సినిమా (Tamannaah Odela2 Movie Review): ఓదెల 2
ప్రధాన తారాగణం: తమన్నా, హెబ్బాపటేల్, వశిష్ఠ ఎన్.సింహా, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, శరత్, యువ, వంశీ
దర్శకత్వం: అశోక్‌తేజ
నిర్మాణం: డి. మధు
కథ–సూపర్ విజన్: సంపత్‌నంది
కెమెరా: సౌందర్‌రాజన్
మ్యూజిక్: అజనీష్ లోకనాథ్
ఎడిటింగ్: అవినాష్
నిడివి: 2 గంటల 30 నిమిషాలు
జానర్: సూపర్‌నేచురల్– హారర్ థ్రిల్లర్ మూవీ
విడుదల తేదీ: 17 ఏప్రిల్ 2025
కథ
ఓదేలా 2 (Odela2 Movie Review) సినిమా.. ఓదెలా రైల్వేస్టేషన్ మూవీకి సీక్వెల్ గా ఓదెలా 2 రూపొందింది. సో.. ఆడియన్స్ కన్ఫ్యూస్ కాకుండా…ఓదెలా రైల్వేస్టేషన్ కథ ను క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేశారు. అంటే…తిరుపతి ని రాధా ఎందుకు? ఎలా? చంపింది? అన్న కథ ను చూపించారు?
తిరుపతి (వశిష్ఠ )ఆత్మ కు మోక్షం లభించకుండ ఓదెలా గ్రామస్తులు, తిరుపతి శవానికి సమాధి శిక్ష విధిస్తారు. వద్దు అని…తిరుపతి కుటుంబం ఎంత వద్దు అని వారించిన, గ్రామస్తులు పట్టించుకోరు. దీంతో ఓదేలా గ్రామ ప్రజలపై.. తిరుపతి ప్రేతాత్మ ప్రతీకారం తీర్చుకోవలనుకుంటుంది.
అలా.. తిరుపతి ప్రేతాత్మ.. ఊర్లో పెళ్లియినా అమ్మాయి లను, వేరే మనుషుల రూపం లోకి వెళ్లి.. రేప్ చేసి దారుణం గా చంపేస్తుంది. తిరుపతి ప్రేతా త్మ నుంచి తమను కాపాడమని ఓదెలా గ్రామస్తులు శివ శక్తి తమన్నాను ఆశ్రయిస్తారు. అప్పుడు ఏం జరిగింది? తిరుపతి ప్రేతాత్మని ని శివ శక్తి ఎలా నిర్భందించే ప్రయత్నం చేసింది? తిరుపతి ప్రేతాత్మ ఇందుకు ప్రతిగా ఏం చేసింది? తిరుపతి ప్రేతాత్మ వ్యూహానికి..శివశక్తి ఎలా ప్రతివ్యూహం రచించింది? శివ శక్తి ఏం చేసి ఓదెలా ను కాపాడింది? రాధా (హెబ్బా పటేల్) మళ్ళీ ఓదెలా కు వచ్చి, తన అక్క శివ శక్తి కి ఏ విధంగా సాయం చేసిం ది? అన్నదే మిగిలిన స్టోరీ.
విశ్లేషణ
ఓదెలా రైల్వేస్టేషన్ మూవీ లో రాధ (హెబ్బా పటేల్) నరికిన తిరుపతి(వశిష్ఠ) తల తో కనిపిస్తుంది. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది.సేమ్… ఓదెలా 2..కూడా అంతే…రాధ తలను ఓ పాప పోలీస్ స్టేషన్ కి తీసుకు వచ్చే విజువల్స్ తో ఓదెలా 2 స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత కొన్ని రోజుల క్రితం అంటూ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది కథ.
తిరుపతి శవానికి ఓదెల గ్రామస్తులు సమాధి శిక్ష విధించడం, ఓదెలా గ్రామంలో అమ్మాయిలు వరుసగా చనిపోవడం, ఇది తిరుపతి ఆత్మ వల్లే అని అల్లా భక్షు (మురళి శర్మ) చెప్పడం వంటి సన్నివేషాలతో తొలి భాగం సాగుతుంది. చిన్నప్పుడు ఓదేలా గ్రామం నుంచి భక్తి మార్గం వైపు వెళ్లిన రాధా సోదరి భైరవి అలియాస్ నాగసాధువు శివ శక్తి… ని ఓదెలా గ్రామ ప్రజలు కలవడం తో తొలి భాగం ముగుస్తుంది. ఓదెలా గ్రామానికి శివ శక్తి రావడం, తిరుపతి ప్రేతాత్మకి శివ శక్తి. వేసిన బంధనం భగ్నం కావడం, ఫైనల్ గా శివ శక్తి..తిరుపతి ప్రేతాత్మను అంతం చేయడంతో కథ ముగుస్తుంది.
