ణ…తమ ఇంట్లోకి ఇద్దరు ఆడవాళ్ళను తెచ్చుకోవాలనుకుంటారు. కానీ యశోద, మీరాలు అత్తామేనకోడళ్ళు ఆ తర్వాత వీరికి (వెంకటరమణ–కృష్ణ)లకు తెలుస్తుంది. పైగా వీరిద్దరికి ఒకరంటే ఒకరు అస్సలు పడదు. మరి…వెంకటరమణ–కృష్ణలు కలిసి యశోద–మీరాలను ఎలా ఒప్పించారు? యశోద–మీరాలు ఒకే ఇంట్లో ఉంటున్న ఒకరినొకరు పరస్పరం ద్వేషించుకోవడానికి కారణాలు ఏమిటి? వెంకటరమణ–కృష్ణల ప్రేమలను చెడగొట్టేందుకు మీరా తండ్రి భార్గవవర్మ (మురళీ శర్మ) వేసిన ప్లాన్స్ ఏమిటి? ఫైనల్‌గా… వెంకట రమణ–కృష్ణల లవ్‌స్టోరీలు ఏమైయ్యాయి? అనేది సినిమాలో చూడాలి (Sundeep Kishan Mazaka movie Review)
విశ్లేషణ
దర్శకుడు నక్కిన త్రినాథరావు డైరెక్షన్–రచయిత ప్రసన్నకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘నేను..లోకల్, సినిమా చూపిస్త మావ, హలోగురు ప్రేమకోసమే..ధమాకా’ వంటి సినిమాలను గమనిస్తే…హీరో క్యారెక్టరై జేషన్‌కూ, హీరో మామ (అంటే హీరోయిన్ తండ్రి) క్యారెక్టర్‌కు సెపరేట్ ట్రాక్ ఉంటుంది. ఈ ట్రాక్‌నే మళ్లీ ‘మాజాకా’ సినిమాలోనూ వాడారు త్రినాథరావు. కాకపోతే…హీరో–హీరో మామ క్యారెక్టరైజేషన్ ట్రాక్‌ను తగ్గించి, హీరో–అతని తండ్రి టాక్‌ను కథలో (Mazaka movie Review) డెవలప్ చేశారు.
పోలీసాఫీసర్ అజయ్‌కి తండ్రీకొడులకు తమ లవ్‌స్టోరీలను వినిపించే సన్నివేశాలతో ‘మజాకా’ సినిమా ప్రారంభం అవుతుంది. తండ్రీకొడుకులు ఒకే ఫ్యామిలీలోని అత్తామేనకోడల్లతో ప్రేమలో పడ్డారని, ఆ అత్తా మేనకోడళ్లకు ఒకరంటే ఒకరు పడరని, వారిని కలిపి, వాళ్లను పెళ్లిచేసుకోవచ్చని భార్గవ వర్మ (మురళీ) పెట్టే కండీషన్స్‌తో తొలిభాగం ముగుస్తుంది. ఒకే ఇంట్లో ఉన్న ఒకరితో ఒకరు çమాట్లాడుకోని… అత్తా కోడళ్ళ ను కలిపేందుకు ఈ తండ్రీకొడుకులు ఎవరికీ వారు చేసిన ప్రయత్నాలు, కలిసి చేసిన ప్రయత్నాలు.. ఫైనల్ గా ఎలా కలిశారు? అన్న సీన్స్‌తో సిని మా ముగుస్తుంది.
