సూర్య కెరీర్‌లోని 45వ (Suriya45) సినిమాకు ‘కరుప్పు’ (Suriya 45 Karuppu) అనే టైటిల్ ఖరారైంది. తమిళ టైటిల్ ఇది. తెలుగులో ‘నలుపు’ అనే అర్థం వస్తుంది. ఆర్‌జే బాలాజీ (RJBalaji) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా కోసం కొంత గ్యాప్ తర్వాత హీరో సూర్య, హీరోయిన్ త్రిషలు కలిసి నటించారు. తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. డీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్‌ఆర్ ప్రభు, ప్రకాష్‌బాబు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తయింది. చిన్న, చిన్న ప్యాచ్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌పై ఓ స్పష్టత రానుంది.
ఈ సినిమాలో సూర్య లాయర్ పాత్రలో నటిస్తున్నట్లుగా తెలిసింది. త్రిష కూడా లాయర్‌గానే కనిపిస్తారట. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో లాయర్ పాత్రకు సంబంధించిన సీన్స్‌ను తీసినప్పుడు, సూర్య లాయర్ గెటప్‌లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే ఈ సినిమాకు కొంత ఆథ్యాత్మిక అంశాలు కూడా ఉన్నాయి. ఇంద్రన్స్, నట్టి, స్వాసిక, అనఘ మాయ రవి, శివద, సుప్రీత్ రెడ్డిలు..ఇతర ప్రధాన పాత్రల్లో యాక్ట్ చేసిన, ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా రిలీజ్ డేట్‌పై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇంకా దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత సూర్య, త్రిషలు కలిసి ఈ సినిమాలో యాక్ట్ చేయడం వల్ల వీరి పాత్రలు సినిమాలో ఎలా ఉంటాయనే విషయంపై సర్వాత్రా ఆసక్తి నెలకొని ఉంది. ‘కంగువ, రెట్రో’ వంటి సినిమాలు ఫ్లాప్స్‌లుగా నిలిచిన తర్వాత సూర్య నుంచి రాబోతున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో అంచనాలు ఉన్నాయి.
మరోవైపు సూర్య ప్రస్తుతం వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో ఓ మూవీ చేస్తున్నాడు. తెలుగు, తమిళం భాషల్లో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. మమితాబైజు హీరోయిన్‌గా కనిపిస్తారు. జీవీ ప్రకాష్‌కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్.