తమ్మన్నా ఇంట్రడక్షన్, తమ్మన్న – వశిష్ఠ ల మధ్య వచ్చే సీన్స్ బాగుంటాయి. సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ పర్వాలేదు. రెండు ఎమోషనల్ సాంగ్స్ ఉన్నాయి. ఈ పాటలు ఓకే. క్లైమాక్స్ మెప్పిస్తుంది. కానీ కొన్ని సీన్స్ లాజిక్ లెస్ గా ఉంటాయి.కొన్ని పాత్రలు సన్నివేశాలు, ఫోర్డ్స్‌గా ఉంటాయి. కొన్ని ఊహాత్మాక సన్నివేశాల సాగదీత ఉంది. భూత ప్రేతాలు, ఆ భూతనాథుడు (శివుడు) ఆధీనంలో ఉంటాయంటారు. అలాం టప్పుడు..ఓ భూతాన్ని సంహరించడం అనేది నంది వల్ల కాకపోవడం అనేది కన్విన్సింగ్‌గా ఉండదు. సినిమాలో కొన్ని పాత్రలు సడన్‌గా మాయం అవుతుంటాయి. ఇంకా సినిమాలో మెయిన్ లీడ్స్‌గా ఉన్నా తమన్నా, వశిష్ట, హెబ్బాలలలో..ఏ ఒక్కరూ త్రూ అవుట్ సినిమాలో ఉండరు.
ఎవరు ఎలా చేశారంటే..
ఈ సినిమా కు ప్రధానబలం తమన్నా. కానీ తమన్నా రోల్ కాస్త లేట్ గా వస్తుంది. కానీ సెకండ్ హాఫ్ లో తమన్నా పెర్ఫార్మన్స్ సూపర్. సినిమా మొదలయినా గంట తర్వాత రాధా గా హెబ్బా పటేల్ స్క్రీన్ పై కనిపిస్తుంది. కానీ కథ ను మలుపు తిప్పే పాత్ర ఇది. సినిమా లో హెబ్బా పటేల్ స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువ. ఇక సినిమాకు మేజర్ హైలెట్ వశిష్ఠ రోల్. కానీ వశిష్ఠ స్క్రీన్ పై ఎక్కువగా కనిపించడు. ఓన్లీ.. వాయిస్ ఓవర్ లోనే ఉంటుంది. ఇది మైనస్ గా అనిపిస్తుంది. కనిపించినంత సేపు తన యాక్టింగ్‌తో అలరిస్తాయి. పకీర్ అల్లా బక్షు గా మురళి శర్మ రోల్ కు బలం ఉండదు. స్క్రీన్ ప్రజెన్స్ కూడా తక్కువే. శ్రీకాంత్ అయ్యంగార్‌కు తొలిభాగంలో మంచి స్కోప్ దొరికింది. నాగమహేశ్, అవినాష్ కురివిల్లా…వంటి వారి పాత్రలు గెస్ట్‌ల మాదిరిగానే సరిపోయాయి.
అశోక్ డైరెక్షన్ ఓకే. కథ లో కొన్ని లోటు పాట్లు ఉన్నాయి. సంపత్ నంది ఇంకాస్త టైట్ గా స్క్రీన్ ప్లే, స్టోరీ ఇంకాస్త టైట్ గా ఉండాల్సింది. తిరుపతి ప్రేతాత్మ తిరిగి రావడం లో, ఆత్మ బలం పుంజు కోవడం లో, తిరుపతి ప్రేతాత్మ..శివశక్తి ని కోరుకోవడం అనేవి.. అరుంధతి ని చూసి, స్ఫూర్తి పొంది నట్లు గా ఉంటుంది. అఖండ కూడా గుర్తుకు రావొచ్చు. కానీ..శివ శక్తి కన్నా… తిరుపతి రోల్ ని బలం గా రాసుకోవడం బాగుంది. క్లైమాక్స్ ని ప్రెసెంట్ చేసిన తీరు బాగుంది. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం ఆజనీష్ లోకనాధ్ మ్యూజిక్ఆర్ ఆర్ బాగుంది. విఎఫ్ ఎక్స్ ఇంకాస్త బావుంటే బాగుండేది. విజువల్స్ ఓకే.
బాటం లైన్ : పరమాత్మ వర్సెస్ ప్రేతాత్మ
రేటింగ్ : 2.50/5