తొలిభాగంలో రావురమేష్ –అన్షుల ట్రాక్ హిలేరియస్‌గా ప్రారంభమౌతుంది. కొన్ని సన్నివేశాలు బాగానే ఉంటాయి. ముఖ్యంగా రావురమేష్ క్యారెక్టర్‌కు పక్కన ఉన్న భాస్కరరావు (రఘుబాబు) క్యారెక్టర్‌తో వచ్చే కామెడీ బాగుంటుంది. కానీ రావురమేష్–అన్షులను కలిపే పాయింట్ చాలా ఆసక్తికరంగా ఉండకపోవడం మైనస్‌గా అనిపిస్తుంది. తొలి భాగంలో సందీప్‌కిషన్–రీతూ వర్మల లవ్‌ట్రాక్ కూడా సాదాసీదాయే. తొలిభాగంలో ఉన్న వినోదాన్ని సెకండాఫ్‌లో కొనసాగించలేకపోయాడు దర్శకుడు. ఎమోషన్స్‌పై దృష్టిపెట్టాడు. కానీ వర్కౌట్ కాలేదు. ఆడియన్స్ ఊహించి నట్లుగానే సెకండాఫ్ సాగుతుంది. తండ్రీకొడుకులను ఎమోషన్స్ వైపు తీసుకెళ్లాడు దర్శకుడు. దీంతో హీరో ఫ్రెండ్ హైపర్ అది క్యారెక్టర్‌తో కామెడీ రాబాట్టాలనుకున్నారు. కానీ ఈ రోల్ కామెడీ ఊహించిన స్థాయిలో అలరించకపోవడం ఆడియన్స్‌ను ఒకింత నిరాశపరుస్తుంది. అలాగే మేనత్త–మేనకోడళ్ళు ఎందుకు మాట్లాడుకోరనే పాయింట్ కూడా పెద్ద ఎఫెక్టివ్‌గా ఉండదు. క్లైమాక్స్ సన్నివేశాలు రోటీన్‌గానే ఉంటాయి. కానీ క్లైమాక్స్ ఫైట్ కొరియోగ్రఫీ ఫర్వాలేదనిపిస్తుంది.
పెర్ఫార్మెన్స్
కృష్ణ క్యారెక్టర్‌లో సందీప్‌కిషన్ (Sundeepkishan) బాగానే యాక్ట్ చేశాడు. కామెడీ టైమింగ్ కూడా బాగానే ఉంది. క్లైమాక్స్ ఫైట్, ప్రీ క్లైమాక్స్ ఫైట్ ఫర్వాలేదనిపిస్తాయి. హీరోతో పాటుగా సమానమైన లీడ్ రోల్ ఉన్న కథను సందీప్‌కిషన్ ఒకే చేయడం మంచి విషయమే. ఇక హీరోకు పోటీపోటీగా ఉండే వెంకటరమణ క్యారెక్టర్‌లో రావు రమేష్ (RaoRamesh) అదరగొట్టారు. లవ్‌లెటర్స్ ఇచ్చే సీన్స్‌లో కామెడీ, లేచిపోయే సీన్స్‌లో కామెడీ, సెకండాఫ్‌లో రీతూ–అన్షులతో ఎమోషనల్ సీన్స్‌లో తన యాక్టింగ్ టాలెంట్‌ను మరోసారి నిరూపించుకున్నాడు. మీరాగా రీతూ వర్మ రోల్ ఫర్వాలేదు. కథలో అన్షుకి మంచి క్యారెక్టర్ లభించింది. ఈ పాత్ర నుంచి పెద్ద కామెడీ ఉండదు కానీ..కథను ముందుకు తీసుకెళ్లే పాత్ర ఆమెది. ఇక వ్యాపారవేత్త భార్గవవర్మగా మురళీ శర్మ క్యారెక్టర్ ఎప్పటి లానే ఉంది. ఎఫ్3లో పాజిటివ్ క్యారెక్టర్‌కు, నెగటివ్ అయితే ఎలా ఉంటుందో అలా ఈ సినిమాలో ఉంటుంది. రావురమేష్ ఫ్రెండ్‌గా రఘుబాబు, మురళీశర్మ పీఏగా శ్రీనివాసరెడ్డి, హీరో ఫ్రెండ్‌గా హైపర్ ఆది, పోలీసాఫీసర్‌గా
అజయ్, లోకల్‌రౌడీగా సుప్రీత్ …ఎవరికీ వాళ్లు తమ తమ పాత్రల పరిధి మేరకు చేశారు.
కథను ఇంకొంచెం ఎమోషనల్‌గా రాసి ఉండాలసింది ప్రసన్నకుమార్–సాయికృష్ణ. సెకండాఫ్‌ను బాగానే స్టార్ట్ చేసిన, కోర్ కాన్‌ప్లిక్ట్ రోటీన్‌గా ఉండటం, ఆడియన్స్ ఊహించగలిగే త్యాగాల సన్నివేశాలు వంటి వాటిని రోటీన్‌గా ఉండకుండ ఉండాల్సింది. త్రినాథరావు నక్కిన ఎప్పటిలానే తన రోటీన్ ఫార్ములాతో తీశారు. లియోన్ జేమ్స్ మ్యూజిక్ గట్టిగా వినిపించదు. రాజేష్ దండ నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. కెమెరా వర్క్ ఒకే. ఎడిటింగ్ ఫర్వాలేదు.
ఫైనల్: మజాకా..కాస్త తగ్గింది!
రేటింగ్: 2.5/5